Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: పురుషుడివని నిరూపించుకుంటేనే పెన్షన్... వృద్ధుడికి అధికారుల వింత కండిషన్

Andhra Pradesh: పురుషుడివని నిరూపించుకుంటేనే పెన్షన్... వృద్ధుడికి అధికారుల వింత కండిషన్

పురుషుడివని నిరూపించుకుంటేనే పెన్షన్

పురుషుడివని నిరూపించుకుంటేనే పెన్షన్

చిత్తూరు జిల్లాలో ఓ వృద్ధుడికి వింత సమస్య ఎదురైంది.. ఇంతకాలం వచ్చిన పెన్షన్ ను నిలిపివేసిన అధికారులు.. అతడిని పురుషుడిగా నిరూపించుకుంటేనే పెన్షన్ ఇస్తామని కండిషన్ పెట్టారు.. ఆ కండిషన్ ను చూసిన వారంతా షాక్ కు గురయ్యారు..

GT Hemanth Kumar, Tirupati Correspondent, News18

వృద్ధాప్యంలో ఒక వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. రామా కృష్ణా అంటూ.. జీవినం సాగిస్తున్నాడు. ఆరుపదుల వయస్సులో.. వేరే పని చేసే శక్తి లేకపోవడంతో ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు ఉన్నా.. ఆ వృద్ధ దంపతులు ఒంటరిగా జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టించుకునే వారు లేక.. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తోనే ఇద్దరు జీవనం సాగిస్తున్నారు. పెన్షన్ తో వచ్చే డబ్బుల... ప్రభుత్వం ఇచ్చే రేషన్ తో తమ ఆకలి తీర్చుకుంటున్నారు. కానీ అనుకోకుండా వారి ఆకలి తీరే మార్గానికి బ్రేకులు పడుతూ.. అధికారుల నుంచి సందేశం అందింది. ఆ సందేశం అర్థం కాక.. తెలిసిన వారిని అడిగాడు. అయితే వారు చెప్పిన సమాధానం విని వృద్ధుడు షాక్ కు గురయ్యాడు.

ఆ వయసులో పురుషుడివని నిర్ధారణ చేసుకోకపోతే పెన్షన్ ఆపేస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఈ మేసేజ్ 15 రోజుల క్రితమే.. గ్రామ సచివాలయ సిబ్బంది నుంచి నోటీసులు అందాయి. అసలు ఎందుకు నోటీసులు జారీ చేసారో తెలిసి అంతా షాక్ కు గురయ్యారు. ఇన్నీ రోజులు పెన్షన్ డబ్బులు జారీ చేసిన అధికారులు.. ఇప్పుడు ఎందుకు ఇలాంటి మెసేజ్ చేశారు.. ఎందుకు పెన్షన్ ఆపేశారు...  వారికీ వచ్చిన టెక్నికల్ ఇబ్బందులేంటి.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వీరక నెల్లూరులో నామాల నాగయ్య, రాజేశ్వరి అనే ఇద్దరు వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం ఇచ్చే పథకాలే జీవనాధారం. అయితే ఏడాది క్రితం నాగయ్యకు అంధత్వం వచ్చి రెండు కళ్ళు కనపడటం లేదు. తనకు ఇస్తున్న వృద్దాప్య పెన్షన్ 2250కు బదులుగా దివ్యంగుల పెన్షన్ ఇవ్వాలని గత ఎనిమిది నెలలుగా.. కలెక్టర్, ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్న వారిని చూసే దిక్కు లేకుండా పోవడంతో మరో రెండు వేలు ఎక్కువ వస్తాయని కార్యాలయాల వెంబడి తిరగ సాగాడు. అయితే  దివ్యాంగుల జాబితాలో అంధత్వం అనే ఆప్షన్ లేకపోవడంతో.. ఎలాగైనా తనకు పెన్షన్ మార్చాలంటూ సచివాలయంకు రోజు వెళ్తూ వస్తున్నాడు. ఇంతలోనే అధికారులు నాగయ్యకు పెద్ద షాక్ఇచ్చారు.

తనకు ఇస్తున్నది వృద్ధాప్య పెన్షన్ కాదని.. వితంతు పెన్షన్ ఇస్తున్నారని నోటీసులు జారీ చేసారు. దింతో ఏంచేయాలో దిక్కుతోచక ఇబ్బంది పడ్డాడు నాగయ్య. తాను వితంతువా..? లేక పురుషుడా అని నిర్ధారించుకోవాలి, లేకుంటే వచ్చే పెన్షన్ కూడా రద్దు అవుతుందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నాగయ్య పెన్షన్ పాస్ పుస్తకంలో మాత్రం పురుషుడని ఉండగా.. వితంతు పింఛన్‌ పొందుతున్నట్టు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటులో ఉంది. రేషన్‌ కార్డులో మాత్రం పురుషుడిగా నమోదైంది. దీంతో పింఛన్‌ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఈ నెల 8వ తేదీన అధికారులు వృద్ధుడికి నోటీసు ఇచ్చారు. నోటీసు అందిన 15 రోజుల్లోగా పింఛన్‌ అర్హత (పురుషుడి)గా నిరూపించుకోవాలని పేర్కొన్నారు. దీంతో సమస్యను విన్నవించేందుకు మంగళవారం ఆయన చిత్తూరు కలెక్టరేట్‌కు వచ్చి, తన సమస్యను వివరించారు. తనకు వికలాంగుల పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను కోరాడు. అధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పారు

First published:

Tags: Andhra Pradesh, AP News, Pension Scheme, Tirupati

ఉత్తమ కథలు