హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minster Roja: నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్

Minster Roja: నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్

లోకేష్ ను కొట్టేస్తామంటూ రోజా ఫైర్

లోకేష్ ను కొట్టేస్తామంటూ రోజా ఫైర్

Minster Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్.. మినిస్టర్ రోజా మరోసారి చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా తాను, కొడాలి నాని ఇద్దరం టీడీపీ నుంచే వచ్చామన్నారు. లోకేష్ ఏద పడితే అది మాట్లాడితే అక్కడో లోకేష్ ను కొట్టిస్తాను అంటూ హెచ్చించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Minster Roja: పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. మంత్రి రోజా (Minster Roja) మరోసారి తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఆయన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estate Business) చేసుకోవడం కోసమే అమరావతీ అంటూ ఆరోపించారు. అసలు ప్రజలు ఏం కోరకుంటున్నారా టీడీపీ నేతలకు తెలుసా అన్నారు.

  అమరావతి  కావాలా మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను.. చంద్రబాబు నాయుడు అడగాలి అన్నారు. ఇక లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మేల్యేగా లోకేష్ గెలవలేడన్నారు. అందుకే తన అమ్మా, భార్యతో చంద్రబాబును బెదిరించి దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యి.. మంత్రి అయిన సంగతి మరిచిపోయారా అని ఆరోపించారు. 

  ఇప్పటికైనా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నారు. అంతే కానీ లోకేష్ ఎది పడితే అధి మాట్లాడితే జనాలతో అక్కడే కొట్టిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి లోకేష్ అడ్రస్ లేని వాడు అసభ్యకరంగా తిట్టారు. కొడాలి నాని మాట్లాడిన బాషలో తప్పేముంది అని ప్రశ్నించారు. తాను, కొడాలి నాని టీడీపీ నుంచే వచ్చామని.. కానీ నాడు ఎన్టీయార్ అభిమానులుగా తాము టీడీపీలో ఉన్నామన్నారు.

  ఇదీ చదవండి : నిరుద్యోగుల సమస్యపై సభలో టీడీపీ ఆందోళన.. బయట ఉద్రిక్తత.. చంద్రబాబుపై మంత్రి కీలక వ్యాఖ్యలు

  కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా లోకేష్ పీకలేరు అంటూ మండిడ్డారు. టీడీపీ నేతలు ఎవరైనా వైసీపీ మంత్రులు, ఎమ్మేల్యేల ఇళ్లపైకి వస్తే.. తరిమి తరిమి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే అన్నారు. టీడీపీ గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుంది అన్నారు.

  ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు.. ఎందుకంటే..?

  మూడు రాజధానుల బిల్ పెట్టే దమ్ము ప్రభూత్వనికి ఉందా అని టిడిపిఎల్పీ సమావేశంలో చర్చించారు ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోంది

  అన్నారు. రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది అన్న విషయం టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలి అన్నారు. చంద్రబాబు వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా అని ఎద్దేవ చేశారు. మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైసిపి ఎమ్మల్యే లు ఎందుకు రాజీనామా చేయాలన్నారు.

  ఇదీ చదవండి : చిరుతను సైతం పరిగెత్తించగల సత్తా ఆ కుక్కలది..! అందుకే అక్కడ దొంగల భయం లేదు.. ఫారెన్‌లో ఫుల్‌ డిమాండ్‌..!

  రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ సీఎం జగన్ పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తాం మని వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని భాషలో తప్పేం లేదని.. ఆయనపై ఈగ వాలినా సహించేది లేదన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Minister Roja, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు