Sister-in-Law: వదినపైనే కన్నేసిన మరిది... తప్పని వారించినా వినలేదు.. చివరకి ఏం జరిగిందంటే..!

ప్రతీకాత్మకచిత్రం

Chittoor District: తల్లిలాగా భావించాల్సిన సొంత వదిన పైనే కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అన్న ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించే వాడు. ఓ రోజు ఎవరూలేని సమయంలో ఇంటికి వచ్చాడు.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupati, News18

  అన్నావదినలంటే తల్లిదండ్రుల తర్వాత అంతటివారని హిందూ కుటుంబ సాంప్రదాయాలు చెబుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవస్థలకు వదినకు ప్రత్యేకస్థానముంది. తన భర్తకంటే వయసలో చిన్నవారని సొంత బిడ్డలుగా భావిస్తుంది. కానీ అలాంటి వదినపై కన్నేశాడు ఓ కామాంధుడు. అన్న భార్యను తల్లిలాగా చూడాలని తెలిసినా కోరిక కామంతో కళ్లుమూసుకుపోయి కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేశాడు. మరిది చేష్టలను భరిస్తూ వచ్చిన ఆ మహిళ బుద్ధిమార్చుకోమని నచ్చజెప్పింది. అయినా వినలేదు. చివరకు లైంగికదాడికి యత్నించాడు. అరెస్టయిన తర్వాత తప్పించుకోవాలనుకున్నాడో.. లేక పశ్చాత్తాపంతో కుమిలిపోయాడో తెలియదు గానీ పోలీసులను పరుగులు పెట్టించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లాలో (Chittoor District) కలకలం రేపింది.

  వివరాల్లోకి వెళితే.., చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం రాగిమాకులపల్లె పంచాయితీ పరిధిలోని ప్యాడరాసిపల్లెలో గంగిరెడ్డి అనే యువకుడు ఉంటున్నారు. గంగిరెడ్డికి ఓ అన్న వదినలు ఉన్నారు. ఒకే గ్రామంలో ఉండటంతో తరచు అన్న వదినలు ఒంటికి వెళ్లి వచ్చేవాడు గంగి రెడ్డి. ఇదే క్రమంలో తల్లిలాగా భావించాల్సిన సొంత వదిన పైనే కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అన్న ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించే వాడు. అనుకోకుండా అలా జరిగి ఉంటుందని భావించిన ఆమె... ఏమీ జరగనట్లు మౌనంగా ఉండిపోయేది.

  ఇది చదవండి: మోసాల్లో ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’... వీళ్లను నమ్మితే దిమ్మతిరిగి బొమ్మ కనబడుద్ది..!


  హెచ్చరించినా మారలేదు..
  తరచూ ఇలా గంగిరెడ్డి చేస్తున్న అసభ్య ప్రవర్తనతో విసుగు చెందిన ఆ మహిళ పలుసార్లు మరిదిని మందలించింది. పద్ధతి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించింది. ఐతే అప్పటికే కామంతో కళ్లుమూసుకుపోయిన గంగిరెడ్డి.. తన కోరిక తీర్చాలంటూ వదినపై లైంగికదాడికి యత్నించాడు. హఠాత్పరిణామంతో బెంబేలెత్తిపోయిన బాధితురాలు మరిది గంగిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గంగిరెడ్డిని అదుపులోకి తీసుకొని అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

  ఇది చదవండి: వీడో శాడిస్టు భర్త... బలిచ్చేందుకు పిల్లల్ని కనాలంట... భార్యతో క్షుద్రపూజలు  పోలీస్ స్టేషన్లో కలకలం..
  గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచారు. విచారణ జరుగుతున్న సమయంలో కానిస్టేబుల్ తుపాకీ చివర ఉండే కత్తిని తీసుకొని గొంతుకోసుకున్నాడు. పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఐతే పరిస్థితి కాస్త విషమించడంతో అతడ్ని ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. విషయం ఈ నోటా.. ఆ నోట బయటకు పొక్కింది. ప్రస్తుతం గంగిరెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు.

  ఇది చదవండి: పేర్లు మార్చి అమ్మాయులకు వల.. మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. వారిలో ఒకరి భర్తకు నేరుగా..


  ఇటీవల కృష్ణాజిల్లా గన్నవరంలో ఇలాంటి ఘటనే జరిగింది. హనుమాన్ జంక్షన్ కు చెందిన ఓ డిగ్రీ విద్యార్ధిని స్నేహితుడితో కలిసి బైక్ ఎక్కి వెళ్లింది. అప్పటికే ఆమెపై కన్నేసిన యువకుడు.. చిన్నఅవుటపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న యువతి.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకుడ్ని అదుపులోకి తీసుకోని రిమాండ్ కు తరలించారు.
  Published by:Purna Chandra
  First published: