CM Jagan Humanity: బడుగు బలహీన వర్గాలకు దేవుడిగా మారుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ఇప్పటికే పేదల కోసం పలు సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) ప్రవేశపెట్టిన ఆయన.. సాయం అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటున్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ అభయహస్తమిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు తన మానవత్వం చాటుకున్నారు. తాజాగా మరోసారి సీఎం చలించిపోయారు. మదనపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి ఓ బాలుడి దీర్ఘకాలిక వ్యాధి గురించి విని తీవ్ర ఆవేదన చెందారు. ఆ బాలుడికి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
బుధవారం మదనపల్లెలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నుంచి 4వ దశ జగనన్న విద్యా దీవెన నగదును విడుదల చేసేందుకు వచ్చిన సీఎం.. హమీద అనే మహిళ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన బిడ్డ మహమ్మద్ అలీతో కలిసి సభా వేదిక వద్ద నిల్చుంది. బిడ్డతో సహా నిలబడిన మహిళను గమనించిన సీఎం.. కార్యక్రమం తరువాత ఆ మహిళ దగ్గరకు వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అలీ వ్యాధి గురించి విని సీఎం చలించిపోయారు.
తన బిడ్డ తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స చేయించడానికి ఆర్థిక స్థోమత సరిపోక ఇబ్బందులు పడుతున్నా`మని హమీద సీఎం జగన్‌కు వివరించింది. ముఖ్యమంత్రి వెంటనే ఆమెకు ఆర్థికపరమైన సహాయం అందచేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పీ.ఎస్. గిరీష వెంటనే స్పందించి సీఎం కార్యక్రమం తరువాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో 1,00,000 రూపాయల చెక్కును బాలుడు తల్లి హమీదకు అందించారు. అలాగే నెలవారీ 3000 రూపాయల పింఛను అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి : వావ్.. లడక్ లో బైక్ పై రయ్ రయ్.. నారా బ్రహ్మణిలో ఆ టాలెంట్ కూడా ఉందా?
అంతకుముందు కూడా.. మదనపల్లె పర్యటనలో భాగంగా బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్లే సమయంలోనూ సీఎం మానవత్వం చాటుకున్నారు. అప్పటికే రోడ్డుకు ఇరువైపులా ప్రజలు, వైయస్ఆర్ సీపీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. అంత హడావుడిలోనూ ఓ అంబులెన్స్ రాకను గమనించిన సీఎం వైయస్ జగన్.. దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సూచించారు. సీఎం కాన్వాయ్ బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చారు. ఆ సమయంలో అంబులెన్స్ నుంచి పేషెంట్ బంధువులు చేతులెత్తి సీఎం వైయస్ జగన్‌కు నమస్కరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Helping, HUMAN STORY