Shock in Marriage: పీటల మీద నుంచి వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..

ప్రతీకాత్మక చిత్రం

Twist in Marriage: వధువరులిద్దరూ పీటల మీద కూర్చున్నారు. కాసేపట్లో మాంగళ్యధారణ కూడా జరగాల్సి ఉంది. కానీ ఆ పెళ్లి కూతురు పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. సినిమాల్లో మాదిరిగా ఆపండీ అని ఎవరూ ట్విస్ట్ ఇవ్వలేదు.

 • Share this:
  Twist in Marriage: అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. జాతకాలు కలిశాయి. కట్నకానుకలు కుదిరాయి. శుభలేఖలు ప్రింట్ అయ్యాయి. కల్యాణ వేదిక సిద్ధమైంది. పంతులుగారు వచ్చేశారు. భోజనాలు రెడీ అయ్యాయి. పెళ్లి మండపంలో పూజ జరుగుతోంది. వధువరులిద్దరూ పీటల మీద కూర్చున్నారు. కాసేపట్లో మాంగళ్యధారణ కూడా జరగాల్సి ఉంది. కానీ ఆ పెళ్లి కూతురు పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. సినిమాల్లో మాదిరిగా ఆపండీ అని ఎవరూ ట్విస్ట్ ఇవ్వలేదు. కట్నం దగ్గర గొడవలు కూడా జరగలేదు. కానీ పెళ్లి ఆగిపోయింది. మేళాలు ఆగిపోయాయి. కల్యాణమండపం మూగపోయింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చినా పెళ్లి తంతు ముందుకు కదల్లేదు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో పెళ్లి (Marriage) ఆగిపోవడంతో వరుడికి నిరాశ తప్పలేదు.

  వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అనంతపురం జిల్లా (Anantapuram District) గుంతకల్లుకు చెందిన యువకుడికి.. కడప జిల్లా చాపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెళ్లి కుదిరింది. ఈనెల 3వ తేదీన పెద్దలు ముహూర్తం పెట్టించారు. వరుడి ఇంటి దగ్గర పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధువు కూడా పెళ్లి మండపానికి చేరుకుంది. ఐతే వరుడి కుటుంబ సభ్యులు సరైన మర్యాదలు చేయలేదంటూ వధువు బంధువులు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఐతే చిన్నవివాదంతో పెళ్లిని ఆపడం సరికాదని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అమ్మాయి తరపువాళ్లు వినలేదు. పెళ్లి జరిగేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. పెళ్లి వద్దంటూ వచ్చిన బస్సులోనే తిరిగి వెళ్లిపోయారు. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది.

  ఇది చదవండి: ప్రియుడితో సహజీవనం... ఆతడికి తెలిసిన వారితో వ్యాపారం.. ఇంతలో కిడ్నాప్...


  ఇటీవల చిత్తూరు జిల్లాలో చివరి నిముషంలో పెళ్లి ఆగిపోయింది. తెల్లవారుజామున ముహూర్తం కావడంతో సాయంత్రం వధువరులిద్దరితో రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. అమ్మాయికి నలుగు కార్యక్రమం నిర్వహించేందుకు పెద్దలు వెళ్లి అమ్మాయి గదిలో చూడగా అక్కడ లేదు. పెళ్లి నచ్చకో, అబ్బాయి నచ్చకో తెలియదుగాని ఆ యువతి సైలెంట్ గా కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయింది. బంధువులంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది.

  ఇది చదవండి: రన్నింగ్ లో ఉండగా ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు... ఫోటోలు వైరల్..


  అలాగే విశాఖపట్నంలోని ఆరిలోవలో కూడా జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాసేపట్లో పెళ్లనగా ఓ యువతి డయల్ 100కు కాల్ చేసి తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ప్రత్యక్షమైన పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు. ఐతే కంప్లైంట్ ఇచ్చిన రోజు తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని చెప్పిన యువతి.. ఆ తర్వాతి రోజే సింహాచలంలో తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. తాను ఎంతచెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదని... అందుకే పోలీసుల సాయంతో పెళ్లిని తప్పించుకున్నాని యువతి చెప్పింది. తల్లిదండ్రులు తన జోలికి రావొద్దని కూడా విజ్ఞప్తి చేసిందామె.
  Published by:Purna Chandra
  First published: