Home /News /andhra-pradesh /

TIRUPATI MAN KILLED NEAR TIRUMALA TEMPLE AS POLICE ARRESTED ACCUSED FULL DETAILS HERE PRN TPT

Tirumala News: తిరుమలలో మర్డర్.. శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఘోరం.. అసలేం జరిగిందంటే..!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి (Tirumala Temple) సన్నిధిలో దారుణం జరిగింది. ఆలయానికి వెనుకభాగంలోఉన్న వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ కు సమీపంలోని వయో వృద్ధుల కౌంటర్ వద్ద కలకలం రేగింది.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి (Tirumala Temple) సన్నిధిలో దారుణం జరిగింది. ఆలయానికి వెనుకభాగంలోఉన్న వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ కు సమీపంలోని వయో వృద్ధుల కౌంటర్ వద్ద కలకలం రేగింది.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి (Tirumala Temple) సన్నిధిలో దారుణం జరిగింది. ఆలయానికి వెనుకభాగంలోఉన్న వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ కు సమీపంలోని వయో వృద్ధుల కౌంటర్ వద్ద కలకలం రేగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India
    GT Hemanth Kumar, News18, Tirupati

    కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి (Tirumala Temple) సన్నిధిలో దారుణం జరిగింది. ఆలయానికి వెనుకభాగంలోఉన్న వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ కు సమీపంలోని వయో వృద్ధుల కౌంటర్ వద్ద కలకలం రేగింది. వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ వద్ద ఓ వ్యక్తి నిద్రిస్తుండగా మరోక వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన తిరుమలలో ‌తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న టీటీడీ (TTD) విజిలెన్స్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రెండు గంటల్లోనే నిందితుని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.. రద్దీ గా ఉండే ప్రాంతంలో దింగతనం చేయడమే వారి పని. భక్తుల ముసుగులో భక్తుల్లో వారు ఒక్కరిగా తిరుగుతూ జేబులు, పర్సులు దోచేస్తారు.

    భక్తుల ముసుగులో శరవణ, భాస్కర్ ఇద్దరు దొంగలు తిరుమలలో తిష్ట వేశారు. తమిళనాడు రాష్ట్రం,ఆరణి జిల్లాకు చేందిన శరవణ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దొంగతనం చేసిన తరువాత తిరుమల కొండకు వచ్చి కొద్ది రోజులు పాటు ఇక్కడే వాడేవాడు.ఈ క్రమంలో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం, వేలూరు జిల్లా, గుడియాత్తంకు చేందిన భాస్కర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తిరుమలలో‌ ఉచిత అన్నదానంలో భోజనం చేసి అక్కడే రోడ్డుపై బస చేసే వారు. ‌అయితే బుధవారం రాత్రి మ్యూజియం ఎదురుగా ఉన్న సీనియర్ సిటిజన్ క్యూలైన్స్ వద్ద బస చేశారు.

    ఇది చదవండి: ఈమె పేరు మృదుల.. పేరులో ఉన్నంత సాఫ్ట్ కాదు..! ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా..


    ఈ క్రమంలో శరవణా, భాస్కర్ మధ్య నిద్రించే స్ధలంపై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భాస్కర్ ని పోలీసులకు పట్టిస్తానని శరవణ బెదించాడు. తిరుమలలో గానీ, తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకి పంపుతానని చెప్పడంతో భయందోళనకు గురైన భాస్కర్, శరవణ ఎక్కడ పోలీసులకు పట్టిస్తాడో అన్న భయంతో నిన్న అర్ధరాత్రి 1:10 సమయంలో నిద్రిస్తున్న శరవణాపై భాస్కర్ బండరాయితో మోది హత్య చేసి అక్కడి నుండి పరారయ్యాడు.

    ఇది చదవండి: ప్రియుడుతో కలిసి భర్త హత్య.., కొడుకుతో కలిసి స్కెచ్..


    అయితే భక్తుల‌ సమాచారం మేరకు ఉదయం నాలుగు గంటలకు ఘటన స్ధలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమరాల ఆధారంగా రెండు గంటల వ్యవధిలో నిందితుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. భాస్కర్, శరవణలపై తిరుమల పోలీసు స్టేషనులో గతంలోనే‌ దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు