హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extramarital Affair: భర్తతో భార్య గొడవ.. మధ్యలో ప్రియుడు ఎంట్రీ.. తల్లిబాగోతాన్ని బయటపెట్టిన కొడుకు..

Extramarital Affair: భర్తతో భార్య గొడవ.. మధ్యలో ప్రియుడు ఎంట్రీ.. తల్లిబాగోతాన్ని బయటపెట్టిన కొడుకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Affaire: భార్యభర్తలిద్దరూ (Wife And Husband) ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండేవి. ఐతే చిన్నచిన్న విషయాలకే భార్య..నవీన్ తో గొడవ పడుతుండేది. ఇంతలో నవీన్ కు షాకింగ్ నిజం తెలిసింది.

  GT Hemanth Kumar, Tirupathi, News18

  దాంపత్య జీవితం అంటే అనురాగాలకు ఆప్యాయతకు నిదర్శనంగా ఉండాలి. ఒకరిపై మరొకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని రంగరిస్తేనే మూడు ముళ్ల బంధం నిండు నూరేళ్లు పచ్చగా సాగుతుంది. భర్తతో గొడవ జరిగిందని పక్కింటి వ్యక్తితో భార్య.., భార్య అలిగిందని దారినపోయే మహిళతో భర్త వివాహేతర సంబంధాలు (Extramarital Affair) పెట్టుకొని సంస్కృతి రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రియుని మోజులో భర్తను., ప్రియురాలి వ్యామోహంతో భార్యను కడతేర్చే ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు ప్రియుడ్ని ఇంటికి పిలుపించుకొని మరీ భర్తపై దాడులు చేయించేందుకు కొందరు భార్యలు వెనుకాడటం లేదు. అలా ప్రియుడి మోజులో ఉన్న భార్య కన్నకొడుకు ఎదుటే భర్తపై ప్రియుడితో దాడి చేయించింది. జరిగిన అవమానానికి మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లాలో (Chittoor District) ఈ ఘటన జరిగింది.

  వివరాల్లోకి వెళితే.., చిత్తూరు జిల్లాచెన్నుగారి పల్లెకు చెందిన నవీన్ కుమార్ పాకాలలోని శివశక్తి నగర్లో భార్య, కుమారుడితో కలసి నివాసం ఉంటున్నాడు. భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఐతే అప్పుడప్పుడు ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండేవి. ఐతే చిన్నచిన్న విషయాలకే భార్య..నవీన్ తో గొడవ పడుతుండేది. ఇంతలో నవీన్ కు షాకింగ్ నిజం తెలిసింది.

  ఇది చదవండి: భార్య ఆలస్యంగా రావడంతో మొదలైన గొడవ.. చివరికి ఎక్కడవరకు వెళ్లిందంటే..!


  తన భార్య ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తితో చనువుగా ఉంటోందని చుట్టుపక్కలవారి ద్వారా నవీన్ చెవిలో పడింది. దీంతో ఇద్దరిమధ్య గొడవలు మరింత ముదిరాయి. ఇలా ఓ రోజు భార్యాభర్తలిద్దరు గొడవ పడుతుండగా ఒక్కసారిగా నవీన్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోయేసరికి తలుపులు పగలగొట్టి చూడగా విగజీవిగా కనిపించాడు. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అందరూ భావించారు.

  ఇది చదవండి: ఆమెకు 17, అతడికి 20.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ వారి జీవితం ఊహించని మలుపు తిరిగింది..!


  చివర్లో ఊహించని ట్విస్ట్..

  ఐతే నవీన్ కుమారుడు చెప్పిన ఒక్కమాట ఈ వ్యవహారాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఆత్మహత్యపై కేసు నమోదవడంతో నవీన్ కుమారుడు ఇచ్చిన వాంగ్మూలంతో షాక్ తినడం అందరి వంతైంది. తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడటానికి కొద్దిసేపటి ముందు తల్లితో గొడవ జరిందని. ఇంతలో ఓ అంకుల్ వచ్చి నాన్నను కొట్టాడని వివరించాడు. ఆ బాధతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కంటతడి పెట్టుకుంటూ చెప్పాడు. అంతేకాదు తాత పోలీసులను కేసు మార్చి రాయమని చెప్పు అంటూ నవీన్ తండ్రితో చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే నవీన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక హత్య చేశారా..? అనే విషయాలు పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Extramarital affairs, Illegal affair

  ఉత్తమ కథలు