హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Roja on Chandrababu: కరోనాకు చంద్రబాబు వ్యాక్సిన్ కనిపెట్టారు.. కొడుకుని ఎలా గెలిపించాలో తెలుసుకోలేకపోయారా..?

Roja on Chandrababu: కరోనాకు చంద్రబాబు వ్యాక్సిన్ కనిపెట్టారు.. కొడుకుని ఎలా గెలిపించాలో తెలుసుకోలేకపోయారా..?

 మంత్రి రోజా (file)

మంత్రి రోజా (file)

Roja on Chandrababu: తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఖమ్మంలోనే చేసినే వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావడానికి తానే కారణం అని చెప్పిన మాటలపై.. సెటైర్లు పేలుతున్నాయి. ఇప్పటికే నెటిజన్లు మీమ్స్ తో రెచ్చిపోతుంటే.. మంత్రి రోజా సైతం చంద్రబాబుపై సెటైర్లు వేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagari, India

Roja on Chandrababu: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై మరోసారి సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణ (Telangana) పై ఫోకస్ చేసిన ఆయన.. ఖమ్మం (Khammam) లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడి ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారాయి. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే..? 30 ఏళ్ళ తర్వాత ఏంజరగనుందో ఇప్పుడే చెప్పగలను అన్నారు. అలాగే హైదరాబాద్ (Hyderabad) అభివృద్ది చేసింది తానే అని చెప్పారు. ఈ నాటి జనరేషన్ ఎలా ఆలోచిస్తుందో తనకు తెలుసన్నారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) లాంటి అనేక కంపెనీలను హైదరాబాద్ కు తెచ్చింది తానే అన్నారు. ఇంకా అనేక కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయంటే కారణం తాను ఫౌండేషన్ వేశాను కాబట్టే అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్, సికిందరాబాద్ మాత్రమే ఉండేవని.. తాను సైబరాబాద్ కట్టానని.. హైద్రాబాద్ ను ఎన్నో రెట్లు అభివృద్ది చేశానని చెప్పారు. అక్కడితోనే ఆగలేదు సెల్ ఫోన్ రావడానికి కూడా కారణం తానే అన్నారు. ఇవన్నీ ఓ ఎత్తైతే.. కరోనా వ్యాక్సిన్ రావడానికి తానే కారణం అనడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

తాను అధికారంలో ఉండగా ఫార్మా కంపెనీలను చాలా వరకు ప్రోత్సహించాను అన్నారు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఫార్మా కంపెనీల అభివృద్దికి తాను కారణమయ్యాను అన్నారు. అప్పుడు వారికి సరైన అవకాశాలు ఇవ్వబట్టి.. ఈ రోజు వారు భయంకరమైన కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టగలిగారని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర సెటైర్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించిన ఆమె.. చంద్రబాబుపై పంచ్ డైలాగ్ లు పేల్చారు. చంద్రబాబును రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారన్నారు. ఆంధ్రాలో ప్రతిపక్షంగా కూడా ఉండలేక ఖమ్మం వెళ్లి మాట్లాడుతున్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తట్టుకోలేక తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటున్నారేమో అన్నారు రోజా. ఖమ్మం నా గుమ్మం అన్నారు..

ఇదీ చదవండి : కరోనా కొత్త వేరియంట్ పై అలర్ట్.. పక్కా ప్రణాళికతో వెళ్లాలన్న సీఎం జగన్

మరి మీకు జీవితాన్నిచ్చిన కుప్పం ప్రజలకు ఏం చెబుతారని? మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయనకు మతిభ్రమించిందని అర్థమవుతోంది అన్నారు. సెల్ ఫోన్ తానే కనిపెట్టాను అని చంద్రబాబు అంటారని.. ఇప్పుడు ఏకంగా కరోనాకు వ్యాక్సిన్ తానే కనిపెట్టాను అంటున్నారని.. అయితే ఇన్ని కనిపెట్టిన చంద్రబాబుకు కొడుకు లోకేష్ ను గెలిపించుకోడం తెలియదా? అని ఎద్దేవ చేశారు.

ఇదీ చదవండి : కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి తానే కారణమన్న చంద్రబాబు.. మరోసారి ఆడేసుకుంటున్న నెటిజన్లు

ఖమ్మంలో సభపై ఇటు వైసీపీ నేతలు, అటు బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు సైతం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో ఛీత్కారానికి గురై ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తాననడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలే పాలన బాగాలేదని చిత్తుచిత్తుగా ఓడించి వెళ్లగొడితే.. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారన్నారు హరీష్ రావు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Minister Roja

ఉత్తమ కథలు