హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Husband: భర్త పక్కింటి మహిళతో మాట్లాడుతుంటే లైట్ తీసుకుంది.. కానీ ఇంతపనిచేస్తాడనుకోలేదు..

Husband: భర్త పక్కింటి మహిళతో మాట్లాడుతుంటే లైట్ తీసుకుంది.. కానీ ఇంతపనిచేస్తాడనుకోలేదు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Secret Marriage: ఈ రోజుల్లో పెళ్లైన పిల్లలున్నవాళ్లు కూడా దారితప్పి ప్రవర్తిస్తున్నారు. తాత్కాలిక సుఖాలకు అలవాటుపడి కట్టుకున్నవాళ్లకు అన్యాయం చేస్తున్నారు. దీంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి.

  ఈ రోజుల్లో పెళ్లైన పిల్లలున్నవాళ్లు కూడా దారితప్పి ప్రవర్తిస్తున్నారు. తాత్కాలిక సుఖాలకు అలవాటుపడి కట్టుకున్నవాళ్లకు అన్యాయం చేస్తున్నారు. దీంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కొందరి జీవితాలు నాశనమవుతున్నాయి. పెళ్లై భార్య ఉండగానే పక్కింట్లో ఉంటున్న ఒంటరి మహిళపై కన్నేసిన ఓ ఆటో డ్రైవర్.. ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. విషయం మొదటి భార్యకు తెలియడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కడప జిల్లాలో (Kadapa District) చోటు చేసుకుంది. కడపకు చెందిన నందిని అనే మహిళకు గతంలోనే పెళ్లైంది. ఐతే భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోవడంతో మైలవరంలోని రాజా ఫౌండేషన్ లో చేర్పించారు. అక్కడ ఉండగా రుక్మిణమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది.

  ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో జమ్మలముగు మండలం మోరగుడిలో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో పక్కింట్లో ఉంటున్న శ్రీనివాసులు అనే అటో డ్రైవర్ తో నందినికి పరిచయం ఏర్పడింది. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్న శ్రీనివాస్.. ఆమెను తీసుకెళ్లి రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత భర్త రెండో పెళ్లి చేసుకున్న విషయం శ్రీనివాసులు మొదటి భార్యకు తెలియడంతో అతడు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో నందిని జమ్మలమడుగు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  ఇది చదవండి: ఆమెపాలిట శాపంగా మారిన పవర్ కట్... ఆ నలుగుర్ని ఏంచేసినా పాపం లేదు..  ఇటీవల కృష్ణాజిల్లాలో (Krishna District) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విజయవాడ (Vijayawada) శివారులోని పెనమలూరు మండలం యనమలకుదురు లాకులు ప్రాంతానికి చెందిన బోరుగడ్డ ప్రత్యూషకు 2014లో అనంతపురంకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణతో వివాహమైంది. కొన్నాళ్లు కాపురం సజావుగానే సాగింది. ఐతే రామకృష్ణ కొన్నిరోజుల తర్వాత భర్త నెలల తరబడి ఇంటికి రాకుండా చేయడం మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన ప్రత్యూష ఆరా తీయగా అప్పటికే అతడికి పెళ్లైందని.. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది.

  ఇది చదవండి: అమెరికా అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్... కొన్నాళ్ల తర్వాత మనోడికి చుక్కలు చూపించింది...


  దీనిపై ప్రత్యూష రామకృష్ణను నిలదీసింది. దీంతో అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రత్యూషను నిర్లక్ష్యం చేసి మొదటి భార్య దగ్గరే ఉండటం మొదలుపెట్టాడు. నీలదీసిన భార్యను కట్నం కింద ఇచ్చిన పొలాన్ని రాయించికొస్తేనే కాపురం చేస్తానని బెదిరించాడు. ఇందుకు అత్తమామలు కూడా వేధించడంతో పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రుల సాయంతో భర్త రామకృష్ణతో పాటు అత్తమామలు గోవిందరావు, కావేరమ్మలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  ఇది చదవండి: మేనకోడలిపై కన్నేసిన మేనమామ... ఆమె భర్త హత్యకు సుపారీ.. చివరకు ఎలా చిక్కారంటే..!


  విశాఖపట్నం జిల్లాలో (Visakhapatnam) ఓ కానిస్టేబుల్ నిత్యపెళ్లికొడుకుగా మారిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఏకంగా నలుగుర్ని పెళ్లి చేసుకున్న అతగాడు.. ఐదుగురు పిల్లలకి తండ్రయ్యాడు. ఓ మహిళా కానిస్టేబుల్ తో సన్నిహితంగా ఉంటూ ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న రెండో భార్య మహిళా మండలి సాయంతో దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cheating, Extramarital affairs, Kadapa

  ఉత్తమ కథలు