హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD News: టీటీడీకి భారీగా విదేశాల్లో భూములు.. ఎన్ఆర్ఐలు సిద్ధం.. మరి పాలకమండలి నిర్ణయం ఏంటి

TTD News: టీటీడీకి భారీగా విదేశాల్లో భూములు.. ఎన్ఆర్ఐలు సిద్ధం.. మరి పాలకమండలి నిర్ణయం ఏంటి

విదేశాల్లో భూములు ఇచ్చేందుకు ఎన్ఆర్ఐలు సిద్ధం

విదేశాల్లో భూములు ఇచ్చేందుకు ఎన్ఆర్ఐలు సిద్ధం

Tiruama Tirupati News: యావత్ భారత దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా వరకు ఆస్తులు ఉన్నాయి. అయితే ఇప్పుడు విదేశాల్లోనూ భూములు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి దీనిపై టీటీడీ పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

Tirumala Tirupati Devasthanm:  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు..  ఆపద మొక్కుల వాడైన శ్రీ వేంకటేశ్వరుడు (Lord Venkateswara) కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కాబట్టే.. శ్రీవారికి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరిక నెరవేరిన వెంటనే హుండీ (Hundi)లో కానుకల రూపంలో భక్తులు నగదుతో పాటు బంగారు., వెండి ఆభరణాలు (Gold and Silver  ornaments), మణులు మాణిక్యాలు పొదిగి కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు సమర్పిస్తారు.  స్వామి వారి పేరుతో కోట్లు విలువ చేసే స్థిరాస్థులు ఉన్నాయి. వాటిని కూడా భక్తులు.. శ్రీవారి పై ఉన్న అపారమైన భక్తి శ్రద్దలతో సమర్పించినవే. ఇలా స్వామి వారికీ దేశవ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల సాగు, ప్లాట్లు, ఇళ్లు  విరాళంగా సమర్పిస్తున్నారు.

మరి టీటీడీ (TTD) దగ్గర ఉన్న భూములను ఎలా పరిరక్షిస్తోంది..  వాటి నిర్వహణా బాధ్యత ఎవరిది..? స్వామి వారికి ఎంతో భక్తి శ్రద్దలతో భూములను కానుకలుగా సమర్పిస్తున్నారు. ఇలా సమర్పించిన భూములను టీటీడీ రెవెన్యూ శాఖతో పాటుగా.... ఆ ప్రాతంలోని దగ్గరలో ఉన్న టీటీడీ ఆలయ అధికారులు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. పర్యవేక్షణ కష్టతరంగా మరీనా భూములను ప్రత్యేక పద్ధతి ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సరైన మార్గంగా భూములను అద్దె ప్రతిపాదికన ఆక్షన్ విధానంలో కేటాయిస్తూ ఉంటారు టీటీడీ అధికారులు.

ఇదీ చదవండి : మంత్రి ప‌ద‌వులు ఇచ్చినా అసంతృప్తే.. సీనియర్ల అలకపాన్పుకు కారణం అదేనా..?

దాతలు ఇచ్చిన భూములు., భవనాలు., సాగు భూములను  మూడు ఏళ్ళకు ఒకమారు ఆక్షన్ వేస్తారు. అధిక అద్దె చెల్లించే విధంగా వేలంపాట వేసిన వారికి నిర్వహణ బాధ్యతలు ఇస్తారు. ప్రభుత్వ సంస్థలకు., ధార్మిక సంస్థలు, కార్యక్రమాలకు సైతం భూములను ఆక్షన్ విధానంలో అద్దె ప్రతిపాదికన కేటాయిస్తున్నారు.

ఇదీ చదవండి : ఆ గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తన్న చిరుత..? ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక

ప్రతి మూడేళ్లకు ఈ ఆక్షన్ కచ్చితంగా నిర్వహిస్తారు. ఇలా స్వామి వారి భూములను ప్రైవేట్ వ్యక్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మిక సంస్థ అయినప్పటికీ దేవాదాయశాఖ నిబంధలు అనుగుణంగా భూముల నిర్వహణ బాధ్యతలు చేస్తున్నారు. భక్తులు విరాళంగా అందించిన సాగు భూమి రెండు వేల ఎకరాలు ఉన్నట్లు టీటీడీ అధికారిక అంచనా.

ఇదీ చదవండి : సీఎం జగన్ కేబినెట్ కూర్పు వెనుక బ్రదర్ అనిల్.. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటిస్తుందా..?

