• Home
 • »
 • News
 • »
 • andhra-pradesh
 • »
 • TIRUPATI NO STRONG LEADERS FOR TELUGU DESHAM PARTY IN YSR KADAPA DISTRICT AS YSRCP GOT TRIUMPHING VICTORY IN LOCAL BODY ELECTIONS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Telugu Desham Party: అక్కడ సైకిల్ తొక్కే నేతలే లేరా..? తమ్ముళ్ల గోడు వినేదెవరు..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి ధీటుగా నిలబడాలి.. కానీ ఆ జిల్లాలో మాత్రం కనీసం పోటీ చేయడానికి నేతలే లేని పరిస్థితి నెలకొంది.

 • Share this:
  పంచాయతీలో ఎదురుదెబ్బ. పురపోరులోనూ అదే దెబ్బ. ఎక్కడైతే బలంగా ఉండాలి అనుకుంటున్నారో అక్కడే కోలుకోలేకుండా దెబ్బతిన్నారు. అయితే నాయకులు వెన్నంటి ఉంటూ అదికార పార్టీతో తలపడే క్యాడర్ ఉన్నా.., నాయకులే కరుమగవ్వడంతో క్యాడర్ మొత్తం నిరుత్సాహానికి గురైంది. రానున్న రోజుల్లో క్యాడర్ భవితవ్యం ఎంటీ.? పార్టీ బలపడి నిలదొక్కుకొవడం ఎలా..? ఇది కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతున్న అనుమానాలు. కడప జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి సొంత జల్లా. ఈ జిల్లాలోనే టిడిపి బలపడాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నం. ఐతే బలపడటమేమో గానీ.., ఇప్పుడు పార్టీ కోలుకోలేని దెబ్బతినింది. కనీసం పోరాటపటిమ లేక చతికిలపడి భవిష్యత్తుపై క్యాడర్లో మనోధైర్యాన్ని కోల్పోయేలా తయారైంది పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాలను, రెండు పార్లమెంట్ స్ధానాలను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గ్రామ పంచాయతీ, పురపాలిక ఎన్నికల్లోను కోలుకోలేని దెబ్బతింది. ఈసీ అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేస్తాం.., నిర్బయంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటూ భరోసానిచ్చినా.., జిల్లాలో కనీసం అధికార పార్టీకి ధీటుగా పోటీ చేసే స్థాయిలో కూడా నిలబడలేకపోయింది.

  పంచాయతీ ఎన్నికల్లో చూస్తే చాలా మంది నియోజకవర్గ ఇన్ చార్జులు చుట్టం పుచూపుగానే కార్యకర్తలకు కనిపిస్తూవచ్చారు. సొంతగా ఖర్చు చేసుకొని పోటీ చేసే కార్యకర్తలు, దిగువశ్రేణి నేతలున్నా.. వారికి వెన్నుదన్నుగా నిలవాల్సిన నేతలు మాత్రం కనుమరుగయ్యారు. దీంతో చాలా చోట్ల అధికార పార్టీతో పోటీలో నిలబడే అభ్యర్ధులే కరువయ్యారు. ఒకానొక దశలో ఈసీ కఠిన వైఖరి కారణంగా ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ అభ్యర్ధులకు చుక్కలుచూపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీకి నేతే కరువవ్వడంతో అక్కడ అధికార పార్టీ వర్సెస్ బిజేపిగానే పోటీ సాగింది. ఇక కమలాపురం నియోజకవర్గంలో టిడిపి ఇన్ చార్జి పుత్తా నరసింహారెడ్డి కాస్త మెరుగనిపించినా వైసీపీపై పైచెయ్యి సాధించలేకపోయారు. ఇక మైదుకూరులో మాత్రం ఏకంగా టిడిపి ఇన్ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ స్వగ్రామం సర్పంచ్ స్థానాన్ని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు సహకరించడంతో ఎక్కువ స్థానాల్లో టిడిపి గెలుపొందిన రాజకీయ చాణిక్యాన్ని చాటుకోలేక ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోలేకపోయారు. దీంతో అటు పంచాయతీల్లోను, పురపోరులోను పరువు కాపాడుకోలేకపోయారు.

