Home /News /andhra-pradesh /

TIRUPATI NEGLIGENCE OF GOVERNMENT DOCTORS CAUSED TO LIFE RISK FOR WOMAN WHO INJURED IN ROAD ACCIDENT IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Chittoor News: చనిపోయిందనుకొని పోస్ట్ మార్టంకు తీసుకెళ్తుంటే షాకింగ్ సీన్.. డాక్టర్ కు ఆ మాత్రం తెలియదా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Chittoor Woman: డాక్టర్ చేసే పని డాక్టర్ ఏ చేయాలి... ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ మాత్రమే చేయాలనే సిద్ధాంతం ఉంది. కొన్ని మాత్రలు సైతం వైద్యుని సలహాతోనే వాడాలని వాటిపై వార్నింగ్ మార్క్ సైతం ఉంటుంది. ఇదంతా మరచిన నర్సులు యాక్సిడెంట్ అయిన వ్యక్తికీ ఈసీజీ తీసి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టంకు తరలిస్తుండగా షాకింగ్ సీన్ జరిగింది.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా.. ఎవరు చేయాల్సిన పనులు వారే చేయాలనీ పెద్దలు ఊరికే చెప్పలేదు. తమకు ఉన్న అనుభవాలతో సూక్తులు చెప్తుంటారు పెద్దవాళ్ళు. డాక్టర్ చేసే పని డాక్టర్ ఏ చేయాలి... ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ మాత్రమే చేయాలనే సిద్ధాంతం ఉంది. కొన్ని మాత్రలు సైతం వైద్యుని సలహాతోనే వాడాలని వాటిపై వార్నింగ్ మార్క్ సైతం ఉంటుంది. ఇదంతా మరచిన నర్సులు యాక్సిడెంట్ అయిన వ్యక్తికీ ఈసీజీ తీసి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టంకు తరలించే సమయం ఆసన్నం అయింది. ఇంతలోనే కుటుంబ సభ్యులకు షాకింగ్ సీన్ ఎదురైంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పాకాల మండలం గానుగపెంట పల్లెలో చెందిన జి.మనోహర్, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు.

    ఇద్దరూ వృత్తిరీత్యా టీచర్లు. దంపతులిద్దరూ ఓ ముఖ్యమైన పని మీద తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది. తమ కుమార్తెను వెంటపెట్టుకొని ద్విచక్ర వాహనంలో తిరుపతికి ప్రయాణం మొదలెట్టారు. ఈ క్రమంలో నేండ్రగుంట వద్ద ఆవుల మంద అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో బైక్ వెనుక కూర్చున్న శిరీష కిందపడిపోయింది. ఘటనలో శిరీష తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా పూతలపట్టు మండలం పీ కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో నర్సులు ఫస్ట్ ఎయిడ్ నిర్వహించారు.

    ఇది చదవండి: పెళ్లైన వారానికే మరో లవ్ స్టోరీ.., మూడు నెలలకే ప్రియుడితో జంప్.. అంతలోనే ఊహించని ట్విస్ట్..


    తొలుత నాడిపట్టి చూడటం వంటి టెస్టులు చేసి ఆ తర్వాత ఈసీజీ తీశారు. తర్వాత శిరీష చనిపోయిందని డాక్టర్లకంటే ముందే నిర్ధారించేశారు. అదే విషయాన్ని గంట తర్వాత వచ్చిన డ్యూటీ డాక్టర్ కు చెప్పారు. ఐతే డాక్టర్ కూడా శిరీషను పరీక్షించకుండానే చనిపోయిందని పోస్ట్ మార్టంకు తీసుకెళ్లాలని సూచించడంతో చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు. ఐతే దారి మధ్యలో శిరీష ఊపిరి పీల్చుకుంటున్నట్లు గమనించి చిత్తూరులోని ఆర్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆర్వీఎస్ హాస్పిటల్ వైద్యులు శిరీషకు పల్స్ ఉన్నాయని గుర్తించారు. వెంటనే వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.



    ఐతే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు లేరని.. తమకు తెలిసిన అరకొర వైద్యం చేసి మనిషి చనిపోయినట్లు నర్సులెలా చెప్తారని శిరీష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కనీసం చేయిపట్టుకొని చూడకుండానే పోస్ట్ మార్టం కు తీసుకెళ్లాలని చెప్పిన డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు