హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Brahmani: వావ్.. లడక్ లో బైక్ పై రయ్ రయ్.. నారా బ్రహ్మణిలో ఆ టాలెంట్ కూడా ఉందా?

Nara Brahmani: వావ్.. లడక్ లో బైక్ పై రయ్ రయ్.. నారా బ్రహ్మణిలో ఆ టాలెంట్ కూడా ఉందా?

నారా బ్రహ్మణిలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

నారా బ్రహ్మణిలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

Nara Brahmani: తెలుగు రాష్ట్రాల ప్రజలకు నారా బ్రహ్మణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనీ, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నా.. వ్యాపారాల ద్వారా తనకు అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందని ఎవరికీ తెలిసి ఉండదు..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Nara Brahmani: మాజీ ముఖ్యమంత్రి .. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కి  కోడలుగా..  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) భార్యగా.. నందమూరి నట సింహం.. స్టార్ హీరో బాలయ్య (Balayya) కూతురిగా.. ఇటు రాజకీయ.. అటు సినీ నేపథ్యం ఉంది. అయితే కేవలం కుటుంబ నేపథ్యంతోనే కాకుండా.. ఆమెకు అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నారా బ్రహ్మణి (Nara Brahmani) .. ముఖ్యంగా వ్యాపార రంగంలో సక్సెస్ అందుకుని అందరి ఫోకస్ తనపై పడేలా చేశారు. అయితే వారసత్వంగా వచ్చే రాజకీయాలకు ఆమె దూరం కాలేదు. గత ఎన్నికల్లో భర్త లోకేష్ తరపున మంగళగిరిలో ప్రచారం చేశారు. అలాగే భర్త గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేశారు. ఆ ఎన్నికల్లో నారా లోకేష్ గెలవకపోయినా.. నారా బ్రహ్మణి కష్టానికి మంచి గుర్తింపే వచ్చింది.

ప్రస్తుతం ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చిన్ననాటి నుంచి ఇటు సినీ, రాజకీయ రంగాలను దగ్గరగా చూశారు నారా బ్రహ్మణి. ఆ రెండింటిని కాకుండా వ్యాపారంలోనూ తనకంటూ గుర్తింపు ఏర్పర్చుకున్న తెలివైన సమర్థవంతురాలైన నారీమణి నారా బ్రహ్మణి.  ఇప్పుడు మరో కొత్త టాలెంట్ తో వార్తల్లో ట్రెండింగ్ అయ్యారు.

Nara Brahmani Bike Riding || నారా బ్రహ్మిణిలో ఈ టాలెంట్ ఎప్పుడైనా చూశారా... https://t.co/Ym7YwFV2fS via @YouTube #heritage #TDP #tdp2024 #TDPforDevelopment #TDPTelangana #TDPTwitter #TDPWillBeBack #YCP #ycpinsultsayyappa

ఇదీ చదవండి : మాజీ మంత్రి గంటాకు టైం వచ్చిందా..? ఆయన డిమాండ్లు ఇవే.. మెగాస్టార్ సపోర్ట్ ఉందా?

ఆమె కుటుంబ నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎన్నో ఉత్తమమైన నిర్ణయాలతో హెరిటేజ్‌ ఫుడ్స్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతేకాకుండా… హెరిటేజ్‌ సంస్థలో పనిచేస్తున్న పేద కార్మికుల పిల్లలకు చదువుకోసం కూడా ఆమె ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.

ఇప్పటి వరకు నారా బ్రహ్మణి అంటే అందరికీ తెలిసింది ఇంతే.. కానీ ఎవరికీ తెలియని టాలెంట్ కూడా ఆమెకు ఉంది. ఆమెకు బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం. ఆమె ఒక ప్రొఫెషినల్‌ బైక్‌ రైడింగ్‌ గ్రూపులో మెంబర్‌ కూడా. ఇటీవల..జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లడక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు. ఈ ట్రావెల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. ఎంతో బరువుగా ఉన్న… బైక్‌ను ఆమె అంతదూరం ఎలాంటి అలుపుసొలుపు లేకుండా నడపడం చూస్తూ.. బ్రహ్మణిలో ఇలాంటి టాలెంట్‌ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇదీ చదవండి : రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నాం.. ప్రజలు తోడుగా ఉండాలన్న జగన్

ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే.. ఆమె నడిపిన బైక్ కలర్ కూడా పసుపే.. దీంతో ఆమె బైక్ రైడింగ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు ఆమె త్వరలోనే రాజకీయ ఎంట్రీ కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమెకు తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Bike rides, Nara Brahmani, Nara Lokesh, TDP

ఉత్తమ కథలు