వాళ్లిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే వాళ్లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు, మతాలు వేరయినా సరే వారిని ఒక్కటి చేసింది. పెద్దలను ఎదురించి మరీ ప్రేమపెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వారి కాపురానికి గుర్తుగా తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ భార్య అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ‘మీ అమ్మాయి గుండె పోటుతో మరణించింది‘ అంటూ తన భార్య తల్లికి ఫోన్ చేసి చెప్పాడా భర్త. కానీ ఆ తల్లి మాత్రం తన కుమార్తె మృతిపట్ల అనుమానం వ్యక్తం చేసింది. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ‘నా అల్లుడే నా కూతుర్ని చంపాడు’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు చెందిన 35 ఏళ్ల లతామాధురి, కుప్పం పట్టణానికి చెందిన షానవాజ్ ఇమ్రాన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇద్దరూ బెంగళూర్లో ఉద్యోగాలు చేసేవాళ్లు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో పెద్దలు అడ్డు చెప్పినా ఇద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ హ్యాపీగా జీవిస్తూ ఉండటంతో పెద్దలు కూడా సర్దుకుపోయి వారితో బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వారిద్దరి కాపురానికి గుర్తుగా తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతేడాది లాక్ డౌన్ సమయంలో లతామాధురి, ఇమ్రాన్ బెంగళూరు నుంచి కుప్పానికి వచ్చారు. కుప్పంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!
గురువారం రాత్రి ఏమయిందో ఏమో కానీ, ‘ మీ అమ్మాయి లతామాధురి గుండెపోటుతో మరణించింది. ఆసుపత్రికి తీసుకెళ్లాను కానీ చనిపోయిందని చెప్పారు.‘ అంటూ లతామాధురి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కొద్ది గంటలకు ముందే కూతురు ఆ తల్లితో మాట్లాడింది. దీంతో తన కుమార్తె మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయనీ, తన అల్లుడే ఆమెను చంపి ఉంటాడని లతామాధురి తల్లి కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘నా కూతురు నాకు ఫోన్ చేసిన కొద్ది గంటలకే ఇమ్రాన్ ఫోన్ చేసి చనిపోయిందని చెబుతున్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆమె అలా ఎలా చనిపోతుంది. నా అల్లుడే చంపేశాడు’ అంటూ కేసు పెట్టింది. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని శుక్రవారం ఆసుపత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, Husband kill wife, Mumbai crime, Telangana crime, Wife and husband died, Wife kill husband