అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి (Capital Amaravathi) మద్దతిచ్చిన సీఎం జగన్ (AP CM YS Jagan) ఇప్పుడు మాట తప్పి.. మడప తిప్పారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) విమర్శించారు. తిరుపతి లో జరిగిన అమరావతి రైతుల సభలో పాల్గొన్న ఆయన.. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అమరావతి రైతులు న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో పాదయాత్ర చేశారని.., అమారావతి రైతులను ఆశీర్వదించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి కోసం 180 మంది మృతి చెందారని.., 2500 మందిపై కేసులు పెట్టారుని చెప్పారు. రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన దరిద్రమైన ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని చంద్రబాబు ఆరోపించారు. మనకు రాజధాని లేదు.. డబ్బులు లేదు.. హైదరాబాదు ను అభివృద్ధి చేసిన అనుభవం ఉందని బాబు అన్నారు.
అమారావతి కోసం రైతులంతా స్వఛ్ఛందగా ముందుకు వచ్చారుని.., అమారావతే రాజధానిగా తామ కట్టుబడి ఉన్నామని బిజేపి స్పష్టం చేసిందని.. రాజధానికి అన్ని పార్టీలు మద్దతిచ్చాయని బాబు గుర్తు చేశారు. సీపిఐ నారాయణ ఆందోళనలో ముందు ఉంటూ అమారావతి రైతులకు మద్దతు ఇచ్చారన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతే రాజధానిగా ఉండాలని చెప్పిన జగన్.. ప్రజలను మోసం చేశారన్నారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాల భూములిస్తే వారిని కాదని.. అమరావతిపై కులముద్ర వేసే పరిస్థితికొచ్చారని చంద్రబాబు విమర్శించారు. దీనిపై ప్రజలకు సమాధానం చేప్పే ధైర్యం జగన్ కు లేదని ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ రూ.2500 కోట్లు కేటాయించారన్నారు.
ఐదు కోట్ల ప్రజల రాజధాని అమరావతి అని.. ఇది జగన్మోహన్ రెడ్డి రాజధాని కాదని.. ప్రజలు కోరుకున్న రాజధాని అని చంద్రబాబు అన్నారు. అమారావతి రాజధానిగా చేయకుండా మూడు ముక్కల ఆటలయ ఆడుతారా.. సభకు హాజరయ్యే రైతులను అడ్డుకుంటారా.. అని ప్రశ్నించారు. నిన్న విద్యార్ధులను తీసుకుని మూడు రాజధానుల కోసం బలప్రదర్శన చేశారని.. జగన్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసారో తెలుసన్నారు. అమరావతి మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేశారని.. హైదరాబాదు, చెన్నై కంటే బలమైన భూమి అమారావతి అని బాబు గుర్తు చేశారు. అలాగే అమారావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ అని దుష్ ప్రచారాం చేశారని మండిపడ్డారు.
వేంకటేశ్వరస్వామి సాక్షిగా మేము చేస్తున్నది ధర్మ పోరాటమన్న చంద్రబాబు.. త్యాగం అమరావతి రైతులది,పోరాటం అమారావతి రైతులది అని అన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధానిగా ఉండాలనే అమరావతి నిర్మాణానికి పూనుకున్నామన్నారు. రూ.10వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని.. ప్రస్తుతం అసెంబ్లీ, హైకోర్టు రైతుల భూముల్లోనే ఉందన్నారు. సీఎం ఇంట్లో కూర్చుని అమరావతి రైతులను విధ్వంసం చేయకుండా ఉంటే చాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.