ఇక ప్లాట్లు., భవనాలు 29056843.88 స్క్వాయర్ యర్డ్స్ ఉన్నట్లు గతంలో శ్వేతపత్రం విడుదల చేసారు. గతంలో నిరర్ధక ఆస్తులు వేలం వేసిన టీటీడీ... 1974 నుంచి 2014 వరకు వేలం 120కి పైగా ఆస్తులు వేసినట్లు చెపుతున్న టీటీడీ రికార్డ్స్ చెబుతున్నాయి.

ఇదీ చదవండి : థ్యాంక్స్ గివింగ్ నోట్ ఇస్తే.. రాజీనామా అన్నారు.. మాజీ హోం మంత్రి క్లారిటీ

టీటీడీ రెవెన్యూ రికార్డుల ఆధారంగా 1974 నుంచి 2014 వరకు 129 ఆస్తులను విక్రయించనట్లు రికార్డులు ఉన్నాయి. చంద్రబాబు హయంలో 15 నుంచి 20 ఆస్తులను వేలంవేసినట్లు సమాచారం.  శ్రీవారి ఆస్తులను ఎలా కాపాడుకోవాలి? భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా వ్యవహరించాలి? అనే దానిపై ధార్మిక సంస్థలు, నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా.. కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు.  ప్రస్తుతం సాగు భూమి రెండు వేల ఎకరాలు....ప్లాట్లు., భవనాలు 29056843.88 స్క్వాయర్ యర్డ్స్ ఉండగా వీటి విలువ కొన్ని వందల కోట్లు విలువ చేస్తాయని రెవెన్యూ శాఖా అధికారులు చెప్తున్నారు.

ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మాయిల కోసం ప్రత్యేక కాలేజీలు.. 8వ తరగతి నుంచి ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం

భూములు స్వామి వారికీ విరాళం ఇవాలంటే ఏంచేయాలి.... అందుకు ఉన్న నియమాలు ఏంటి...? శ్రీ వేంకటేశ్వరునికి విలువైన స్థిరాస్తులు కానుకగా సమర్పించాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. స్వామి వారికీ సమర్పించాలకుంటున్న మాణ్యాలపై ఎలాంటి వివాదాలు ఉండరాదనే నియమాలు ఉన్నాయి.  ఎలాంటి సమస్యలు లేని భూములు.... అదికూడా భారత దేశంలో ఉన్న భూములు మాత్రమే విరాళంగా తీసుకుంటున్నారు.  ఇదంతా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం టీటీడీ విరాళంగా తీసుకుంటుంది.

ఇదీ చదవండి : ఏపీలో మరో బాదుడు.. ఆర్టీసీ చార్జీలు పెంచుతూ నిర్ణయం.. కొత్త ఛార్జీలు ఇలా

తాజాగా టీటీడీకి విరాళంగా విదేశాల్లో భూములు ఇచ్చేందుకు ఎన్ఆర్ఐ భక్తులు సిద్ధం అయ్యారు.  టీటీడీ పాలకమండలిదే తుది నిర్ణయం. అయితే

చరిత్రలో మొట్టమొదటి సారితిరుమల తిరుపతి దేవస్థానంకు విదేశాల నుంచి భూమి విరాళం ఇచ్చేందుకు సిద్ధమైయ్యారు. సీషెల్స్ రాజధాని అయినా విక్టోరియాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయుడు రామకృష్ణ పిళ్ళై శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం  భూమిని కేటాయించేందుకు సిద్ధం అయ్యారు.

ఇదీ చదవండి : రోజా మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు ముద్దు పెట్టిన కూతురు.. భర్త ఏం చేశారంటే.. ఆమె తొలి సంతకం దేనిపై అంటే..?

సీషెల్స్ లో అత్యధికంగా హిందూ సమాజం ఉందని తెలిపిన పిళ్ళై.... ఇప్పటికే అక్కడ గణపతి ఆలయాలను నిర్మించినట్లు తెలిపారు. విదేశీ పర్యాటకులను సైతం గణేష్ ఆలయం ఆకర్షిస్తుందని తెలిపారు. కోటి విలువ చేసే రెండెకరాల భూమిని కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు టీటీడీకి దేశవ్యాప్తంగా మాత్రమే భూములు ఉన్నాయని తెలిపారు టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి.

ఇదీ చదవండి : సీఎం జగన్ ఆఫర్ ని తిరస్కరించిన మాజీ మంత్రి కొడాలి నాని.. కారణం అదేనా..?

విదూశాల్లో భూముల  విరాళం స్వీకరణపై టీటీడీ పూర్థిస్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాత కోరిన కోరిక మేరకు.... విక్టోరియాలో ఆలయ నిర్మాణంపై టీటీడీ పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసారు. టీటీడీ పాలకమండలి తీసుకున్నా నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala news, Ttd news

ఉత్తమ కథలు