హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Omicron Tension in AP: ఏపీలోని మరో జిల్లాలో ఒమెక్రాన్ టెన్షన్.. ఆ ముగ్గురి శాంపిల్స్ పై ఉత్కంఠ

Omicron Tension in AP: ఏపీలోని మరో జిల్లాలో ఒమెక్రాన్ టెన్షన్.. ఆ ముగ్గురి శాంపిల్స్ పై ఉత్కంఠ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కరోనా మహమ్మారి (Corona Virus) మరోసారి ప్రజలపై పంజా అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రకాలుగా జన్యుపరమైన వృద్ధి చెందుతున్న కరోనా వైరస్... మ్యూటెంట్, డబుల్ మ్యూటెంట్, డెల్టా, డెల్టా ప్లస్.., ప్రస్తుతం ఒమిక్రాన్ (Omicron Variant) అంటూ రూపాంతరం చెంది మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది.

ఇంకా చదవండి ...

  GT Hemant Kumar, Tirupathi, News18

  కరోనా మహమ్మారి (Corona Virus) మరోసారి ప్రజలపై పంజా అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రకాలుగా జన్యుపరమైన వృద్ధి చెందుతున్న కరోనా వైరస్... మ్యూటెంట్, డబుల్ మ్యూటెంట్, డెల్టా, డెల్టా ప్లస్.., ప్రస్తుతం ఒమిక్రాన్ (Omicron Variant) అంటూ రూపాంతరం చెంది మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. ఆఫ్రికా నుంచి అమెరికా, ఐరోపా దేశాలకు వ్యాపించిన ఈ ప్రమాదకర వేరియట్.. భారత్ లోనూ గుబులు రేపుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒమిక్రాన్ భయం నెలకొంది. ఐతే ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈ భయం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరుకు అత్యంత దగ్గర ఉండే ప్రాంతం అనంతపురం. ఇక్కడ నిత్యం దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బెంగళూరుకు.., అక్కడి నుంచి అనంతకు వస్తుంటారు.

  ఇప్పటికే కర్ణాకట రాష్ట్ర రాజధానిలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్లు అక్కడి ఆరోగ్య శాఖా అధికారులు స్పష్టం చేశారు. దీంతో అనంతలో హై టెన్షన్ మొదలైంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ నుంచే కాకుండా విదేశాల నుంచి భారీ సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులు అనంతకు విచ్చేసినట్లు ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. ఒమిక్రాన్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై జేసీ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విదేశాలు, వివిధ విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన ప్రజలపై అరాతీసే పనిలోపడ్డారు.

  ఇది చదవండి: ఏపీలో ఒమిక్రాన్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.., కొత్త వేరియంట్ పై కీలక ప్రకటన


  కేంద్రం నుంచి వచ్చిన జాభితా ప్రకారం నవంబర్ 30వ తేదీ వరకు 274 మంది, ఈ నెల 1 నుంచి 4వ తేదీ వారలు మరో 197 మంది వచ్చినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందులో తొలి విడతగా 410 మందిని గుర్తించే పనిలో నిమగ్నమైయ్యారు అధికారులు. తొలి విడతలో విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 410 మందికి కరోనా పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమైయ్యారు అధికారులు. అందులో ఇప్పటికే 300 వందల మందిని గుర్తించి వారికీ ఆర్టీపిసిఆర్ టెస్టులు నిర్వహించారు. ఇందులో ముగ్గురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది.

  ఇది చదవండి: గ్రామ సచివాలయాల్లో ఏటీఎంలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..


  అయితే వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. వారికి సోకిన వేరియంట్ సాధారణ కరోనానా.. లేక ఒమెక్రాన్ వేరియంటా అని తెలుసుకునేందుకు శాంపిల్స్ ను హైదరాబాద్ లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యూల్ బయాలజీ ల్యాబ్ కు పంపించారు. అక్కడ ఆ వేరియంట్ గుర్తించే వరకు అనంత వాసుల్లో భయం వీడేలా కనపడటం లేదు. పాజిటివ్ గా తేలిన వారి ప్రైమరీ కాంటాక్ట్ కోసం గాలిస్తున్నారు రెవెన్యూ., ఆరోగ్య విభాగం అధికారులు. టెస్టులు చేసిన వారు పొగ మిగిలివారిలో 89 మంది ఆచూకీ లభ్యం కావడం లేదట. ఇంకొందరు తప్పుడు చిరునామా ఇచ్చినట్లు తేలింది. విదేశాల నుంచి వచ్చిన వారి ప్రైమరీ, సెకండరీ, కాంటాక్ట్ వివరాలను సేకరిస్తున్నారు. వారి నమూనాలని కూడా ల్యాబ్ కు పంపిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Corona virus, Omicron corona variant

  ఉత్తమ కథలు