Home /News /andhra-pradesh /

TIRUPATI MAN COMMITS SUICIDE AFTER HAVING EXTRAMARITAL AFFAIR WITH ANOTHER WOMAN IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Affair: భార్య ఉండగానే మరొ మహిళతో సీక్రెట్ గా కాపురం.. ఇద్దర్నీ పోషించలేక చివరికి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నాగేంద్రకు చిత్తూరు జిల్లా (Chittoor District) కు ట్రాన్స్ ఫర్ అయినప్పుడు చిత్తూరు కు చెందిన దుర్గాభవానీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. తిరిగి అనంతపురం వచ్చినప్పుడు ఆమెను కూడా తీసుకొచ్చి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఉంచాడు.

ఇంకా చదవండి ...
  అతడికి పెళ్లైంది. భార్యపిల్లలున్నారు. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగుతోంది. కానీ మెదడులో పట్టిన ఓ పిచ్చి ఆలోచన చివరికి అతడి జీవితాన్ని ఊహించని మలుపుతిప్పింది. కుటుంబాన్ని రోడ్డుపైకి లాగేసింది. వివరాల్లోక వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) కేంద్రంలోని నవోదయ కాలనీకి చెందిన సాకే నాగేంద్ర క్రిటి డ్రిప్ కంపెనీలో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి కొంతకాలం క్రితం జ్ఞానేశ్వరితో పెళ్లైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం చిత్తూరు జిల్లాకు ట్రాన్స్ ఫర్ అయినప్పుడు చిత్తూరు కు చెందిన దుర్గాభవానీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. తిరిగి అనంతపురం వచ్చినప్పుడు ఆమెను కూడా తీసుకొచ్చి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఉంచాడు.

  భార్యబిడ్డలతో ఉంటూనే తరచూ దుర్గాభవాని దగ్గరకు వెళ్లివస్తున్నాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాలను అతడే పోషిస్తున్నాడు. ఐతే వచ్చేజీతం ఖర్చలకు సరిపోకపోవడంతో ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తీవ్రమనస్తాపం చెందిన నాగేంద్ర బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో కంగారుపడిన భార్య జ్ఞానేశ్వరి.. సమీపంలోని భర్త స్నేహితుడికి సమాచారమిచ్చింది. అతడు పోలీసులకు ఫోన్ చేయడంతో ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే నాగేంద్ర చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది చదవండి: రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న భార్య... ఓ రోజు ఆ విషయంలో గొడవ.. చివరకు..


  అనంతపురంలోనే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒడిశాలోని కసోటి గ్రామానికి చెందిన బికాస్ మాలిక్ అనే యువకుడు అనంతపురంలో ఉంటూ వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఇతడు కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తరచూ ఆమెతో మాట్లాడుతూఉండేవాడు. ఐతే ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో ఆమె.. బికాస్ తో మాట్లాడటం మానేసింది. దీంతో మనస్తాపం చెందిన బికాస్ విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి స్నేహితులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  ఇది చదవండి: బర్త్ డేనే అతడి డెత్ డే అయింది.. మందు ఎక్కువైన ఫ్రెండ్స్ ఏం చేశారంటే..!


  అనంతపురం జిల్లాలోనే ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన ఘటన ఇటీవల వెలుగుచూసింది. పెద్దవడుగూరుకు మండలం మేడిమాకులపల్లికి చెందిన వీరన్నభార్య రేణుకకు అదే గ్రామానికి చెందిన షేక్ షా వలీతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం వీరన్నకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పద్ధతి మార్చుకోవాలని వారించినా రేణుక మాత్రం ప్రియుడ్ని వదల్లేదు. ఇదిలా ఉంటే ఓ రోజు ప్రియుడితో పాటు మరో వ్యక్తితో కలిసి రేణుక భర్త వీరన్నపై దాడి చేయించింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వీరన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Extramarital affairs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు