Andhra Pradesh: వీడొక్కడే 300 మంది అమ్మాయిలను లైన్లో పెట్టాడు.. అతడి ఫోన్ చూసి షాకైన పోలీసులు..

ప్రసన్నకుమార్ (ఫైల్)

Blackmailing: ఈ కేటుగాడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 మంది అమ్మాయిలు, మహిళలను బుట్టలో వేసుకొని వారిని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు తెలుస్తోంది.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  అతడో దొంగ. చైన్ స్నాచింగులు, ఎవరూ లేని ఇళ్లకు కన్నంవేసి సొత్తు దోచేయడం అతడి స్టైల్. దొంగతనం చేయడం పోలీసులకు దొరికిపోయి జైలుకెళ్లడం మనోడికి అలవాడు. చదువు మధ్యలోనే ఆపేసినా చోరకళను మాత్రం కంటిన్యూ చేశాడు. చోరీలు చేసి దొరికిపోయి బోర్ కొట్టిందో ఏమో.. సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తాడు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో తన అందమైన ఫోటోతో ఎకౌంట్లు ఓపెన్ చేసి అమ్మాయిలు, మహిళలనే టార్గెట్ చేశాడు. ఆ తర్వాత వారిని ముగ్గులోకి దించి న్యూడ్ వీడియోకాల్స్, అసభ్య చాటింగ్ చేయడం వాటి ఆధారంగా బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదువు మానేశాడు. ఆ తర్వాత జల్సాల కోసం దొంగగా మారాడు. 2017లో చైన్ స్నాచింగ్., తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. చేసిన నేరాలు రుజువు కావడంతో రెండేళ్ల తర్వాత అంటే 2019లో బైయిల్ పై బయటకు వచ్చాడు.

  జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రూటు మార్చిన ఈ కేటుగాడు సోషల్ మీడియా ద్వారా చీటింగ్ చేయడం మొదలుపెట్టాడు. షేర్ చాట్ లో పరిచయమైన శ్రీనివాస్ అనే వ్యక్తికి హైదరాబాద్ లోని సచివాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి అతడి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఈ క్రమంలో గత నెల 29న ఓ చోరీ కేసులో ప్రసన్న కుమార్ ను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  పోలీసుల అదుపులో ప్రసన్నకుమార్

  ఇది చదవండి: తల్లి కళ్లలో ఆనందం చూడాలనుకోని కటకటాలపాలయ్యాడు.. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..!


  చోరీ కేసు విషయమై నాలుగు తగిలించగా పోలీసులకు షాకింగ్ నిజాలు చెప్పాడు. అతడు చెప్పిన మాటలు విని వారు విస్తుపోయారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, షేర్ చాట్, టిక్ టాక్ ఇలా సోషల్ మీడియాలో వివిధ పేర్లతో ఎకౌంట్ ఓపెన్ చేయడం.. అందమైన అమ్మాయిలు, మధ్య వయస్కులైన మహిళల ఫోటోలకు లైకులు కొట్టడం, కామెంట్లు పెట్టడం వంటివి చేసేవాడు. ఆ తర్వాత వారితో చాటింగ్ చేసి మెల్లగా ముగ్గులోకి దించేవాడు.

  ఇది చదవండి: ఒక్కరి సుఖం... నలుగురి ప్రాణాలు తీసింది... కుటుంబం ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజాలు...


  తనపై పూర్తిగా నమ్మకం కుదిరిందనుకున్న తర్వాత వారితో న్యూడ్ గా చాట్ చేయడం, కొంతమందిని అలాగే చేయమనడం చేసేవాడు. వాటిని రికార్డ్ చేయడం, న్యూడ్ కాల్స్ చేయని వారి వీడియోలను మార్ఫింగ్ చేసి సదరు ఫోటోలు, వీడియోలను వారికి పంపేవాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 మంది అమ్మాయిలు, మహిళలను బుట్టలో వేసుకొని వారిని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు తెలుస్తోంది. న్యూడ్ వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. పోలీసులు ప్రసన్న కుమార్ మొబైల్ చెక్ చేయగా అందులో పదులకొద్దీ అమ్మాయిలు, మహిళల న్యూడ్ వీడియోలు గుర్తించారు. అతడి నుంచి మొబైల్ ఫోన్ తో పాటు రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
  Published by:Purna Chandra
  First published: