Andhra Pradesh: శవాలపై చిల్లర ఏరుకోవడం అంటే ఇదే..! మరీ ఇంత నీచమా..?

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కష్టకాలంలో మనుషుల్లో మానవత్వం ఉందని నిరూపితమైంజది. ఐతే కొందరు దుర్మార్గులను చూస్తే కనీసం వీరికి మనస్సాక్షి ఉందా అనే ప్రశ్నలు తలెత్తక మానవు.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupati, News18

  రానురాను సమాజంలో మానవత్వం కనుమరుగవుతోంది. దీనికి ప్రతిరోజూ అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో (Corona Pandemic) మనుషుల్లో మానవత్వం ఉందని నిరూపితమైంజది. ఐతే కొందరు దుర్మార్గులను చూస్తే కనీసం వీరికి మనస్సాక్షి ఉందా అనే ప్రశ్నలు తలెత్తక మానవు. ఓ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది తీరు మానవత్వానికే మచ్చతెచ్చేలా ఉంది. అయినవారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు సానుభూతి తెలపాల్సిన ఆస్పత్రి సిబ్బంది కాసుల కక్కుర్తితో బాధితుల రక్తం పీల్చేస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన మృతదేహాలను బంధువులకు ఇవ్వాలంటే సొమ్ము చెల్లించకుంటే అంతే చివరి చూపు కూడా చేసుకోలేని పరిస్థితిని తెస్తున్నారు. ఇక శవంపై బంగారు నగలు సైతం మాయం చేసేస్తున్నారు. కాదు పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన నెల్లూరు జీజీహెచ్ (Government Hospital) లో ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం.

  నెల్లూరు జిల్లా (Nellore District)లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి గతనెల 7వ తేదీన కోట మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజన కుటుంబం వైద్యం కోసం వచ్చారు. అదే సమయంలో కుటుంబంలోని పుల్లమ్మకు కరోనా లక్షణాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆమెకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా., పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాదాపుగా నెలరోజులకి పైగా చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఈనెల 18న ఆమె మృతి చెందింది. పుల్లమ్మ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు సమాచారమందించారు వైద్యులు.

  ఇది చదవండి: ఏపీలో కర్ణాటక మద్యం డోర్ డెలివరీ.., మందుతాగి పడిపోయిన భర్త... భార్యపై కన్నేసిన స్మగ్లర్...  దీంతో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించడం మొదలెట్టారు. ఆమె శవాన్ని అప్పగిస్తే తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తామని కోరారు. అప్పటికే మృతదేహాన్ని మార్చురీకి తరలించడంతో అక్కడి సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు మార్చరీ వద్దకు వెళ్లగా డబ్బులు డిమాండ్ చేశారు. ఐదు వేల రూపాయలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామనడంతో అంత ఇచ్చుకోలేమని వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు. దీంతో ఆ వెయ్యి తీసుకొని మరుసటి రోజు రావాలని చెప్పారు. ఈ లోగా డాక్టర్లు పుల్లమ్మ బంధువులకు ఫోన్ చేసి వచ్చి శవాన్ని తీసుకెళ్లాలని లేదంటే మున్సిపాలిటీ వాళ్లకు అప్పగిస్తామని హెచ్చరించారు.

  ఇది చదవండి: గ్యాంగ్ వార్ కు దారితీసిన ఫ్రీ ఫైర్ గేమ్.. మధ్యలో పోలీసుల ఎంట్రీ.. తర్వాత ఏం జరిగిందంటే..!  వెంటనే వారు ఆస్పత్రికి వెళ్లి షాక్ తిన్నారు. పుల్లమ్మ మృతదేహంపై ఉన్న బంగారం మాయమైంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది తమ దగ్గర లంచం తీసుకోవడంతో పాటు బంగాన్ని కూడా దొంగింలిచారని బాధితులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యురాలు చనిపోయిన బాధలో తాము ఉంటే లంచం పేరుతో వేధించడమే కాకుండా.. బంగారాన్ని దొంగిలించారని బాధితులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. కరోనా సమయంలో చాలా మంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సేవ చేస్తుంటే ఇలాంటి వారి మాత్రం శవాలపై కాసులు ఏరుకొంటూ బాధితులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: