Tirumala Temple: తిరుమల భద్రతకు సరికొత్త టెక్నాలజీ.. డీఆర్డీఓ సహకారంతో కట్టుదిట్టమైన భద్రత

ప్రతీకాత్మకచిత్రం

Tirumala: శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమల ఆలయానికి దేశవిదేశాల నుంచి వస్తుంటారు.

  • Share this:
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమల ఆలయానికి దేశవిదేశాల నుంచి వస్తుంటారు. దీంతో తిరుమలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంటారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల ఆలయంపై ఉగ్రదాడి జరిగే ముప్పు ఉన్న కారణంగా.. వాటిని తిప్పికొట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డ్రోన్ జామర్ టెక్నాలజీని తిరుమల కొండపైన ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల జమ్మూలోని వైమానిక స్థావరంపై ఉగ్ర మూకలు డ్రోన్ల దాడి జరిపిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించింది. ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ టెక్నాలజీతో చెక్ పెట్టాలని నిర్ణయించింది. మొదటగా ఈ టెక్నాలజీని తిరుమల కొండపై ఉపయోగించనున్నారు. ఇలా దేశంలో ఒక ఆలయంపై యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే ప్రథమం. ఈ టెక్నాలజీతో తిరుమల కొండకు మరింత భద్రత కల్పించనున్నారు.

డీఆర్డీఓ తన యాంటీ డ్రోన్ టెక్నాలజీని జూలై 6న కర్ణాటకలోని కోలార్ వద్ద విజయవంతంగా ప్రదర్శించింది. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు శాఖల ప్రతినిధులతో పాటు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ చీఫ్ గోపీనాథ్ జెట్టి హాజరయ్యారు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఈ వ్యవస్థను తిరుమల కొండపై ఏర్పాటు చేసేందుకు మొత్తం రూ.25 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. త్వరలోనే డ్రోన్ జామర్ వ్యవస్థను తిరుమలకు తీసుకురానున్నారు.

ఇది చదవండి: ఏపీలో కొత్త తరహా స్కూళ్లు.., విద్యావిధానంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..


రూ.25 కోట్ల ఖర్చుతో ఏర్పాటు..
ఉగ్రవాదుల డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. డి-4 డ్రోన్ వ్యవస్థగా పిలిచే దీని ద్వారా డ్రోన్ దాడుల ముప్పు నుంచి దేశ రక్షణ కేంద్రాలను కాపాడుకోవచ్చు. ఈ టెక్నాలజీ సహాయంతో నాలుగు కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై దాడి చేయవచ్చు. డి-4 డ్రోన్ వ్యవస్థలో సెన్సార్లు, డిటెక్షన్, జామింగ్, కౌంటర్‌మెషర్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు. డీఆర్డీఓకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈ పరికరాలను అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా డ్రోన్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, హోర్డ్వేర్ను నాశనం చేయవచ్చు. సాధ్యమైనంత తర్వలోనే తిరుమల కొండపై ఈ టెక్నాలజీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల శ్రీశైలం ఆలయంపై డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో టీటీడీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించకుంది.
Published by:Purna Chandra
First published: