హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: శ్రీవారికి భారీగా భూరీ విరాళం.. భక్తితో చెక్ అందించిన ముస్లిం దంపతులు.. విలువ ఎంతో తెలుసా?

Tirumala: శ్రీవారికి భారీగా భూరీ విరాళం.. భక్తితో చెక్ అందించిన ముస్లిం దంపతులు.. విలువ ఎంతో తెలుసా?

శ్రీవారికి భారీ కానుక సమర్పించిన ముస్లిం భక్తులు

శ్రీవారికి భారీ కానుక సమర్పించిన ముస్లిం భక్తులు

Tirumala: కలియుగ దైవం శ్రీవారికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు కానుకలు ఇస్తూ ఉంటారు. అందులో కేవలం హిందువులే కాదు.. ముస్లిం భక్తులు కూడా ఉండడం విశేషం. ఆ విరాళం ఖరీదు ఎంతో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara swamy) కొలువైన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. శ్రీవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. కోరిక కోర్కెలు తీరిపోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా.. కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కరోనా రెండేళ్లు మినహా నిత్యం వేలాదిగా స్వామి వారిని దర్శించుకుంటారు. ఇకు పవిత్ర దినాలు. బ్రహ్మోత్సవాల సమయంలో అయితే.. ఒక్కోరాజు కొండపైకి వచ్చే వారి సంఖ్య లక్షకు పైగానే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో చూస్తుంటే.. కేవలం వారంతాల్లోనే కాకుండా.. సాధారణ రోజుల్లో సైతం భారీగానే శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భారీగా భక్తులు రావడమే కాదు.. స్వామి వారికి ఇచ్చే కానుకలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే గత నాలుగు నెలల నుంచి వెంకన్న హుండి రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం హుండీ ఆదాయమే కాదు..

  అయితే నిత్యం వచ్చే హుండీ కానుకలే కాదు.. ప్రత్యేకంగా చాలామంది అత్యంత విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. ఇందులో దేశీ, విదేశీ భక్తులు కూడా ఉంటారు. అలాగే స్వామివారికి హిందువులు మాత్రమే కాదు.. ముస్లిం భక్తులు కూడా ఉన్నారు.

  వెంకటేశ్వర స్వామిని విశ్వసించి ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇక కడపలోని వెంకటేశ్వర స్వామిని అయితే తమ ఇంటి అల్లుడిగా భావించే ముస్లింలు ఉన్నారు. పండగలు, పర్వదినాల సమయంలో వెంకన్నని తమ ఇంటికి ఆహ్వానిస్తూ భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. కానుకలు సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే.

  ఇదీ చదవండి : కృష్ణం రాజు వ్యాక్స్ విగ్రహం సిద్ధం.. ప్రభాస్ కోరికపై తయారీ.. ప్రత్యేకత ఇదే

  తాజాగా తిరుమలలోని శ్రీవారిని చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ ముస్లిం దంప‌తులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను తీసుకున్నారు. ఆ తరువాత టీటీడీకి సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు 1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి దాత‌లు విరాళం చెక్కును అందించారు. తాము ఇచ్చిన విరాళంలో నగదును ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు 15 ల‌క్ష‌లు రూపాయలు వినియోగించాలని.. ఇక తిరుమ‌ల‌లో ఆధునీక‌రించిన శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు 87 ల‌క్ష‌ల రూపాయలను ఉపయోగించాలని కోరారు.

  ఇదీ చదవండి : శుక్రవారం నుంచి ఆపరేషన్ 175 కి అడుగులు.. వాయిదా పడ్డ సీఎం జగన్ కుప్పం టూర్ .. కారణం ఇదే

  ఇటీవల ముకేశ్ అంబానీ సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తరువాత తిరుమల తిరుపతి దేవస్థానానికి 1.5 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ ను.. తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. నిరంతరం ఇలా టీటీడీ అండగా నిలుస్తున్న ముకేశ్ అంబానికి ధన్యవాదాలు చెప్పారు ఆలయ అధికారులు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Ttd news