GT Hemant Kumar, Tirupathi, News18
ప్రస్తుత సమాజంలో ఏడు అడుగులు నడిచిన బంధానికన్నా... తాత్కాలిక సుఖాలిచ్చే అక్రమ సంబంధాలకే (Extramarital Affair) ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు ఎక్కువవుతున్నారు. తమ కోసం సర్వస్వం ధారపోసే కట్టుకున్నవాళ్లను కాదని.. అనవసర వ్యామోహంలో పడుతున్నారు కొందరు. పెళ్లయ్యాక కుటుంబాన్ని కాదని.. ఇతరులతో సంబంధాలను పెట్టుకోవడం ఈ సమాజంలో పరిపాటిగా మారింది. బంగారంలాంటి భర్త ఉండగా.. పరాయి మగాడితో వ్యవహారం నడిపిందో మహిళ. భర్త ఇంట్లో లేని సమయాల్లో అతడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అతడి మాయలో పూర్తిగా మునిగిపోయిన మహిళ భర్తను కాదని ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఐతే ఆమె ఆచూకీ కనుగొన్న భర్త నాలుగు మంచి మాటలు చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అంతలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
అనంతపురం (Ananthapuram) నూతన కాలువలు చెందిన పడిగిపాలెం రిజ్వానా(23) కు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సర్దార్ తో కొన్నేళ్ల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. వీరి వివాహ బంధానికి ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో అక్రమ సంబంధం పెను వివాదానికి దారితీసింది. కొన్ని నెలల క్రితం నుంచి రిజ్వాన.., హర్షవర్ధన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. విషయం బయకు పొక్కడంతో భర్త., ఇంట్లోని పెద్దలు మందలించారు.
ఐతే ఎవరు ఎంత చెప్పినా రిజ్వాన వినిపించుకోలేదు. ఓ రోజు ప్రియుడు హర్షవర్ధన్ తో కలసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం అన్ని ప్రాంతాల్లో గాలించిన కుటుంబ సభ్యులు.. చివరకు బెంగళూరు (Bengaluru) లో ఉన్నట్లు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. పపంచాయితీ పెట్టి భర్తతో కాపురం చేసుకోవాలని పెద్దలు సూచించారు. భర్త కూడా ఆమె తప్పును మర్చిపోయి కాపురం చేద్దమని చెప్పడంతో అంతా సర్దుమణిగింది.
అయితే అప్పటి నుంచి ఆమెకు హర్షవర్ధన్ తో మాటలు లేవు. దీంతో రిజ్వానపై ఆగ్రహంతో రగిలిన పోయిన హర్షవర్ధనం.. ఆమెను చంపేయాలని ఫిక్సయ్యాడు. ఈ క్రమంలో రిజ్వాన ఆమె భర్త నిత్యావసర సరుకులు తెచ్చేనందుకు వెళ్లారు. అదే సమయంలో దుకాణంలోకి వెళ్లిన హర్షవర్ధన్ రిజ్వానపై కత్తితో దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడే మృతి చెందింది. అదే ఘటనలో కుమార్తె మొగిషీన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Illegal affairs, Kadapa