TIRUPATI OLD MAN STARTED PROTEST FOR PENSION AT TAHASILDAR OFFICE IN TIRUPATI FULL DETAILS HERE PRN TPT
AP Pensions: పింఛన్ కోసం పోరాటం.. వృద్ధుడి వినూత్న నిరసన..
నిరసన తెలుపుతున్న దామోదర నాయుడు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సంక్షేమ పథకాల (AP Welfare Schemes) ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లకు అధిక ప్రాధాన్యమిస్తోంది. కానీ ఓ వృద్ధుడు పెన్షన్ కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సంక్షేమ పథకాల (AP Welfare Schemes) ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లకు అధిక ప్రాధాన్యమిస్తోంది. అందుకే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందిస్తోంది. అర్హులైన వృద్దులకు వేకువజాము నుంచే పింఛన్ పంపిణి చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు గ్రామా వాలంటీర్లు. కొన్ని అనివార్య కారణాలవల్ల కొందరు వృద్దులు పింఛన్లు కోల్పోతున్న పరిస్థితులు వరుసగా చూస్తున్నాం. అధికారుల తప్పిదాలకు కొందరు పింఛన్ కోల్పోతుంటే మరి కొందరు ఆధార్, ఇతర గుర్తింపు కార్డులో నమోదైన తప్పుడు వివరాల వల్ల పింఛన్ కోల్పోతున్న పరిస్థితి. వితంతు పింఛన్ పొందుతున్నట్లు వృద్ధ పురుషునికి., వికలాంగ పింఛన్ పొందుతున్నట్లు వృద్ధ మహిళల పేర్లు నమోదు కావడం తప్పుడు రికార్డ్ వల్ల ఎందరో పింఛన్ అందడంలేదు.
ఇక పండు ముసలమ్మలకు ఆధార్ కార్డులో 16 లేదా 30 సంవత్సరాలు ఉండటంతో పింఛన్ తొలగించిన సందర్భాలు ఎన్నో. ఆఫీసుల చుట్టూ తిరిగి వృద్ధుల చొప్పులు అరిగిపోవడంతో చేసేదేమి లేక మౌనంగా ఉండిపోతున్నారు. కానీ ఓ వృద్ధ రైతు మాత్రం తనకు పింఛన్ రాలేదంటూ ప్రభుత్వ కార్యాలయంలో వినూత్న నిరసన తెలియజేసిన ఘటన తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో చోటు చేసుకుంది.
ఒకటవ తారీఖున రావాల్సిన పింఛన్ వారం గడుస్తున్నా రాక పోవడంతో తిరుపతి జిల్లాకు చేందిన ఓ వృద్ధ రైతు దామోదర్ నాయుడు వినూత్న నిరసన చేపట్టారు. తాను పండించిన పండ్లు, కూరగాయలతో మాలను ధరించి తన స్వగ్రామం దానమూర్తిపల్లె నుంచి మండల కేంద్రమైన చంద్రగిరి వరకు దాదాపు 17 కిలోమీటర్లు కాలి నడకన నిరసన వ్యక్తం చేస్తూ చంద్రగిరి తహసిల్దార్ కార్యాలయంకు చేరుకుని ఫింఛన్ మంజూరు చేయాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అటుతరువాత తహసీల్దారు కార్యాలయం ముందు మోకాళ్ళపై నిలుచుని "ఫించన్ లేక "తాతయ్యలు", మందులు లేక "అవ్వలు".. రేషన్ బియ్యం లేక తాతయ్యలు, అన్నం లేక అవ్వలు అంటూ ఫ్లేకార్డు ప్రదర్శన చేస్తూ తనదైన శైలిలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వృద్ధ రైతు దామోదర్ నాయుడు మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలు చట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నా తనకు ఫింఛన్ మంజూరు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అమరావతిలో సీఎం ఒకటో తారీఖున అందరికి ఫింఛన్ ఇవ్వాలని చెప్తే, అధికారులు మాత్రం అందుకు విరూడ్డంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని వృద్దుల కోసం ప్రతి నెల ఒకటో తారీఖు కంతా ఫింఛన్, రేషన్ బియ్యం మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.