హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: లోకేష్ కు దెబ్బలు తప్పవు.. బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు

Minister Roja: లోకేష్ కు దెబ్బలు తప్పవు.. బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు

లోకేష్, బీఆర్ఎస్ పార్టీపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

లోకేష్, బీఆర్ఎస్ పార్టీపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Minister Roja: టీటీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై నిత్యం నిప్పులు చెరిగే.. మంత్రి రోజా.. మరోసారి వారిద్దరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రను ఉద్దేశిస్తూ.. లోకేష్ తీరు పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టే అంటూ అభిప్రాయపడ్డారు. అలాగే బీఆర్ఎస్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

Minister Roja: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఇద్దరిపై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి రోజా (Minister Roja).. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహరచనలో భాగంగా తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని PLR కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), నారాయణస్వామి (Narayana Swamy), ఆర్కే రోజా (RK Roja), పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్, భరత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలపై మండిపడ్డారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేష్ తీరు ఉందని అభిప్రాయపడ్డారు. లోకేష్ తన స్ధాయికి మించి మాట్లాడుతున్నారని.. ఇంకా అధికంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఇంకా ఇలానే మాట్లాడితే లోకేష్ దెబ్బలు తినాల్సిందే అన్నారు. లోకేష్ కూడా అదే కావాలని కోరుకున్నట్లు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా.

మంత్రి పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేష్ తిరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు , లోకేష్ కు దమ్ముంటే చిత్తూరులో పోటి చేయాలని ఆమె సవాల్ విసిరారు. లోకేష్ ఒక పిల్ల పిత్రేగాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నియోజకవర్గాల్లో వచ్చి మా తాటా తీస్తానంటూ.. అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడుతుంటే సహిస్తామా అని నిలదాశారు. దమ్ముంటే ఆధారాలతో రావాలని లోకేష్ ను ఛాలెంజ్ చేశారు.

ఆయన పాదయాత్రకు జనాలు లేరు.. కనీసం పదిమంది కూడా ఉండడం లేదు.. చిత్తూరు జిల్లాలో కనీసం ఇంఛార్జులు కూడా లేని పార్టీ వాళ్ళది అని ఎద్దేవా చేశారు. పార్టీని నడపడం తనవళ్ల కాదని లోకేష్ కు అర్థమైంది కాబట్టి.. జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నారని అభిప్రాయపడ్డారు. అయినా ఇది చంద్రబాబు పార్టీ కాదు.. ఎన్టీఆర్ పార్టీ అన్నారు. టీడీపీలో చంద్రబాబు, లోకేష్ దొంగబతుకు బతుకుతున్నారు. ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీ బతకదుని అర్థమైందన్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ భజన చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి : వైఎస్ వివేకా హత్యకేసులో కీలకం గూగుల్ టేకౌట్.. అసలేంది.. ఎలా యూజ్ చేస్తారు..?

టీడీపీ అధికారంలో ఉంటే చంద్రబాబు, లోకేశ్‌కు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు రాదన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఓట్లు రాబట్టు కొనేందుకు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు వస్తుందని రోజా విమర్శించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీ పెట్టొచ్చుఅని, ఎవరైనా పోటీచేసి ప్రజల మద్దతుతో గెలవచ్చుఅని అన్నారు. అయితే, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మేనిఫెస్టో, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పి వారిని ఒప్పించగలిగితే ఎవరైనా విజయవంతం అవుతారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తారని, వంద కోట్ల ప్యాకేజీ అందిందని ప్రచారం జరుగుతోందని.. ఇదంతా టీడీపీ గేమ్ ప్లాన్‌లో భాగమే అంటూ రోజా విమర్శించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Minister Roja, Nara Lokesh, Tirupati

ఉత్తమ కథలు