హోమ్ /వార్తలు /andhra-pradesh /

Husband: భర్త ప్రవర్తనపై డౌట్ తో నిఘా పెట్టిన భార్య.. మరో ఇద్దరితో సీక్రెట్ గా కాపురం.. చివరికి ఏం జరిగిందంటే..!

Husband: భర్త ప్రవర్తనపై డౌట్ తో నిఘా పెట్టిన భార్య.. మరో ఇద్దరితో సీక్రెట్ గా కాపురం.. చివరికి ఏం జరిగిందంటే..!

Cheater: అతడికి డడ్డులంటే పిచ్చి.. అమ్మాయిలంటే అలుసు. అందుకే కట్నం కోసం ఎవరూ అడ్డదారులు తొక్కాడు. ఒకరికి తెలియకుంటే మరొకర్ని.. వారికి తెలియకుండా ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటూ సీక్రెట్ గా వ్యవహారం నడుపుతున్నాడు. కానీ ఓ రోజు అతడి పాపం పండింది.

ఇంకా చదవండి ...

    GT Hemanth Kumar, Tirupathi, News18

    అతడికి డడ్డులంటే పిచ్చి.. అమ్మాయిలంటే అలుసు. అందుకే కట్నం కోసం ఎవరూ అడ్డదారులు తొక్కాడు. ఒకరికి తెలియకుంటే మరొకర్ని.. వారికి తెలియకుండా ఇంకొకర్ని పెళ్లి చేసుకుంటూ సీక్రెట్ గా వ్యవహారం నడుపుతున్నాడు. కానీ ఓ రోజు అతడి పాపం పండింది. ఆ నిత్యపెళ్లి కొడుకు ఆటకు అడ్డుకట్టపడింది. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District), పెద్దతిప్ప సముద్రం మండలం, నవాబుకోటకు చెందిన మంజునాధ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించే వాడు. వ్యాపార నిమిత్తం ఎప్పుడూ బయట రాష్ట్రాలకు తిరిగుతూ ఉండడం రెండు, మూడు వారాలకు ఓసారి సొంత గ్రామంమైన నవాబుకోటకు వచ్చేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కోరిక మేరకు మంజునాథ్.. మదనపల్లె మండలం, అంగళ్లుకు చెందిన రజినీని పెళ్లి చేసుకున్నాడు.

    కొన్నేళ్ళు పాటు రజనీతో బాగానే కాపురం చేసిన మంజునాథ్ కు ఓ దుర్బుద్ధి పుట్టింది. పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చే కట్నంతో వ్యాపారంను మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే కన్నింగ్ ప్లాన్ వేశాడు. అంతేకాదు రెండో పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు‌. తనకు పెళ్లి కాలేదంటూ వివరాలను మ్యాట్రిమోని వెబ్ సైట్లో నమోదు చేశాడు. అలా ఆరేళ్ల క్రితం చిక్ బళ్లాపూర్ కు చెందిన ఆశను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా రెండో భార్యతో సీక్రెట్ గా కాపురం చేస్తున్నాడు. వీరికి ఓ పాప కూడా జన్మించింది.

    ఇది చదవండి: మీరు ఈ యాప్స్ వాడుతున్నారా..? అయితే డేంజర్లో పడినట్లే.. అప్పులిచ్చి.. అమ్మాయిల ఫోటోలతో

    ఐతే వ్యాపార నిమిత్తం ఎక్కువగా బెంగళూరుకు వెళ్లే మంజునాథ్ కు తెలిసివారి ద్వారా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ప్రియాంక అనే యువతి పరిచయమైంది. తనకు ఇంకా పెళ్లికాలేదంటూ ప్రియాంకను నమ్మించిన మంజునాథ్.. ఆమెకు మాయమాటలు చెప్పి మూడో పెళ్లి చేసుకున్నాడు. కట్నంగా వంద గ్రాముల బంగారం, ఐదు లక్షల నగదు తీసుకున్నాడు.

    ఇది చదవండి: భర్త ఫోన్ తీసుకున్న భార్య.. అందులోని వీడియోలు చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి..

    అయితే గత కొద్ది రోజులుగా మంజునాధ్ వ్యవహారం శైలిపై అనుమానం రావడంతో మొదటి భార్య రజినీ.. మంజునాధ్ కదలికలపై నిఘాపెట్టింది. ఈ క్రమంలోనే తనకు తెలియకుండా తన భర్త మంజునాధ్ మరో ఇద్దర్ని పెళ్లి చేసుకునాడని గ్రహిచింది. ఎలాగైనా తన భర్తకు బుద్ది చెప్పాలని భావించిన రజినీ.., ఆశ, ప్రియాంకలను కలిసి జరిగిన స్టోరీ అంతా వివరించింది. ఈ విషయం తెలుసుకున్న మంజునాధ్ పరారయ్యాడు. దీంతో ముగ్గురు భార్యలు కలిసి మంజునాథ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను నిలదీయగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు.

    ఇది చదవండి: బస్సులో వెళ్తున్న పెళ్లి బృందం.. పోలీసులు రాగానే పరార్..

    దీంతో బాధితురాళ్లు పెద్దతిప్పసముద్రం పోలీసులను ఆశ్రయించారు. మంజునాథ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంజునాథ్ ఈ ముగ్గురినేనా.. ఇంకెవర్నైనా పెళ్లిపేరుతో మోసం చేశాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మంజునాధ్ మూడు పెళ్ళి చేసుకున్న విషయం అంతా తల్లిదండ్రులకు,మంజునాధ్ చెల్లెలకు ముందే తెలిసినా ఆపకుండా మరో ఇద్దరిని వివాహం ఆడేందుకు కారకులుగా భావిస్తూ వారిపై కూడా కేసు నమోదు చేశారు.

    First published:

    ఉత్తమ కథలు