Tirupathi: ప్రేమ (Love) అనేది రెండు మనసులు కలిస్తేనే పుడుతుంది. బలవంతం, బెదిరింపులున్న చోట ప్రేమకు చోటు లేదు. అలాంటిది ఓ యువకుడు.. ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. అతడి బుద్ధి తెలిసి ఆమె ప్రేమను నిరాకరించింది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పకుంది. కానీ వాడు మాత్రం ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
ప్రేమ (Love) అనేది రెండు మనసులు కలిస్తేనే పుడుతుంది. బలవంతం, బెదిరింపులున్న చోట ప్రేమకు చోటు లేదు. అలాంటిది ఓ యువకుడు.. ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. అతడి బుద్ధి తెలిసి ఆమె ప్రేమను నిరాకరించింది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పకుంది. కానీ వాడు మాత్రం ఆమెపై కక్ష పెంచుకున్నాడు. చివరకు ప్రాణాలు తీసేవరకు వెళ్లాడు. వివరాల్లోకి వెళ్ళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) కి చెందిన చంచయ్య స్లిమ్ వరల్డ్ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. జిమ్ కు వచ్చిన అమ్మాయిలకు మాయమాటలు చెప్తూ ప్రేమలోకి దించేవాడు. ఈ క్రమంలో దాసరి మఠం ప్రాంతానికి చెందిన కబీలా అనే యువతి జిమ్ లో చేరింది. ఆమెపై కన్నేసిన చంచయ్య.. ట్రైనింగ్ పేరుతో అమ్మాయికి దగ్గరయ్యాడు.
ఫోన్ నెంబర్ తీసుకుని రోజు కబీలాకి మెసేజులు, ఫోన్లు చేసేవాడు. అయితే తనకు ఫోన్ చేయద్దని కబీలా చెప్పడంతో ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. అయినా చంచంయ్య మాత్రం కబీలా వెంటపడటం ఆగలేదు. ఈ క్రమంలో గత నెల ఆమెకు ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చంచయ్య కబీలాకు పోన్ చేసిన చంచయ్య తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. పది రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి నిన్ను, మీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు.
బెదిరింపు విషయం తెలుసుకున్న కబీలా తమ్ముడు చంద్రన్ చంచయ్య దగ్గరకు వెళ్ళి తన అక్కను బెదిరించవద్దని హెచ్చరించాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న చంచయ్య.. కబీలాతో పాటు ఆమె తమ్ముడి హత్యకు కుట్రచేశాడు. అనుకున్నట్లుగానే దాసరి మఠం సమీపంలోని ఇంటి వద్ద ఉన్న చంద్రన్ ను గొంతకోసి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. కుటుంబ సభ్యులిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చంచయ్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడికి నాయకుల అండదండలు..?
నగరంలో జిమ్ ట్రైనర్ గాఉన్న చంచయ్య.. స్థానిక రాజకీయ ప్రముఖులకు ట్రైనింగ్ ఇస్తూ వారికి దగ్గరయ్యాడు. రాజకీయ ప్రముఖులు జిమ్ ట్రైనింగ్ ఇస్తూ సన్నిహితంగా మెలిగేవాడు.ఈ క్రమంలో గత పది రోజుల క్రితం తనకు అధికార పార్టికి చేందిన నాయకుల అండదండలు ఉన్నాయని తనను చంపేస్తానని బెదిరించినట్లు కబీలా ఆరోపిస్తోంది. అత్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న చంచయ్య నాయకుల అండదండలతో తప్పించుకునే అవకాశముందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.