హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి వార్నింగ్

AP Politics: మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి వార్నింగ్

చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్

చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కుప్పం పర్యటనపై వైసీపీ (YSRCP) నుంచి కౌంటర్లు గట్టిగానే వస్తున్నాయి. తన పర్యటనలో చంద్రబాబు చేస్తున్న విమర్శలకు చిత్తూరు జిల్లా నేతలతో పాటు మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు.

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కుప్పం పర్యటనపై వైసీపీ (YSRCP) నుంచి కౌంటర్లు గట్టిగానే వస్తున్నాయి. తన పర్యటనలో చంద్రబాబు చేస్తున్న విమర్శలకు చిత్తూరు జిల్లా నేతలతో పాటు మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుకు గట్టి వార్నింగే ఇచ్చారు. అంతేకాదు ఇకపై మాటల్లో కాదని.. చేతల్లో చూపిస్తానని హెచ్చరించారు. ఒక సీనియర్ ఎమ్మెల్యే అయి ఉండి చంద్రబాబు జిల్లాకు, కుప్పం నియోజకవర్గానికి ఏ చేశారో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. కుప్పం ను అబివృద్ది చేయాలని చంద్రబాబు కలలుగన్నానన్న చంద్రబాబు.. 14 ఏళ్ళు సీఎం గా ఉండి ఏంచేశారని నిలదీసిన పెద్దిరెడ్డి.., 5 ఏళ్ళల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు అయ్యారన్నారు.

చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దృదృష్టమన్న ఆయన.. సీఎం గా ఉన్నప్పుడు కుప్పంలో గ్రానైట్ మైనింగ్ చేశారని ఆరోపించారు. అక్కడ ఎవరు మైనింగ్ చేశారో అందరికీ తెలుసున్న పెద్దిరెడ్డి.. వారిలో తమిళనాడు వాళ్ళు, కుప్పం వాళ్ళు కూడా ఉన్నారన్నారు. చంద్రబాబు కుప్పంలో మైనింగ్ రాయల్టీ పై కన్సెషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కుప్పంలో నేను గ్రానైట్ అక్రమ మైనింగ్ చేసాను అని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే చంద్రబాబు కి ఈ బాధ అని.. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఓటమికి జగన్ పాలన, పెద్దిరెడ్డీ కారణం అని బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇది చదవండి: తమిళంలో చంద్రబాబు స్పీచ్.. జగన్ పై జోకులు పేల్చిన టీడీపీ అధినేత..


చంద్రబాబు దుష్ట పరిపాలన వదిలించుకోవడానికే వైసీపీకి ప్రజలు 151 సీట్లు ఇచ్చారని.. ఇప్పుడు సిగ్గు లేకుండా కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. బాబును కుప్పంలో ఓడించి జగన్ కు కానుకగా ఇస్తామని.. ఇది తప్పకుండా జరుగుతుందన్నారు. అంతేకాదు చంద్రబాబు ఎన్ని చెప్పినా చిత్తూరు జిల్లా ప్రజలు నమ్మరని.. ఇకపై తాను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తానని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

ఇది చదవండి: సంక్రాంతి వేళ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు.. పరువు పోతుందని టెన్షన్.. కారణం ఇదే..!


మూడు రోజులుగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేస్తున్నారు. శనివారం గుడిపల్లి మండలం జాతకర్తనపల్లిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యువతకు ఉపాధి, జాబ్ క్యాలెండర్, మద్యం విధానం, సిమెంట్ ధరలపై చంద్రబాబు.. ప్రభుత్వంపై విమర్శలు చేసారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పులివెందులలో చేపల మార్కెట్, అక్కడక్కడా మటన్ మార్కెట్లను పెట్టి ఉద్యోగాలు ఇచ్చారన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇదే జగన్ జాబ్ చార్ట్ అని విమర్శించారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam, Peddireddy Ramachandra Reddy

ఉత్తమ కథలు