హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shocking Video: అత్తింటి వేధింపులు భరించలేని అల్లుడు.. ఫేస్ బుక్ లైవ్లో తన ఆవేదన చెప్పి ఏం చేశాడంటే..!

Shocking Video: అత్తింటి వేధింపులు భరించలేని అల్లుడు.. ఫేస్ బుక్ లైవ్లో తన ఆవేదన చెప్పి ఏం చేశాడంటే..!

చిత్తూరు జిల్లాలో ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య

Family Disputes: ఉదయ్ భాస్కర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐటీవల భార్యాభర్యల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తరచూ గొడవపడుతూ తిట్టుకునేవారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సోనీ పుట్టింటికి వెళ్లింది. వెళ్లిపోయింది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, Tirupati, News18

భార్యాభర్తల బంధం ప్రేమ, అన్యోయన్యతలు, ఆప్పాయాయతలకు నిదర్శనంగా నిలవాలి. అందరిని వదులుకొని తన వెంట నడిచే భార్యను భర్త ఎంత జాగ్రత్తగా చేసుకుంటాడో.., కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి తమను కంటికి రెప్పలా కాపాడుకునే భర్తపై భార్య కూడా ప్రేమానురాగాలు చూపించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా నీ వెంట నేనున్నాను అంటూ నడిచే దైర్యం ఇచ్చేలా భార్య ప్రవర్తన మెలగాలి. దాంపత్య జీవితంలో తరచూ చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవ చిన్నదే అయినా అది చినికిచినికి గాలివానలా మారేలోపే ఒకర్నిఒకరు అర్ధం చేసుకోని చక్క దిద్దుకొని ప్రయత్నం చేస్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిస్కారం అయిపోతుంది. అలాకాదని మధ్యలో ఎవరు జోక్యం చేసుకున్నా కాపురంలో చిచ్చురేగినట్లే. అలా భార్యాభర్తల మొదలైన గొడవలో భార్య, తన తల్లిదండ్రులతో కలిసి వేధించడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) మదనపల్లె పట్టణంలో ఓ వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ (Facebook Live) లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.., గుంటూరు (Guntur)లో నివాసం ఉంటున్న శంకర్ నారాయణకు ఉదయ్ భాస్కర్(45) కుమారుడు ఉన్నాడు.  ఆరేళ్ల క్రితం మదనపల్లెకు చెందిన సోనీని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. వీరి దాంపత్య జీవితానికి నిదదర్శనంగా ఒక కుమార్తె ఉంది. ఉదయ్ భాస్కర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇది చదవండి: ఈ నీచుడ్ని ఏం చేసినా తప్పులేదు..! వద్దు బాబాయ్ తప్పు అన్నా వినలేదు.. కూతురులాంటి బాలికపై..,


ఐటీవల భార్యాభర్యల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తరచూ గొడవపడుతూ తిట్టుకునేవారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సోనీ పుట్టింటికి వెళ్లింది. వెళ్లిపోయింది. అనంతరం భార్యతో పాటు అత్త, మరదలు భాస్కర్ ను తిట్టడం, వేధించడం మొదలుపెట్టారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేకపోయిన భాస్కర్ ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది చదవండి: ఆన్ లైన్ రమ్మీ కోసం 6కిలోల బంగారం మాయం... వీడిది మామూలు బుర్రకాదు..



ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది స్నేహితులు బాధితుడి కుటుంబ సభ్యులకు, పోలీసు లకు సమాచారమిచ్చారు. వారందరూ అక్కడికి చేరుకునే సరికే ఆయన మృతి చెందాడు. మద్యానికి బానిసై ఉదయ్భాస్కర్ తరచూ వేధింపులకు గురి చేసే వాడని, ఈ నేపథ్యంలో పలుమార్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. చేశానని, ఆదివారం కూడా గొడవ పెట్టుకొని కొట్టడంతో తాను పుట్టింటికి వెళ్లి నట్లు మృతుడి భార్య సోనీ తెలిపారు. ఒకటో పట్టణ సీఐ ఇదురుబాషా, ఎస్సై లోకేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఐతే భార్యను వేధింపులకు గురిచేసేవాడు ఆత్మహత్య ఎలా ఎందుకు చేసుకున్నాడు..? ఇద్దరి మధ్య ఏం జరిగింది..? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆత్మహత్యకు ముందు అతడు ఏం చెప్పాడోనేదానిపై భార్య సోనీని ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Chittoor, Facebook, Husband commits suicide

ఉత్తమ కథలు