Three Capitals: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధాని చుట్టూ రాజకీయం నడుస్తోంది. వికేంద్రీకరణే మా విధానం అంటోంది అధికార వైసీపీ.. ఏకైక రాజధాని అమరావతి (Captal Amaravati) కి ముద్దు అంటున్నాయి విపక్షాలు. అయితే 2024 ఎన్నికల్లో మూడు రాజధానులనే ప్రధాన అజెండగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోందనే ప్రచారం ఉంది. మూడు రాజధానులు కావాలి.. మూడు ప్రాంతా అభివృద్ధి కావలి అంటే వైసీపీకే ఓటేయ్యాలి అనే నినాదాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది..? అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులే తమ విధానం అంటోంది. ఇప్పటికే విశాఖ (Visakha)లో పరిపాలనా రాజధాని డిమాండ్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతాలని కలుపుకుని విశాఖ గర్జన భారీగా నిర్వహించింది.
నాన్ పొలిటిక్జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనకు పూర్తిస్థాయిలో వైసీపీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల మంత్రలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. దీంతో విశాఖ గర్జనకు భారీ హైప్ వచ్చింది. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. వైసీపీ మంత్రుల పై ఎయిర్ పోర్టులో రాళ్ల దాడితో.. మొత్తం అటెన్షన్ అంతా అటువైపు వెళ్లిపోయింది. దీంతో విశాఖ గర్జనకు అనుకున్నంత మైలేజీ రాలేదన్నది వైసీపీ వర్గాల సమాచారం.. అయితే వికేంద్రీ కరణ నినాదాన్ని కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేయకుండా.. రాష్ట్ర వ్యాప్తం చేయాలని వైసీపీ భావిస్తోంది.
ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి సీమకు మారుతోంది వికేంద్రీకరణ ఉద్యమం.. విశాఖ గర్జన అనుభవాలతో.. సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్రెడ్డి సర్కార్.. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అదే విషయాన్ని సీమ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పనున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని.. దీనికి సీమ ప్రజల మద్దతు కోరనున్నారు.
అయితే మొన్నటి వరకు ఉత్తరాంధ్రలో పెద్దగా రాజధాని సెంటిమెంట్ లేదు. కానీ విశాఖ గర్జన ఏర్పాటు చేయడం.. అదే సమయంతో అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగడంతో.. ఇప్పుడిప్పుడు ఉత్తరాంధ్రలోనూ కొంతమేర రాజధాని సెంటిమెంట్ కనిపిస్తోంది. ఇప్పుడు సీమలోనూ ఆ సెంటిమెంట్ తేగలగితే పొలిటికల్ గా వచ్చే ఎన్నికల్లో తమకు మైలేజ్ గా మారుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. దీనిలో భగంగా ఈ నెల 29న తిరుపతిలో ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు సిద్ధమైంది.. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
ఇదీ చదవండి : ఎంపీ రాగానే మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి.. పల్నాడులో మరోసారి బయటపడ్డ విభేదాలు
ఇటు వైసీపీ వికేంద్రీకరణ అంటోంది. అటు టీడీపీ అమరావతే రాజధాని అంటోంది. ఇప్పుడు కొత్త మరో అంశం తెరపైకి వచ్చింది. తిరుపతి రాజధానిగా గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పడలని డిమాండ్ చేస్తున్నారు మాజీ ఎం గంగుల ప్రతాప్ రెడ్డి. చిత్తూరు , కడప , కర్నూలు , అనంతపురం, నెల్లూరు , ప్రకాశం జిల్లాలను కలుపుకుని కొత్త రాష్ట్రం ఏర్పడాలి అంటున్నారు. తిరుపతికి రాజధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అసలు 2020లో ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చామని.. కానీ కరోనా కారణంగా అప్పుడు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాం అన్నారు. అన్ని పార్టీల నేతలు ఇదే డిమాండ్ తో ఉద్యమంలోకి రావాలని ఆయన కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, AP News, Rayalaseema, Tirupati, Ycp