Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల వచ్చిన ఎమ్మెల్సీ ఫలితాల (MLC Elections Result) దుమారం ఆగడం లేదు. దాని చుట్టూ రాజకీయ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ (TDP) కి కేవలం 19 మంది సభ్యుల బలం ఉంటే.. టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ (YCP) కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓట్లు పడడంతోనే టీడీపీ మహిళ నేత పంచుమర్తి అనురాధ (Panchamarthi Anuradha) విజయం సాధించారు. అయితే అందులో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డిల (Anam Ramanarayan Reddy) ఓట్లు టీడీపీకి పడతాయి అంటూ ముందునుంచే వైసీపీ పెద్దలు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా వారికి షాక్ ఇస్తూ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు. దీనిపై సీరియస్ అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డలను కూడా సస్పెండ్ చేశారు. అయితే వారిద్దరు మాత్రం తాము వైసీపికే ఓటు వేశామంటున్నారు. అయినా సీక్రెట్ ఓటింగ్ లో ఎవరికి ఎవరు ఓటు వేశారన్నది ఎలా నిర్ధారిస్తారని.. అసలు వివరణ తీసుకోకుండా ఎలా సస్పెండ్ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు.
రోజా ఏమన్నారంటే..? తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. అయితే ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అయినా ఇవి ప్రజలు ఓట్లు వేసే ఎన్నిక కాదని.. అయినా టీడీపీ హంగామా చూస్తే ఆశ్చర్యం వేస్తోంది అన్నారు.
సింహం ఒక్క అడుగు వేసినంత మాత్రనే ఓడిపోయినట్టు కాదు అన్నారు. ఇప్పుడు మరింత బలంగా.. వేగంగా జగన్ పైకి వస్తారని అభిప్రాయపడ్డారు.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు నెగ్గి తీరుతామని జోస్యం చెప్పారు. కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. గెలిచినది కూడా ఒక గెలుపేనా అని ఆమె ఎద్దేవ చేశారు.
ఇదీ చదవండి: ఆ రోజు జగన్ ఫోన్ చేశారు.. ఆనం సంచలన వ్యాఖ్యలు.. ఓటు ఎవరికి వేశారంటే..?
ఒక్క ఎమ్మెల్సీ సీటు నెగ్గి.. పులివెందుల కూడా నెగ్గుతామని టీడీపీ నేతలు జోక్ లు వేసుకుంటున్నారని.. పులివెందుల కాదు.. కనీసం పులివెందుల చెక్ పోస్టును కూడా చంద్రబాబు నాయుడు టచ్ చేయలేరు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 17 వైసీపీ నెగ్గినా దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. డబ్బులిచ్చి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటే.. జగన్ మాత్రం జనం గుండెల్లో ఉన్నారన్నారు..
ఇదీ చదవండి : సస్పెన్షన్ కు గురైన ఆ నలుగురి ఎమ్మెల్యేల దారి ఎటు..? సీట్లపై హామీ వచ్చిందా..?
రాజకీయ నాయకులను తయారు చేసే సత్తా ఉన్న నేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేవలం నలుగురు మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్తే.. 40 మంది నాయకులను తయ్యారు చేసే శక్తి జగన్ కు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ను కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన నేతలు.. ఇప్పుడు వైసీపీకి ఓటు వేశారని ఇంకా డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు చూపించిన ఆశకు అమ్ముడు పోయిన నేతకలు రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Minister Roja