  ఇది చదవండి:  కడప పేలుడులో పెరిగిన మృతులు.. స్పందించిన సీఎం జగన్


  పులివెందులలో ఇక టిడిపి కథ ముగిసిందన్న విధంగా ఈ ఎన్నికల్లో సత్తా చాటుకోలేక చితికిలపడిపోయింది. రాయచోటిలోనూ అదే పరిస్ధితి. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ముందస్తు వ్యూహాలతో ఎన్నికల ఏకగ్రీవాలతో సత్తా చాటుకుంటే టిడిపి మాత్రం నామమాత్రపు పోటితో సరిపెట్టుకుంది. రాజంపేటలో టిడిపి ఇన్ చార్జి బత్యాల చెంగల్ రాయులు స్థానికేతరుడు కావడంతో బలమైన క్యాడర్ ఉన్నా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని ఎదుర్కొలేకపోయారు.

  ఇది చదవండి: పవన్ హెల్త్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే.. గుడ్ న్యూస్ చెప్పిన వకీల్ సాబ్


  నియోజకవర్గం మొత్తం బాలమైన క్యాడర్ ఉన్నా.., రైల్వేకోడూరులోనూ తెలుగు తమ్ముళ్లు అధికార పార్టీ హావాను అడ్డుకోలేకపోయారు. బద్వేలులోను కొంత వరకు పర్వాలేదనిపించినా.., వైసిపిదే పైచెయ్యిగా నిలిచింది. ఇక జిల్లా కేంద్రమైన కడపలో అయితే మరి దారుణం. కనీసం సగం స్థానాల్లోను అభ్యర్ధులు పోటీ చేయించలేకపోయారు. సొంతగా పోటీచేసిన అభ్యర్ధులకు మనోధైర్యాన్ని ఇచ్చే దిక్కులేకుండాపోయారంటూ పలువురు అభ్యర్ధులు పెదవి విరిచారంటే నేతలు ఎంతగా దూరంగా ఉండిపోయారో అర్ధం చేసుకోవచ్చు.

  ఇది చదవండి: భార్యను చంపి శవంతో సెల్ఫీ... వీడు కిరాతకుడు కాదు... అంతకుమించి...


  అధికారం దూరమై రెండేళ్లు కూడా గడవక ముందే పరిస్ధితి ఇలా ఉంటే రానున్న మూడేళ్లు క్యాడర్ పరిస్ధితి ఎంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా మంది నేతలు పార్టీ అధికారంలో ఉండగా తామేమీ సంపాదించుకోలేదు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఎవరికి వారే చూసుకోవలన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటి వరకు ప్రతి నిత్యం తమ చుట్టు తిప్పుకున్న నేతలు ఇప్పుడు కనిపించడమే కరువైందంటూ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తొంది. ఇలా నేతల తీరు చేసిన క్యాడర్.., రానున్న రోజుల్లో తమ భవితవ్యం ఏంటనే గందరగోళంలో పడినట్లు కనిపిస్తొంది. పరిస్ధితి ఇప్పుడు ఇలా ఉంటే రానున్న మూడేళ్లు తమను పట్టించుకునే వారువ్వరంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇంత కాలం గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్లు అయా రాజకీయ పార్టీల నాయకులతో తలపడి ఇప్పుడు ఇలా ఎలా ఉండాలో అర్ధం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని ముందుకు నడిపించే పట్టుదల తమలో ఉన్నా... కనీసం మనోధైర్యం నింపే నేతలు కనుమరుగవ్వడమే ఇప్పుడు వారిలో నిరుత్సాహం కనిపిస్తోంది.
  Published by:Purna Chandra
  First published: