(G.Hemanth Kumar,News18 Tirupathi)
ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)అన్నమయ్య(Annamayya)జిల్లాలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ గురుకుల హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఓ పసి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని వాల్మీకిపురంలోని జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో మైనర్ బాలిక ప్రసవంపై డీసీఓ వెంకట్రావు (Venkatarao)వివరణ ఇచ్చారు. బాలిక వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన తప్పిదమే ఇందుకు కారణమని సమర్ధించుకున్నారు. బాలిక పీరియడ్స్ రాకపోవడాన్ని గమనించి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినప్పటికి వాళ్లు డాక్టర్లకు వైద్యం చేయించకపోవడం వల్లే ఇంత వరకు వచ్చిందని చేతులు దులుపుకుంటున్నారు అధికారులు.
హాస్టల్‌లో మైనర్ బాలిక ప్రసవం..
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న మైనర్ బాలిక ప్రసవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వరదయ్యపాలెంకు చెందిన 14ఏళ్ల బాలిక వాల్మీకిపురంలోని జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో ఆరతొమ్మిదవ తరగతి చదువుతోంది. హాస్టల్‌లో కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో బాలికను వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మైనర్ బాలిక గర్భవతిగా గుర్తించారు. అటుపై అక్కడే మగబిడ్డను ప్రసవించింది. బిడ్డను స్వాదినం చేసుకొన్న ఐసిడిసి అధికారులు విద్యార్దిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఇంత జరుగుతున్న హాస్టల్ సిబ్బంది, అధికారులు, తల్లిదండ్రులకు తెలియకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈఘటనపై జిల్లా కలెక్టర్ హాస్టల్ సిబ్బంది, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సీరియస్ ..
హాస్టల్‌లో చదువుకుంటూ తల్లైన మైనర్ బాలిక సొంత ఊరు తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం తిరుపతికి వచ్చి శ్రీ సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వరదయ్యపాలెంలో నివాసం ఉంటున్నారు. మైనర్ బాలికను తాత, అమ్మమ్మల దగ్గర సోమలలో ఉంటూ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నట్లుగా డిసిఓ తెలిపారు. బాలిక ఆరవతరగతిలో హాస్టల్‌లో చేర్పించారు. 9తరగతి చదువుతుండగానే తల్లిగా మారింది.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లేనా...
బాలిక ప్రతి నెల పీరియడ్స్ రాకపోవడం, నాఫ్కిన్స్ తీసుకునే లిస్టులో మైనర్ బాలిక పేరు లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఎన్నోసార్లు తల్లిదండ్రులకు చెప్పినట్లుగా డీసీఓ తెలిపారు. వారు కూడా స్పందించి పిరియడ్స్ రావడం కోసం వైద్యం చేయించారు కానీ మిగతా ఎటువంటి పరీక్షలు చేయించని కారణంగానే గర్భం దాల్చడం..బిడ్డను కనడం జరిగిందన్నారు. అయితే అమ్మాయిలో ఎలాంటి మార్పులు కనిపించకపోవడం వల్లే తము గుర్తించలేక పోయామని సమర్దించుకుంటున్నారు.
విచారిస్తున్నారు..
ఈవార్త తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేసి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించామని డీసీఓ పేర్కొన్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అయితే మైనర్‌ను గర్భవతిని చేసింది ఎవరూ అనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Crime news, Tirupati