హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు...! బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ చేతికి..

Andhra Pradesh: ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు...! బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ చేతికి..

లావణ్య (ఫైల్)

లావణ్య (ఫైల్)

సాధారణంగా చనిపోయిన వ్యక్తుల పేరిట డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం బ్రతికున్న మహిళ చేతిలో ఆమె డెత్ సర్టిఫికెట్ పెట్టారు..

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

మరణం అనేది ఈ ప్రపంచంలో సర్వసాధారణం. చనిపోయిన వ్యక్తుల డెత్ సర్టిఫికెట్ కోసం స్థానిక మునిసిపల్, గ్రామ సచివాలయంలో కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుంటారు. ఇంట్లో ఎవరు అయిన చనిపోతే వారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి అంటే ప్రత్యేక పద్ధతి ఉంటుంది. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతూ మృతిచెందిన వారి వివరాలు మునిసిపల్ కార్యాలయానికి చేరవేస్తుంది ఆసుపత్రి యాజమాన్యం. అదే సహజంగా మరణించిన వారి వివరాలు శ్మశానవాటిక ద్వారా సమాచారం మునిసిపల్ కార్యాలయానికి మరణించిన వారి వివరాలు అందుతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా మరణాలను ధృవీకరిస్తారు. ఇందుకు సచివాలయాల పరిధిలోని గ్రామ,వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వ వెబ్ సెట్లో పొందుపరుస్తారు. ఇదిలా ఉంటే ఓ మహిళకు మాత్రం ఊహించని పరిణామం ఎదురైంది. ఎవరైనా మీరు చనిపోయారు అంటూ మీకే చెపితే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ పేదింటి మహిళకు ఎదురైంది. తాను చనిపోయినట్లు తనకే చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని శేషపురంలో మనోహర్, లావణ్య అనే దంపతులు నివసిస్తున్నారు. మనోహర్ దివ్యంగుడు కావడంతో మొబైల్ షాప్ లో మొబైల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇక లావణ్య కుటుంబ పోషణ కోసం కూలి పనికి వెళ్తోంది. గత ఏడాదిగా నూతన రేషన్ కార్డు కోసం గ్రామా సచివాలయ సిబ్బంది చుట్టూ ప్రదిక్షణలు చేస్తోంది. అయినా వార్డ్ వాలంటీర్లు కానీ, సెక్రటరీలు కానీ ఆమెకు తగిన న్యాయం చేయక పోగా ఈరోజు రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. అయినా విసుగు చెందకుండా వారి చుట్టూ తిరుగూతూనే ఉంది. చివరగా రేషన్ కార్డు ఆన్లైన్ అప్లికేషన్ లో నమోదు చెస్తుండగా.... లావణ్య పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మరణించినట్లు ప్రభుత్వ వెబ్ సైట్ లో నమోదు అయినట్లు చూపిస్తోంది.


ఇది చదవండి: ఏపీకి భారీ వర్షసూచన... 3 రోజులు అలర్ట్..


దీంతో బ్రతికి ఉన్న నన్ను ఎలా చంపేస్తారని ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించింది. అయితే కార్యాలయ సిబ్బంది మాత్రం వార్డు సచివాలయంలో కలవాలని చెప్పడంతో అక్కడ నుంచి వెనుదిరిగింది. గత రెండు వారాలుగా ఎమ్మెల్యే, ఎంఆర్ఓ అంటూ వివిధ అధికారులను కలసిన ప్రయోజనం లేకుండ పోతోందంటూ.... లావణ్య కన్నీరు మున్నీరు అవుతోంది.

ఇది చదవండి: ఏపీలోని ఈ మండలాల్లో హై అలర్ట్.. లాక్ డౌన్ తప్పదేమో..!


తనకు జరిగిన బాధను లావణ్య చెపుతూ...'చిన్ననాటి ఉన్న ఊరిలోనే వివాహం చేసుకొని నివాసం ఉంటున్నాం. ఇక్కడ మా అమ్మకు చెల్లి కొడుకు వార్డ్ వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కానీ ఆ కుటుంబానికి మాకు చిన్ననాటి నుంచే విబేధాలు ఉన్నాయి. విబేధాల కారణంగా మా వాలంటీర్ మా బంధువే కావడం, వారి కుటుంబంతో విబేధాలు ఉండటంతో నా కుటుంబానికి ఇంతవరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందలేదు. నా భర్త 90 శాతం అంగ వైకల్యం చెందిన వాడు.. అతనికి కూడా పెన్షన్ రాకుండా అడ్డుకున్నారు. ఇక రేషన్ కార్డు కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటికి ఆ కార్డును మాకు అందించలేదు. కారణం తెలుసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న మాకు ఎలాంటి న్యాయం జరగటం లేదు.. ఇప్పుడు ఏకంగా నాపై కక్ష గట్టిన మా సమీప బంధువు నేను చనిపోయానంటూ మరణ ధ్రువీకరణ పాత్రని ఆమోదింప చేసి... నాకు పథకాలు రాకుండా చేసాడు. ఇదేంటి అని నేను ఎమ్మెల్యే, ఎంఆర్ఓల చుట్టూ తిరిగిన నాకు న్యాయం జరగలేదు. మీడియా ద్వారానైనా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్న' అని లావణ్య తన ఆదేనను వెళ్లగక్కింది.

ఇది చదవండి: 80 ఏళ్ల వయసులో భార్యభర్తల మధ్య గొడవ... ఎవరూ తగ్గలేదు... చివరికి ఏం జరిగిందంటే..!

First published:

Tags: Andhra Pradesh, Chittoor, Death

ఉత్తమ కథలు