Home /News /andhra-pradesh /

TIRUPATI MAVULLAMA TEMPLE HAS ANCIENT HISTORY IN SULLORUPET AS TEMPLE HAS NO DOORS IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Tirupati Temple: ఆ ఆలయానికి తలుపులే ఉండవు.. అమ్మవారే అంతటికీ రక్ష

చెంగాళమ్మ ఆలయం

చెంగాళమ్మ ఆలయం

Mavullamma Temple: హిందూ సాంప్రదాయం ప్రకారం శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలతో పాటుగా శక్తిప్రదాయని ఆలయాలను భక్తులు అధికంగా ఆరాధిస్తుంటారు. ఈ సృష్టికి మూలంమైన శక్తి స్వరూపిణి, సకల జీవకోటిని‌ తన చల్లటి చూపుతో‌ రక్షించే ఆది పరాశక్తి అమ్మవారిని పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  హిందూ సాంప్రదాయం ప్రకారం శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలతో పాటుగా శక్తిప్రదాయని ఆలయాలను భక్తులు అధికంగా ఆరాధిస్తుంటారు. ఈ సృష్టికి మూలంమైన శక్తి స్వరూపిణి, సకల జీవకోటిని‌ తన చల్లటి చూపుతో‌ రక్షించే ఆది పరాశక్తి అమ్మవారిని పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా గ్రామాల్లో వెలసిన దేవతాలను సాధారణంగా ఒక్కో పేరుతో‌ పిలుచుకుంటూ ఆరాధిస్తూ ఉంటాం. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో శక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారు వివిధ విపత్కర పరిస్ధితుల నుండి మనల్ని కాపాడుతూ వస్తుంటారు. అమ్మవారిపై ఒక్కోక్కరు ఒక్కో‌రూపంలో భక్తి విశ్వాసంతో పూజించడమే కాకుండా శక్తి స్వరూపిణి ఇక్కడే వెలసిన క్షేత్రంగా భక్తులకు అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. తిరుపతి జిల్లా (Tirupati District), తమిళనాడు (Tamilnadu)కి సరిహద్దు ప్రాంతంమైన సూళ్లూరు పేటలో కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలందుకుంటున్న శ్రీచెంగాలమ్మ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

  భక్తుల‌ పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న చెంగాలమ్మ ఆలయానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అచ్చం మనిషి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలన్ని తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ‌అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు కూడా తమ ప్రయోగానికి ముందుగా అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాతే తమ ప్రయోగాన్ని మొదలు పెడతారుం. దాదాపు పదో శతాబ్దకాలంలో శుభగిరి అనే గ్రామంలో గొల్లకులస్తులు అధికంగా ఉండేవారు. వీరందరూ పశువులు మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవారు.

  ఇది చదవండి: నయనతారపై టీటీడీ సీరియస్.. చర్యలకు సిద్ధం.. క్షమాపణ చెప్పిన కొత్తజంట..


  ప్రతిరోజూ మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్ళారు కొందరు బాలురు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేముందు సమీపంలోని పవిత్ర కళంగినదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకునిపోతూ, ఒక శిలను పట్టుకుని, ఆ శిల ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నాడు ఓ యువకుడు. నది నుండి బయట పడిన. ఆ యువకుడు ఓ శిలను పట్టుకుని బయట పడినట్లు చెప్పుకొచ్చాడు‌. దీంతో నదిలో దిగిన యువకులు శిలను జాగ్రతగా ఒడ్డు మీద‌ ఉన్న ఓ చెట్టు వద్దకు చేర్చారు.

  ఇది చదవండి: వాళ్లిద్దరి పేర్లు ఒకటే.. అదే వారి జీవితాలను తారుమారు చేసింది.. ఎంతపనిచేశావ్ సెల్వరాజ్..!


  అష్ట భుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల క్రింద దానవుని దునుముతున్న స్త్రీమూర్తి విగ్రహంగా భావించిన యువకులు ఆ విగ్రహాన్ని పడుకోబెట్టి వేంటనే గ్రామస్తులకు సమాచారమిచ్చారు. తర్వాతి రోజు స్థానికులు, పశువుల కాపర్లు వచ్చి చూడగా.. అమ్మవారి విగ్రహం లేచి నిలబడి ఉంది. దీంతో ఆశ్చర్యానికి గురైన స్థానికులు ఆ మహిషాసురమర్ధనియే స్వయంభుగా వెలిసిందని భావించి.. విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లి ఆలయాన్నినిర్మించాలని భావించారు. తర్వాతి రాత్రి అమ్మవారు గ్రామపెద్ద కలలో కనిపించి తాను నది ఒడ్డునే ఉండదలిచానని సెలవిచ్చింది.

  ఇది చదవండి: పసుపు రంగు పుచ్చకాయల్లో అంత పవరుందా..? ఎగబడుతున్న జనం..


  దీంతో గ్రామస్తులంతా కలిసి నది ఒడ్డునే రావి చెట్టు వద్ద అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిని అయినా శాంతి మూర్తిగా కొలువుతీర్చి నిత్య పూజలు అందిస్తూ వచ్చేవారు గ్రామస్తులు.‌ నేటికీ ఏడేళ్లకోసారి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తుంటారు. వివిధ పేర్లతో పిలువబడుతూ ఆంగ్లేయుల కాలంలో‌ సూళూరుపేట రూపాంతం చేందినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: క్యాట్ వాక్ గురించి తెలుసు.. మరి బర్డ్ వాక్ అంటే ఎంటో తెలుసా..?


  ఏడు సంవత్సరాలకొకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద "సిడి మాను" తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. ఈ చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయం ప్రాంగణంలో తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజ గోపురం నిర్మించబడి‌ ఉండగా, ఉప ఆలయాలలో గణపతి, లింగ రూప కైలాసనాధుడు, నాగ దేవతలు కొలువుతీరి భక్తులకు దర్శనం మిస్తుంటారు. అంతేకాకుండా ప్రధాన ఆలయం ముఖ మండపంలో నవదుర్గ రూపాలను సుందరంగా మలచిన రూపాలు అద్భుతంగా ఉంటుంది. గర్భాలయంలో‌ సర్వాలంకరణభూషితగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు.

  ఇది చదవండి: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!


  ఆలయానికి తలుపులు ఎందుకు లేవంటే..?
  కొన్ని సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించి భంగపడ్డాడని, అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారని, కానీ అమ్మవారు స్వప్నంలో "నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు" అని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారట. ఎండిపోయి, చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగిందని, ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చు. ఈ వృక్షం దగ్గర నాగ లింగం, నవ గ్రహ మండపం కొలువైయుంటాయి. సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయలలు కట్టి నియమంగా ప్రదక్షిణలు చేస్తే వారికి‌సంతానం కలుగుతుందని‌ భక్తుల ప్రగాఢ విశ్వాసం.  ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్ధం నిర్వహిస్తూ ఉంటారు. వివాహము, ఉపనయనం, పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి కార్యక్రమాలు ప్రతినిత్యం ఆలయంలో‌ నిర్వహిస్తూ ఉంటారు. ఏడేళ్లకోసారి మే-జూన్ నెలల మధ్య అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సుడిమాను ప్రతిష్ట, బలి సంహరణతో ప్రారంభంమై, రెండో రోజు నుండి నాలుగో రోజు వరకు సుడిమానుకు చక్రం, నల్లమేక, పూలమాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. మూడో రోజున మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడంతో లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు అయిదో రోజున కాళింకి నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirupati

  తదుపరి వార్తలు