Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహర్ రెడ్డి CM Jagan MOhan Reddy) తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR).. ఇద్దరి మధ్య మొన్నటి వరకు సత్సంబంధాలు ఉండేవి.. రెండు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలే ఉన్నాయి.. అయినా రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణమే కనిపించేది.. కొన్ని సందర్భాల్లో మాటకు మాట వచ్చినప్పుడు విమర్శించడమే తప్పా.. కేసీఆర్ టార్గెట్ గా వైసీపీ నేతలు పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు.. తెలంగాణ మంత్రులు (Telangana Ministers) ఏపీ పాలనపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ.. వైసీపీ నేతలు ఎప్పుడు తెలంగాణ పాలనపై కామెంట్లు చేయలేదు.
ఇప్పుడు పరిస్థితి మారిందా..? బీఆర్ఎస్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెడుతున్న కేసీఆర్ తో వైసీపీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది. సాధారణంగా అయితే.. బీఆర్ఎస్ వైసీపీ మధ్య సన్నిహిత సబంధాలే ఉంటాయనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయడం వల్ల.. ఎంతో కొంత ఓట్లు చీలక ఉంటుందని.. అది వైసీపీకి అడ్వాంటేజ్ అవ్వొచ్చు. ఈ లెక్కల ప్రకారం కేసీఆర్ ను ఆంధ్రకు ఆహ్వానిస్తే ఎంతో కొంత అడ్వాంటేజ్ లేకపోలేదు అన్నది కొందరి వాదన... అందుకే బీఆర్ఎస్ తో జగన్ సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి.
కానీ తాజా పరిస్థితి చూస్తే.. బీఆర్ఎస్, టీఆర్ ఎస్ వివాదం పెద్దది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ నేతలు, మంత్రులు అంతా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి రోజా సైతం సంలచన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..?
ఇదీ చదవండి : పుట్టెడు దు:ఖంలో ఉన్నవారిని కాటేస్తున్న అంబులెన్స్ ముఠా.. అడిగినంత ఇవ్వకుంటే అంతే.. బయట వాహనం మాట్లాడితే రచ్చ రచ్చ
సాధారణంగా ఎక్కడైనా రాష్ట్రం కోరుకునే వారే రాజధాని కట్టుకోవాలి.. కానీ కేసీఆర్ మాత్రం కుట్రపూరితంగా రాజధానిని తెలంగాణకు కేటాయించి.. ఏపీకి రాజధాని లేకుండా చేశారని రోజా ఆరోపించారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి చట్టం ప్రకారం రావాల్సినవి ఈరోజుకు ఇవ్వలేదన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరే ఏపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు..
ఇదీ చదవండి : లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకే కుట్రలు.. ప్రమాదాన్ని పార్టీకి అంటగట్టడంపై టీడీపీ ఫైర్
ఇక ఏపీలో విపక్ష పార్టీలపై మండిపడ్డ మంత్రి రోజా. రాష్ట్రంలో పనికిమాలిన విపక్షపార్టీలు ఉన్నాయని విమర్శించారు. ప్రజలకోసం పార్టీపెట్టానన్న పవన్ ఎక్కడున్నారు?.. కందుకూరు, గుంటూరు ఘటనకు విలువలేదా?.. అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌కు అధికారమే కావాలన్నారు. ప్రజల ప్రాణాలు అంటే వారికి లెక్కలేదన్నారు. కానీ తమ ప్రభుత్వానికి ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. అందుకే ఇకపై ఎక్కడబడితే అక్కడ రాజకీయ సభలకు అనుమతించే పరిస్థితి ఉండదన్నారు. రాజకీయ సభలు ప్రజలను చైతన్య పరచడానికే కానీ ప్రాణాలు తీసేందుకు కాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 3600 కిలో మీటర్ల పాదయాత్ర చేసి జగన్ సీఎం అయ్యారని.. కానీ సభల్లో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. గ్రౌండ్లు, ఊరికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకుంటేనే ఇకపై రాజకీయ సభలకు అనుమతి లేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Minister Roja