Mega Fan: అభిమానమంటే ఇదే... చిరు, పవన్ కోసం 600కి.మీ సైకిల్ యాత్ర...

మెగా అభిమాని ఈశ్వర్

సినిమా హీరోలపై అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. తాము అభిమానించే హీరోల కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికైనా వెనుకాడరు. కానీ ఓ మెగా అభిమాని..

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  సినిమా హీరోలపై అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. తాము అభిమానించే హీరోల కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికైనా వెనుకాడరు. తమ అభిమాన హీరో ఫోటోను మొబైల్ వాల్ పేపర్ గానూ., ఇంట్లో వాల్ పోస్టర్ గాను పెట్టుకుంటారు. ఇక కొందరు చేతిపై టాటూ లాంటివి వేసుకుంటూ వుంటారు. మరి కొందరు తమ అభిమాన హీరో గురించి ఎవరైనా ఏమైనా అంటే గొడవ వేసుకుంటారు. వారి వారి ఆలోచన బట్టి.., అభిమాన హీరోపై వారు చూపే అభిమానం వేర్వేరుగా ఉంటాయి. తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్ చేసే హంగామానే వేరు. ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి పాలాభిషేకం వరకు అభిమానులదే కోలాహలం. ఇక అభిమాన నటీనటులకు ఆరోగ్య సమస్య వస్తే.. ఆలయాల్లో అర్చనలు, యాగాలు చేస్తారు. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎందరో. చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందర్నీ మెగాఫ్యాన్స్ ఆరాధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మెగా ఫ్యాన్స్ ఉన్నారు.

  మెగా ఫ్యామిలీ సినిమాలనే కాదు.. వారు చేసే సేవా కార్యక్రమాలను కూడా ఫాలో అవుతుంటారు. చిరంజీవి పిలుపు మేరకు రక్తదానాలు, నేత్రదానాలు చేస్తున్నారు. వారి పుట్టిన రోజుల నాడు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని మెగా స్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకుంటే ప్రముఖ ఆలయాలకు సైకిల్ పై వస్తానని మొక్కుకున్నాడు. తన మొక్కులు తీర్చుకునేందుకు సైకిల్ పై బయలుదేరాడు. వివరాల్లోకి వెళ్తే... తిరుపతికి చెందిన ఈశ్వర్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటే ఎనలేని అభిమానం. ఇటీవల పవన్ కల్యాణ్ తో పాటు రామ్ చరణ్, నాగబాబు, వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు. దీంతో వారు కోలుకోవాలని తిరుమల వెంకటేశ్వరస్వామిని, విజయవాడ కనకదుర్గమ్మను, కొండగట్టు ఆంజనేయస్వామిని సైకిల్ పై వచ్చి దర్శించుకుంటానని మొక్కుకున్నాడు.

  ఇది చదవండి: అర్ధరాత్రి రోడ్డు పక్కన అమ్మాయిలు చేసిన ఆ పనికి అంతా షాక్... సీసీ ఫుటేజ్ వైరల్...


  పవన్ తో పాటు మిగిలిన వారంతా పూర్తిగా కోలుకోవడంతో తన మొక్కులు చెల్లించుకునేందుకు బయలుదేరాడు ఈశ్వర్. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా కొండగట్టు అంజేయస్వామి ఆలయం వరకు సైకిల్ యాత్రను చేపట్టాడు. ఈ సైకిల్ యాత్ర 605 కిలోమీటర్లు సాగనుంది. గతంలో కూడా ఈశ్వర్ మెగా ఫామిలీ క్షేమం కోసం ఎన్నోసార్లు ఆలయాల్లో పొర్లుదండాలు కూడా పెట్టాడు. 2024లో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలన్నదే తన ఆకాంక్షగా చెప్తున్నాడు ఈశ్వర్. అందుకోసం ముక్కోటి దేవతలను సైతం వేడుకుంటున్నట్లు చెప్తున్నాడు అయన.

  ఇది చదవండి: ఏపీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల... ఇలా అప్లై చేసుకోండి…


  అయితే మెగా ఫ్యామిలీకి ఈశ్వర్ కు విడదీయరాని సంభంధం ఉందని జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. ఈశ్వర్ గతంలో ఏడు సార్లు మెగా ఫ్యామిలీ కోసం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారని గుర్తు చేశారు. యాత్ర ద్వారా మెగా ఫ్యామిలీ అభిమానాన్ని ఈశ్వర్ మరోసారి సంపాదించుకున్నారన్నారు. ఈశ్వర్ సైకిల్ యాత్రపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారని, ఆయన యాత్ర సాగే ప్రదేశాల్లో జనసైనికులు ఘన స్వాగతం పలకాలని పవన్ కళ్యాణ్ సూచించారన్నారు.
  Published by:Purna Chandra
  First published: