Andhra Pradesh: కూతురు ప్రేమను అంగీకరించని యువకుడు... అమ్మాయి తండ్రి చేసిన దారుణానికి షాకవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

AP News: కూతురు ప్రేమ కోసం ఓ తండ్రి శత్రుత్వాన్ని కూడా పక్కనబెట్టి పెళ్లి సంబంధం మాట్లాడాడు. కానీ ఈ స్టోరీ ఊహించని మలుపు తీసుకుంది.

  • Share this:
    కూతురు అంటే తండ్రికి ఎనలేని ప్రేమ ఉంటుంది. ఆమె అడగ్గానే కొండమీద కోతినైనా తెచ్చి ఇచ్చే తండ్రులు ఉంటారు. అలాంటిది కూతురు ప్రేమ కోసం ఓ తండ్రి శత్రుత్వాన్ని కూడా పక్కనబెట్టి పెళ్లి సంబంధం మాట్లాడాడు. కానీ ఈ స్టోరీ ఊహించని మలుపు తీసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోని కుటుంబం బ్రతికి బట్టకట్టకూడదని భావించాడు. వెంటనే ఆ కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ఆధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కడప జిల్లా వరపునాయునిపల్లె మండలం యలమకూరు గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి వెంకటరమణారెడ్డి ఇటీవల హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన యలమకూరు చిన్నఓబుల్ రెడ్డి ఈ కేసులో నిందితుడిగా తేల్చారు. ఐతే దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. చిన్నఓబుల్ రెడ్డి, వెంకట రమణారెడ్డికి మధ్య పొలం వద్ద ఉన్న రాతిగోడ విషయంలో వివాదం ఉంది. దీనిపై ఇరువురి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. దీంతో ఇరుకుటుంబాల మధ్య మాటల్లేవు.

    ఐతే ఓబుల్ రెడ్డి కుమార్తె.. వెంకటరమణారెడ్డి కుమారుడైన పవన్ కుమార్ రెడ్డిని ప్రేమించింది. కానీ పవన్ కుమరా రెడ్డి ఆమెను ప్రేమించలేదు. తన ప్రేమ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో యువతి తల్లిదండ్రులు ఓబుల్ డ్డి, లక్ష్మీదేవి, వారి కుమారుడు వంశీధర్ రెడ్డి, ఇతర బంధువులు కలిసి పలుసార్లు వెంకటరమణారెడ్డి ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడారు. ఐతే దీనికి వెంకటరమణారెడ్డితో పాటు అతని కుమారుడు కూడా ఒప్పుకోలేదు.

    ఇది చదవండి: ఏపీలో భారీగా పెన్షన్ల కోత...? కారణాలు ఇవేనా..?


    దీంతో తండ్రి కొడుకులపై ఒబుల్ రెడ్డి కుటుంబం పగ పెంచుకుంది. ఎలాగైనా వెంకటరమణారెడ్డి, అతడి కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని చంపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం తండ్రి కొడుకుసు ప్రొద్దుటూరు నుంచి స్వగ్రమానికి వస్తుండగా.. ఓబుల్ రెడ్డి ట్రాక్టర్ తో ఢీ కొట్టాడు. వెంటనే స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించగా వెంకటరమణారెడ్డి మృతి చెందాడు. పవన్ కుమార్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడి చిన్నకుమారుడు మహీంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు.

    ఇది చదవండి: వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు.. అవి ఏంటంటే..!


    కుమార్తె ప్రేమను అంగీకరించడం లేదని ఆవేదన.. పొలం విషయంలో జరిగిన తగాదాల నేపథ్యంలో కక్షపూరితంగానే ఓబుల్ రెడ్డి, అతడి బంధువులు వెంకటరమణారెడ్డిని హతమార్చినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. కూతురు ప్రేమ కోసం దారుణమైన నేరానికి ఒడిగట్టిన ఓబుల్ రెడ్డిని స్థానికులు తిట్టిపోస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: