హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: అవినీతిని ప్రశ్నిస్తే మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచిన‌ట్టా..? మళ్లీ రోజాపై లోకేష్ సెటైర్లు

Nara Lokesh: అవినీతిని ప్రశ్నిస్తే మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచిన‌ట్టా..? మళ్లీ రోజాపై లోకేష్ సెటైర్లు

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వర్సెస్ మంత్రి రోజా వార్ కొనసాగుతోంది. ఎవ్వరూ వెనక్కు తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు పంచ్ డైలాగ్ లు పేలుస్తున్నారు. తాజాగా మరోసారి రోజపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నారా లోకేష్.. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagari, India

Nara Lokesh: తెలుగు దేశం (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వర్సెస్ మంత్రి రోజా  (Minister Roja) వార్ ఇప్పటిలా ఆగేలా లేదు. 20వ రోజు పాదయాత్రలో కూడా నారా లోకేష్ మంత్రి రోజానే అత్యధికంగా టార్గెట్ చేస్తున్నారు. యువ‌గ‌ళం (Yuva Galam) పాద‌యాత్రలో భాగంగా బుధ‌వారం తిరుపతి జిల్లా (Tiruapati District) సత్యవేడు నియోజకవర్గం వెంకటరెడ్డి కండ్రిగలో మహిళలతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన లోకేష్.. తనకు చీర‌-గాజులు పంపుతాన‌ని ప్ర‌క‌టించిన రోజాకి తెలుగు మ‌హిళ‌లు సారె పెట్టేందుకు వెళితే వారిని అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ఆమె చెప్పిన మాటలను గుర్తు చేస్తే.. అంత కోపం ఎందుకన్నారు. ముఖ్యంగాసాటి మ‌హిళ‌ల్ని అత్యంత దారుణంగా కొట్టించి, అరెస్ట్ చేయించిన రోజా మ‌హిళ‌ల గురించి మాట్లాడ‌టం సిగ్గుచేట‌ని మండిపడ్డారు. ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అవినీతిని ప్ర‌శ్నిస్తే మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచిన‌ట్టా అని ప్రశ్నించారు.

తన ప‌ళ్లు రాల‌గొడ‌తాన‌ని జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ వార్నింగ్‌లు ఇస్తున్నారని.. ఆమె వార్నింగ్ లకు ఎవరూ భయపడరన్నారు.. ప‌ళ్లు రాల‌గొట్టాల్సి వ‌స్తే ముందుగా చంద్రబాబుకు వార్నింగ్ లు ఇచ్చిన జ‌గ‌న్ రెడ్డి ప‌ళ్లు రాల‌గొట్టాలి అంటూ రోజా వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు 16 హౌస్‌ క‌మిటీలు, 8 సీఐడీ కేసులు పెట్టారు. ఒక్క‌టీ నిరూపించ‌లేక‌పోయారని గుర్తు చేశారు.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వైసీపీలో ఉన్న‌ ల‌క్ష్మీపార్వ‌తి కూడా తమపై సుప్రీంకోర్టు వేసిన‌ కేసుల్లో క‌నీసం ఆధారాలు కూడా చూప‌లేకపోవ‌డంతో కేసుల‌ను కోర్టు కొట్టేసిందన్నారు. ప్రత్యర్థుల ఆరోపణలతో సంబంధం లేకుండా.. తాము చిత్త శుద్ధితో తమ ఆస్తులు ప్ర‌తీ ఏటా ప్ర‌క‌టిస్తున్నాం అన్నారు. మీ వైసీపీ లో మీరు, మీ 150 మంది దొంగ‌లు కూడా ఆస్తులు ప్ర‌క‌టించగలరా? అని సవాల్ విసిరారు నారా లోకేష్ .

ఇదీ చదవండి : బుగ్గన అందుకే అలా చెప్పారు.. ఏపీ రాజధానిపై తేల్చి చెప్పేసిన సజ్జల

మరోవైపు నారా లోకేష్ తన మంచి మనసు చాటుకున్నారు. సొంత డబ్బుతో ఓ మహిళకు చేయూత అందించారు. పాదయాత్రలో ఉన్న తనకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దాహార్తి తీర్చిన ఆ మహిళకు ఊహించని కానుక ఇచ్చారు. స్వయం ఉపాధి పొందుతూ ఆద‌ర్శంగా నిలుస్తున్న మ‌స్తాన‌మ్మ అనే మహిళకు ఓ తోపుడు బండి ఉంటే కొబ్బరిబోండాలు అమ్ముకునేందుకు మ‌రింత ఉప‌యోగంగా ఉంటుంద‌ని భావించిన లోకేష్.. త‌న సొంత డ‌బ్బుతో బండి చేయించి కానుక‌గా పంపించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Minister Roja, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు