హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati: పక్కింటికి వెళ్లొద్దన్నందుకు పదిమంది ఇంటిపై పడ్డారు.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్..

Tirupati: పక్కింటికి వెళ్లొద్దన్నందుకు పదిమంది ఇంటిపై పడ్డారు.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్..

చిత్తూరు జిల్లాలో యువకుడిపై దాడి

చిత్తూరు జిల్లాలో యువకుడిపై దాడి

Tirupati: విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. మనం నివసించే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జరిగే కొన్ని ఘటనలు మాత్రం మనకు ఆశ్చర్యాన్ని తెప్పించక మానవు. ఇంటికి చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారితో చాలా సఖ్యతగా ఉంటారు కొందరు. చిన్న చిన్న శుభకార్యాలకు, ఇంట్లో జరిగే ఫంక్షన్ కు బొట్టు పెట్టి మరి పిలుస్తుంటారు.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

సమాజంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. మనం నివసించే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జరిగే కొన్ని ఘటనలు మాత్రం మనకు ఆశ్చర్యాన్ని తెప్పించక మానవు. ఇంటికి చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారితో చాలా సఖ్యతగా ఉంటారు కొందరు. చిన్న చిన్న శుభకార్యాలకు, ఇంట్లో జరిగే ఫంక్షన్ కు బొట్టు పెట్టి మరి పిలుస్తుంటారు. ఇందుకు కుల మత బేధాలు లేకుండా ఇరుగుపొరుగు వాళ్లంతా కలసి పోయి శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఆపద వచ్చినా సమయంలోనూ అండగా ఉండేది మన చుట్టూ నివసించే వారే. కానీ ఓ పక్కింటి వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. అద్దెకు ఉంటున్న వారితో పొరుగింటికి వెళ్లొద్దు అన్నమాట సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై మూకుమ్మడి దాడికి దిగిన సంఘటన పలమనేరు చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరుకు చెందిన నిరంజన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కోవిడ్ కారణంగా ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. దీంతో గత రెండేళ్లుగా పలమనేరులోని పాతపేటలో ఉన్న తన సొంత ఇంటి నుంచే కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందిన సమయంలో నిరంజన్ ఇంటికి పోరిగింటి వారైనా ఓ ముస్లిం కుటుంబంలో విబేధాలు తలెత్తాయి. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈక్రమంలో తరచూ నిరంజన్ కు వారికి మధ్య గొడవకు జరుగుతూ ఉండేవి. తోటి కాలనీ వాసులు ఇరు కుటుంబీకులను కూర్చోబెట్టి పంచాయతీలు కూడా పెట్టి సర్ధిచెప్పారు. దీంతో కొంతకాలంగా ఇరువురు ఎటువంటి గొడవలు లేకుండా ఉండేవారు.

ఇది చదవండి: సీక్రెట్ గా చిన్నింట్లో సెటిలయిన భర్త.., భార్యకు విషయం తెలియడంతో సీన్ రివర్స్..


రెండు రోజుల క్రితం నిరంజన్ ఇంటి వద్ద అద్దెకు ఉండే మహిళ ఎదురింటి కుటుంబంతో సన్నిహితంగా ఉండేది. దీనిని గమనించిన నిరంజన్ ఎదురుగా నివాసం ఉంటున్న ఇంటికి వెళ్ళ వద్దని హుకుం జారీ చేశాడు. ఇదే విషయంను ఆ మహిళ.. ఎదురింటివారికి చెప్పడంతో ఒక్కసారిగా ఆవేశంకు గురైన కుటుంబీకులు ఆదివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో దాదాపు పది మంది మూకుమ్మడిగా నిరంజన్ పైకి దాడికి దిగ్గారు. నిరంజన్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, తమతో పాటుగా తెచ్చుకున్న సుత్తితో నిరంజన్ విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులతో రక్తం వచ్చేలా బాదారు.

ఇది చదవండి: పెద్దల మాటకు తల వంచడమే ఆమె చేసిన పాపం.. నెల్లూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది


తీవ్రంగా గాయపడిన నిరంజన్ ను స్ధానికులు ఆసుపత్రికి తరలించారు. దాడిపై నిరంజన్ పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిరంజన్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోక పోవడంతో నిరంజన్ పోలీసులను నిలదీశాడు. తన నివాసం ఎదురుగా నివాసం ఉంటున్న వారి వద్ద నుండి తనకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆవేదన చేందుతున్నాడు. పోలీసులు తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నాడు.

First published:

Tags: Andhra Pradesh, Chittoor

ఉత్తమ కథలు