సాధారణంగా ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ కమిషనర్ అంటే వారివారి పనుల్లో బిజీగా ఉంటారు. ప్రజాసమస్యల పరిష్కారం, అధికారిక కార్యక్రమాలు, సమావేశలతో క్షణం తీరిక ఉండదు. అలాంటి ఓ ఎమ్మెల్యే, నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ గాయకులుగా మారిపోయారు. పబ్లిక్ సర్వెంట్స్ కాస్తా సింగర్స్ అవతారమెత్తారు. ఓ ఆట కోసం పాటపాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupathi) లో వచ్చేనేల 5వ తేదీ నుంచి జాతీయస్థాయి ఇన్విటేషన్ కబడ్డీ (Kabaddi) పోటీలు జరుగుతున్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమున కరణాకర్ రెడ్డి కేవలం నిర్వహణ బాధ్యతలో పరిమితం కాకుండా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తారు. టోర్నీకి ప్రచారం కల్పించేందుకు గాయకుడి అవతారమెత్తారు.
కబడ్డీ పోటీలకు మరింత ప్రచారాన్ని తీసుకొచ్చే క్రమంలో ఓ సింగర్ గా కొత్త పాత్ర కూడా పోషిస్తున్నారు. కబడ్డీ టోర్నీ ప్రచారం కోసం. ప్రత్యేకంగా పాటను రూపొందిస్తున్నారు. “తెగువకు తెగువకు రణ రణ సమరం...అంటూ సాగే ఓ పాటలో... లే...పంగా...కబడ్డీ కబడ్డీ కబడ్డీ...ఖేలో కబడ్డీ, ఖేలో కబడ్డీ” అంటూ భూమన కరుణాకర రెడ్డి బృంద గానం చేశారు. నగర మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ పీఎస్ గిరీషా అంతే ఉత్సాహంగా తమ గొంతు కలిపారు. స్థానిక లూప్స్ స్థూడియోలో ఈ మేరకు రికార్డింగ్ పనులు కూడా దాదాపు పూర్తైంది. ఈ ప్రమోషనల్ సాంగ్ ను సీడీ ల రూపంలో తీసుకొచ్చి ప్రచారం కల్పించనున్నారు.
త్వరలో ప్రో కబడ్డీ టోర్నీ ప్రారంభంకానున్నందున.. తిరుపతిలో నేషనల్ కబడ్డీ టోర్నీ సందడి నెలకొంది. టోర్నీకి ప్రో కబడ్డీ రేంజ్ లో ప్రచారం కల్పించి విజయవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ తో పాటపాడించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే రికార్డింగ్ స్టూడియోలో పాటపాడుతున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇది చదవండి: ఏపీలో కొవిడ్ ఆంక్షలు మరింత కఠినం.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..
ఇదిలా ఉంటే గతంలోనూ ప్రజాప్రతినిథులు తమలోని టాలెంట్ ను ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. డిప్యూటీ సీఎం పష్ప శ్రీవాణి ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించారు. వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ‘జై మోదకొండమ్మ’ అనే సినిమాలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ బయోపిక్ లో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఆయన తండ్రి పాత్రలోనే నటించి మెప్పించారు. అలాగే టీడీపీ నేతలు వర్ల రామయ్య, వంగలపూడి అనిత డాక్టర్. బీఆర్ అంబేద్కర్ పై తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati