GT Hemanth Kumar, Tirupathi, News18..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) కొలువై ఉన్న తిరుమల (Tirumala) కు వెళ్లాలి అనుకునే భక్తులకు శుభవార్త.. ఎందుకంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) మరోసారి ముందుకు వచ్నిచింది. ఈ విషయంలో మరే దేవస్థానం ముందుకు రావడం లేదు. తిరుమలే తొలి అడుగు వేస్తోంది. సరికొత్త టెక్నాలజీ వినియోగించి భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించాలన్న ధ్యేయంతో టీటీడీ (TTD) ముందుకు సాగుతూనే ఉంది. అడ్వాన్స్ రిజర్వేషన్ నుంచి.. వివిధ రకాల సేవలతో పాటుగా డొనేషన్స్ సైతం ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది టీటీడీ. నిఘా నేత్రాలకి కావాల్సిన అత్యాధునిక అనలిటిక్స్ పరిజ్ఞానం జోడించింది. తోపులాటలు సకాలంలో గుర్తించేలా సీసీటీవీ టెక్నాలజీని వినియోగిస్తుంది. ఇక సామాన్య భక్తులకు గదుల కేటాయింపు, ఎస్ .ఎస్.డి టైం స్లాట్ కేటాయింపు కూడా నూతన టెక్నాలజీనే ఉపయోగిస్తోంది.
సాధారణంగా తిరుమలలో మనకు కావాల్సిన కార్యాలయాలు.. దర్శనం క్యూలైన్.. గదుల కేటాయింపు కౌంటర్.. ఈవో కార్యాలయం.. చైర్మన్ కార్యాలయం.. వసతి గదులకు వెళ్లాలంటే కొంత ఇబ్బంది తప్పదు.. పదే పదే ఎవరినైనా అడుగుతూ వెళ్లాలి.. లేదా దళారులను నమ్మి ఆటోలకు డబ్బులు తగలేయాలి..
ఇలా అడ్రెస్స్ కనుకొని వెళ్లే లోపే తిప్పలు తప్పడం లేదు. అందుకే భక్తులు ఎదుర్కొంటున్న తిప్పలు తప్పించేందుకు టీటీడీ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం శ్రీవారి సేవకులతో ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేస్తోంది టీటీడీ. ఒకవేళ ఆ టెక్నాలజీ సక్సెస్ అయితే.. అందరికి అందుబాటులోకి తీసుకురానుంది.
ఇదీ చదవండి : పవన్ ఇమేజ్ ను జగన్ పెంచుతున్నారా..? చంద్రబాబును పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
భక్తులకు నిత్యం మెరుగైన సేవలను అందించాలన్న భావనతో ఈ ఆలోచనకు నాంది పలికింది. వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.
ఇదీ చదవండి : మట్టి పాత్రలో ఇడ్లీలు ఎపుడైనా తిన్నారా.. ఇవి తింటే డాక్టర్ అవసరమే లేదంటారు..?
తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేసారు. భక్తులు బస్టాండ్ లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ ను తమ మొబైల్ లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి.ః
ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఆలయం మూసివేత.. ఎప్పటి వరకు అంటే..?
అది ఓపెన్ అవ్వగానే తాము ఎక్కడికి వెళ్ళాలో అనే ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ డిస్ప్లే అయ్యి నేరుగా అక్కడికి రూటు చూపిస్తుంది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు వారు వెళ్ళాల్సిన ప్రాతం కనుక్కోవడానికి ఇబ్బంధులు పడే వారు. బ్రహ్మోత్సవాల్లో ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకుల ద్వారా ఈ విధానం అమలు చేసి సత్ఫాలితాలు సాధించారు. త్వరలోనే తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది టీటీడీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala Temple, Tirumala tirupati devasthanam