Andhra Pradesh: వీడు చేసిన పాపానికి 20ఏళ్ల జైలు కాదు.. ఇంకా పెద్ద శిక్ష వేసినా తప్పులేదు..

నిందితుడు గంగాధర్

2018 జనవరి 13వ తేదీన దంపతులు తమ ఏడేళ్ల చిన్నారిని ఇంట్లో వదిలి పెట్టి పనిలోకి వెళ్లారు.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  చిన్నారులు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్న సంఘటనలు తరచు జరుగుతున్నాయి. ఒంటరిగా బాలికలు కనిపిస్తే చాలు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఏమి ఎరుగని చిన్నారులకి చాక్లెట్, అట వస్తువుల ఆశ చూపి వారిపట్ల పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఎన్నో కేసులు నమోదు అవుతున్న న్యాయం జరిగేది మాత్రం కొందరికే. ఎన్ని చట్టాలు వచ్చినా మృగాళ్లు మాత్రం అత్యాచారాలు చేయడానికి వెనుకాడటం లేదు. చిన్నారుల నుంచి ముసలి ముతక వరకు వదలకుండా అకృత్యాలకు పాల్పడుతున్న కామాంధులకు కఠినమైన శిక్షలు అమలు కావడం లేదు. సరైన అధరాలు లేకపోవడం, కేసు నమోదై ఏళ్ళు గడిచినా శిక్షలు పడకుండా వాయిదాలు పడుతూ ఉండటం కూడా ఒక కారణం. నిర్భయ నుంచి దిశ లాంటి చట్టాలు వచ్చిన ఇలాంటి కేసులలో తీర్పుల కోసం ఏళ్లతరబడి నిరక్షించాల్సిన పరిస్థితి. ఐతే ఆలా మరుగున పడింది అనుకున్న ఓ కేసులో బాధితులకు న్యాయం జరిగింది.

  వివరాల్లోకి వెళితే... ఇతర రాష్ట్రానికి చెందిన ఇద్దరు దంపతులు పొట్టకూటి కోసం చిత్తూరు జిల్లా మదనపల్లె వచ్చారు. పట్టణంలోని ఎస్బీఐ ఎక్స్టెన్షన్ వద్ద గల అక్షయ హోటల్ వెనుక భాగంలో గుడారంలో నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబం ప్లాస్టర్ ఆప్ పారిస్ తో విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తూ పొట్టపోసుకుంటోంది. ఇదిలా ఉంటే 2018 జనవరి 13వ తేదీన దంపతులు తమ ఏడేళ్ల చిన్నారిని ఇంట్లో వదిలి పెట్టి పనిలోకి వెళ్లారు.

  ఇది చదవండి: చిన్నారులపై కీచకపర్వం.. వీడికి ఏ శిక్ష వేసినా తప్పులేదు..


  ఒంటరిగా ఉన్న చిన్నారిపై కన్నేసిన గంగాధర్(31) అనే యువకుడు ఆమెకు చాక్లెట్ ఆశ చూపాడు. బాలికను అక్కడి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పని ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తీవ్ర రక్త స్రావం, నొప్పితో బాధపడుతున్న కూతురుని గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించగా అక్కడి డాక్టర్లు పాపపై అఘాయిత్యం జరిగినట్లు గుర్తించారు.

  ఇది చదవండి: ఇదెక్కడి విడ్డూరం..? పెంపుడు కుక్కకు కాంస్య విగ్రహం, పిండ ప్రదానం..


  పాప తల్లిదండ్రులు వెంటనే మదనపల్లె వన్ టౌన్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న గంగాధర్ ను అదుపులోకి తీసుకున్నారు. సమగ్ర విచారణ జరిపి రిమాండ్ కు తరలించారు. మూడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నిజనిర్ధారణ కావడంతో నిందితుడు గంగాధర్ కు 20ఏళ్ళు జైలు శిక్ష, 50,000/- జరిమానా విధించింది న్యాయస్థానం. నిందితునికి శిక్ష విధించడంతో బాలిక తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా అయినా న్యాయం జరిగిందన్న సంతృప్తి మిగిలిందని వారు తెలిపారు.
  Published by:Purna Chandra
  First published: