Andhra Pradesh: కొవిడ్ వార్డుల్లో కనిపించని డాక్టర్లు.. ఒక్క ఐడియాతో అంతా సెట్ రైట్..

తిరుపతి రుయా ఆస్పత్రి

కరోనా వార్డు అంటే 24గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. నిత్యం రోగుల బాగోగులు చూస్తుండాలి. కానీ రాత్రైతే మాత్రం అక్కడ సిబ్బంది జాడే కనిపించడం లేదు.

 • Share this:
  పేరుకు రాయలసీమలోనే అత్యంత పెద్ద ఆసుపత్రి.., కానీ పర్యవేక్షణలో మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. వెయ్యిమందికి పైగా కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మే 10వ తేదీ రాత్రి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ ట్యాంకర్ రావడం అరగంట ఆలస్యం కావడంతో ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్రెజర్ పూర్తిగా పడిపోయింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారు ఆక్సిజన్ అందక నరకయాతన అనుభవించారు. 11మంది చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెప్తుంటే… ప్రతిపక్షాలు మాత్రం 30 మంది చనిపోయారని తమ దగ్గర ఆధారాలున్నాయని చూపిస్తోంది. సంచలనం సృష్టించిన ఆ వివాదం చల్లారాక ముందే రుయా ఆసుపత్రి వైద్య విభాగం అధికారుల నిర్లక్ష్య వైఖరి మరో మరు తేటతెల్లం అయింది. కరోనా రోగులంటే చిన్న చూపో.., లేక మమల్ని ఎవరు ఏమంటారులే అనే ధీమానో తెలియదు కానీ.. రాత్రైతే చాలు ఒక్కరు కూడా వార్డులో కనిపించడం లేదట. కరోనా సోకి.., ఏ సమయం ప్రాణం మీదకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో బాధితులు చికిత్స పొందుతుంటే వారిని నిత్యం పర్యవేక్షించాల్సిన వైద్యులు, నర్సులు వార్డులో లేకపోవడం గమనార్హం. అత్యవసరమై....కోన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్నా సరైన సమయంలో వైద్యం అంధకపోతే మృతి చెందాల్సిందే.

  రాత్రి వేళల్లో కోవిడ్ వార్డులలో వైద్యలు నర్సులు ఉండటంలేదని.., రాత్రి 7గంటలు దాటితే కొవిడ్ వార్డులో వైద్య సిబ్బంది జాడే కనిపించడం లేదు. ఐతే ఆ ఆరోపణలు బాధితుల బంధువులు ఆరోపణలు కావు. ప్రతిపక్ష పార్టీలు అంతకన్నా కాదు. అయితే ఇంకెవరు చేసి ఉంటారు అనే అనుమానం మనకు రావొచ్చు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని నేరుగా ప్రభుత్వమే గుర్తించింది. అది ఎలా అంటే..! రాష్ట్రంలోని కొవిడ్ ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్యశాఖ ఇటీవల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.

  కొవిడ్ ఆస్పత్రులపై వస్తున్న ఆరోపణ దృష్ట్యా సీసీ కెమెరాలను ద్వారా జిల్లా, రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. విధి నిర్వహణలో వైద్యులు, నర్సులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా..? లేక డుమ్మా కొడుతున్నారా...? రాత్రిళ్లు విధులకు వస్తున్నారా? వార్డుల్లో పడకలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి.? చికిత్స ఏవిధంగా అందుతోందా లేదా అనే విషయాలను నిత్యం సీసీకెమెరాల ద్వారా నిఘా వేస్తూ వస్తోంది. ఇక వార్డులు క్లీన్ గా ఉన్నాయా..? వైద్యులు, నర్సులు అందుబాటులో లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయాలకు మెసేజ్ వస్తుంది. జిల్లా యంత్రాంగం సంబంధిత ఆసుపత్రి అధికారులకు రాష్ట్ర కార్యాలయం పంపిన మెసేజలను వాట్సప్వారా పంపి మరోసారి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశిస్తారు.

  ఆసమయంలో వైద్యులు, నర్సులు వార్డులో లేకుండా ఎక్కడికిపోయారో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాంటిదే రుయాస్పత్రిలో చోటుచేసుకుంది. డాక్టర్లు, నర్సులు రాత్రివేళల్లో వార్డుల్లో కనిపించడంలేదని సీసీటీవీ ద్వారా గుర్తించారు. రుయా కొవిడ్ వార్డుల్లో డాక్టర్లు విధులకు రావడంలేదని ఇప్పటికే బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారికంగానే రుజువు కావడం రోగుల్లో భయాందోళన నెలకొంది. ప్రాణాలు కాపాడుతారని ఆసుపత్రికి వస్తే.., రాత్రుల్లో అత్యవసర వైద్యం అందించేందుకు కూడా వైద్య సిబ్బంది లేకపోవడం అటు బాధితుల్లోను...ఇటు బాధితుల బంధువుల్లోనూ ఆందోళన నెలకొంది.

  GT Hemanth Kumar, Tirupati Correspondent, News18
  Published by:Purna Chandra
  First published: