• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • TIRUPATI NELLORE BASED BOYS RECREATED POWER STAR PAWAN KALYAN VAKEEL SAAB MOVIE FIGHT SEQUENCES IN NATURAL STYLE FULL DETAILS HERE PRN

Vakeel Saab: ఇరగదీసిన నెల్లూరు కుర్రాళ్లు.. వకీల్ సాబ్ ని దించేశారుగా..!

వకీల్ సాబ్ ఫైట్ రీ క్రియేట్ చేసిన నెల్లూరు కుర్రాళ్లు

గతంలోనూ ఈ నెల్లూరు కుర్రాళ్లు హిట్ సినిమాల్లోని ఫైట్స్ ని సీన్స్ ని రీ క్రియేట్ చేసి శబాష్ అనిపించుకున్నారు.

  • Share this:
    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ నే కాదు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూపించని స్టైల్లో డైరెక్టర్ వేణు శ్రీరామ్.. పవన్ కల్యాణ్ ను స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. కాగా సినిమాకు మ్యూజిక్ తో పాటు ఫైట్లు పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి. పవన్ కల్యాణ్ తో పాటు ప్రకాష్ రాజ్, శ్రుతిహాసన్, అంజలి, నివేథా థామస్, అనన్య నటించిన ఈ సినిమా వంద కోట్ల వసూళ్ల వరకు వెళ్లింది. సినిమాలోని పాటలకు ఫైట్లకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వకీల్ సాబ్ సినిమాలోని ఫైట్ సీక్వెన్స్ ను రీ క్రియేట్ చేస్తూ నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు ఓ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

    నెల్లూరుకు చెందిన కిరణ్ ఈ స్పూఫ్ ఫైట్స్ ని డైరెక్ట్ చేస్తుండగా.. మున్నా అనే కుర్రాడు లీడ్ రోల్స్ పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడు. వకీల్ సాబ్ లోని బాత్ రూమ్ ఫైట్, క్లైమాక్స్ లో వచ్చే మెట్రో రైల్ ఫైట్ ను రీ క్రియేట్ చేశారు. సినిమాల్లో నటుల మాదిరిగానే గాల్లో ఎగిరిపడటం, స్పెషల్ ఎఫెక్ట్స్, కొట్టడం, ఇలా అచ్చం ఓ పెద్ద సినిమా ఫైట్స్ ను తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో చక్కగా రూపొందించారు.


    గతంలోనూ ఈ నెల్లూరు కుర్రాళ్లు హిట్ సినిమాల్లోని ఫైట్స్ ని సీన్స్ ని రీ క్రియేట్ చేసి శబాష్ అనిపించుకున్నారు. అత్తారింటికి దారేదీ, కాటమరాయుడు, రంగస్థలం ఫైట్లను స్పూఫ్ చేసిన వీళ్లు.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీలోని “రమణా లోడెత్తాలిరా” అంటూ సాగే ఫైట్ ను మొబైల్ ఫోన్లో తెరకెక్కించి ఇరగదీశారు. ఆ తర్వాత అరవింద సమేత, భీష్మ, క్రాక్, భరత్ అనే నేను ఇలా సూపర్ హిట్ సినిమాల్లోని ఫైట్లను రీ క్రియేట్ చేశారు. వీళ్ల టాలెంట్ ను సినిమా స్టార్లు, డైరెక్టర్లు కూడా అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

    అన్నట్లు ఈ నెల్లూరు కుర్రాళ్లు.. అదే పేరుతో ఓ యూట్యూబ్ చానల్ కూడా రన్ చేస్తున్నారు. ప్రస్తతం ఈ ఛానల్ కు 2.2 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఎప్పటికైనా సినిమాల్లోక వచ్చిన తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని నెల్లూరు కుర్రాళ్లు చెబుతున్నారు.
    Published by:Purna Chandra
    First published: