హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balakrishna: నారావారిపల్లిలో బాలయ్య సందడి.. జాగింగ్.. భోగి మంటలతో వీర సింహారెడ్డి హంగామా

Balakrishna: నారావారిపల్లిలో బాలయ్య సందడి.. జాగింగ్.. భోగి మంటలతో వీర సింహారెడ్డి హంగామా

భోగీ వేడుకల్లో బాలయ్య సందడి

భోగీ వేడుకల్లో బాలయ్య సందడి

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నారు.. ఇప్పటికే అటు టాక్ షో రికార్డులు క్రియేట్ చేస్తుంటే.. తాజాగా విడుదలైన వీర సింహారెడ్డి హిట్ తో.. సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇలా జోష్ లో ఉన్న ఆయన.. నారావరి పల్లెల్లో సందడి చేశారు.. ఏం చేశారో చూడండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

Balakrishna:ఈ ఏడాది పెద్ద పండుగ ఆ బావా బావమరుదులదే.. పండగ అంటే నారావారిపల్లి (Naravaripalli)  లోనే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఊరూ వాడంతా సంక్రాంతి (Sankrathi) కోలాహలమే కనిపిస్తోంది. మనవడు దేవాన్ష్ (Devansh) ప్రత్యేక ఆకర్షణగా..  చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), బాలకృష్ణ (Balakrishna)ల సంక్రాంతి సంబరాలు అదిరిపోతున్నాయి. గ్రామం మొత్తం బాబు, బాలయ్యల సంక్రాంతి సంబరాలు అదిరిపోతున్నాయి.  వారిద్దరి రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది. మూడేళ్ల తర్వాత నారావారిపల్లె వచ్చిన నారా, నందమూరి కుటుంబాలు సంక్రాంతి వేడుకల్లో మునిగితేలుతున్నాయి. రెండు కుటుంబాలు కలిసి సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్నాయి. చంద్రబాబు, బాలకృష్ణతోపాటు, లోకేష్-బ్రాహ్మణి దంపతులు… వారి కుమారుడు దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు.

ముఖ్యంగా తెల్లవారు నుంచే బాలయ్య సందడి మొదలెట్టేశారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు సైతం భారీగానే వస్తున్నారు. తెల్లవారుతూనే బాలయ్య మార్నింగ్ జాగింగ్ కు వెళ్లారు.. ఆయనతో పాటు స్థానికులు సైతం వెనుక పరుగులు పెట్టారు.  భోగి మంటలు వేసుకుని స్థానికులతో కలిసి కాసేపు ముచ్చటించారు.. స్టార్ హీరో అయ్యి ఉండి కూడా.. సాధారణ వ్యక్తిలా తమతో కలిసిపోవడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు , బాలకృష్ణను చూడటానికి పలకరించడానికి బంధువులు, టీడీపీ శ్రేణులు నారావారిపల్లెకు పోటెత్తుతున్నారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు అయితే, స్థానికులతో ముచ్చటిస్తూ గడుపుతున్నారు. బాలకృష్ణ కోసం వస్తోన్న ఫ్యాన్స్‌ జైబాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

ఇదీ చదవండి : అంబటి రాంబాబు సూపర్ డ్యాన్స్.. భోగి పండుగ వేడుకల్లో మంత్రి జోష్.. మీరూ చూడండి

ప్రస్తుతం బాలయ్య ఫుల్ జోష్ లు ఉన్నారు.. గతేడాది అఖండ.. ఇప్పుడు వీర సింహారెడ్డి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో జోష్ లో ఉన్నారు. అలాగే అన్ స్టాప్ బుల్ టాక్ షో సీజన్ 2 సూపర్ డూపర్ హిట్ తో మరింత దూకుడుగా ఉన్నారు. అందుకే రోజు రోజుకూ ఆయనకు ఉన్న క్రేజ్ పెరుగుతోంది. అదే ఊపుతో నారావారిపల్లెలో పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటు బావా బావమరుదులు, అటు మనవడు దేవాన్స్‌ రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబర్నాంటున్నాయ్‌.

First published:

Tags: Andhra Pradesh, AP News, Balayya, Chandrababu Naidu, Nandamuri balakrishna

ఉత్తమ కథలు