హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Floods: రాయల చెరువుకు ముప్పు తప్పినట్లేనా..? మంత్రుల ప్రకటనతో ఊరట..!

AP Floods: రాయల చెరువుకు ముప్పు తప్పినట్లేనా..? మంత్రుల ప్రకటనతో ఊరట..!

రాయల చెరువు (Rayala Cheruvu)పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పనితీరు ప్రశంసనీయం, ప్రమాదకరంగా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు వల్ల చాలా వరకూ నష్టనివారణ చేయగలిగామని, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.

రాయల చెరువు (Rayala Cheruvu)పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పనితీరు ప్రశంసనీయం, ప్రమాదకరంగా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు వల్ల చాలా వరకూ నష్టనివారణ చేయగలిగామని, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.

భారీ వరదల (AP Floods) ధాటికి ప్రమాదకరంగా మారిన చిత్తూరు జిల్లా (Chittoor District) లోని రాయల చెరువు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ప్రస్తుతానికి ముప్పుతప్పినట్లేనని వెల్లడించారు.

భారీ వరదల (AP Floods) ధాటికి ప్రమాదకరంగా మారిన చిత్తూరు జిల్లా (Chittoor District) లోని రాయల చెరువు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పనితీరు ప్రశంసనీయం, ప్రమాదకరంగా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు వల్ల చాలా వరకూ నష్టనివారణ చేయగలిగామని, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం మద్యాహ్నం డిప్యూటి సి.ఎం.నారాయణ స్వామి, తిరుపతి ఎం.పి.గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎం.ఎల్.ఎ. బియ్యపు మధుసూదన రెడ్డి, ఎం.పి.పి. మొహిత్ రెడ్డి రాయల చెరువును పరిశీలించి... మరమ్మత్తుల పనులను పర్యవేక్షించారు.

స్వయంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పడవలో ప్రయాణం చేసి ప్రజల ఇబ్బందులను మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు వల్ల చాలా వరకూ నష్టనివారణ చేయగలిగామన్నారు.

ఇది చదవండి: మూడు రాజధానుల బిల్లు రద్దు విశాఖకు లాభమా..? నష్టమా..? రియల్ ఎస్టేట్ పరిస్థితేంటి..?


ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. భద్రతా బలగాలు సహా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను, ఎన్డీఆర్ఎఫ్ బలగాల కృషిని ఆయన అభినందించారు.

ఇది చదవండి: మూడు రాజధానులపై వెనక్కి తగ్గడానికి కారణాలేంటి..? సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..?


అంతకుముందు నీటి ప్రవాహం, నిల్వ, ఔట్ ఫ్లో వివరాలను బోటులో ప్రయాణం చేస్తూ చెరువు ప్రభావిత గ్రామాల ప్రజల ఇబ్బందులను ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్స్ కమిటీలో అధికారుల ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్. బలగాల సహకారంతో గొల్లపల్లి, సూరావారిపల్లి పల్లె ప్రజలను మంత్రి గౌతమ్ రెడ్డి పరామర్శించి.., ప్రభుత్వం తరపున భరోసా నింపారు.

ఇది చదవండి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వింత పరిస్థితి.. పెళ్లికి ప్రొబేషన్ కు లింక్..! అదెలాగంటే..!


వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని కాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితుల పరిస్థితి, ఆహార పంపిణీ,వసతులపై మంత్రి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. నిండుకుండను తలపిస్తున్న రాయలచెరువు ప్రమాద పరిస్థితులు, మరమ్మత్తుల పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఇన్చార్జి మంత్రి మేకపాటి ఆదేశించారు. రాయల చెరువు కట్ట తెగే పరిస్థితి లేదని ప్రజలు నిశ్చింతగా ఉండాలన్నారు. పూర్తిగా నీటమునిగిన గ్రామాలలో ప్రజల కష్టాలను తెలుసుకున్నామని, స్థానిక చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డితో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

ఇది చదవండి: అమెరికా వదిలి ఆంధ్రాలో వ్యవసాయం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ..డిప్యూటి సి.ఎం. నారాయణ స్వామి మాట్లాడుతూ రాయలవారు నిర్మించిన చెరువు ఏమి కాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎం జగన్ రాయల చెరువు పై ఆందోళన చెందారని.., వెంటనే సహాయ కార్యక్రమాలు అందించాలని ఆదేశించారని అన్నారు. ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్స్ కమిటీ తక్షణ చర్యలు అవసరం అన్నారు, ఇన్ ఫ్లో 2500 క్యూసెక్కులు 3500 క్యూసెక్కులు గా వుంది , 0.5 టి.ఎం.సి. కెపాసిటీ అయితే ప్రస్తుతం 0.8 గా వుందని ఆయకట్టు సుమారు 1500 ఎకరాలు అని తెలిపారు. మరమ్మత్తులు త్వరగా చేయాలని సూచించారు. ఆమేరకు వేగవంతంగా జరుగుతున్నాయి అన్నారు. ప్రభుత్వ తక్షణ సహాయంగా నిత్యావసర వసతులు అందిస్తున్నారు. భారీ వర్షాల వల్ల చోటు చేసుకున్న పరిస్థితులు బాధాకరం అన్నారు.

First published:

Tags: AP Floods, Chittoor, Mekapati Goutam Reddy, Narayana Swamy

ఉత్తమ కథలు