Shocking:వీడో సోషల్ మీడియా రోమియో.. అమ్మాయిలు, మహిళలకు వల.., మొబైల్ ఫోన్లో షాకింగ్ వీడియోలు..

నిందితుడు ప్రసన్నకుమార్

Blackmailing: సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తి ఏకంగా వందలమంది అమ్మాయిలు, మహిళలకు వలపువల విసిరాడు.

 • Share this:
  సోషల్ మీడియాలో (Social Media) ఎవరితోనైనా స్నేహయం చేయవచ్చు. వారితో చాటింగ్, ఇష్టాఇష్టాలు పంచుకోవడం చాలా సులువు. దానిని అసరాగా చేసుకున్న ఓ కేటుగాడు అమ్మాయిలు, మహిళలకు వల వేశాడు. అలా వందల మందిని లైన్లో పెట్టాడు. ఆ తర్వాత వారి ప్రైవేట్ ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిల్ (Blackmailing) చేయడం మొదలుపెట్టాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో కటకటాల్లోకి వెళ్లాడు.. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా (Kadapa District) ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. ప్రశాంత్ రెడ్డి, రాజారెడ్డి, టోనీ అనే పేర్లు మార్చుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చైన్ స్నాచింగ్ లు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. ఐతే చోరీలు, చైన్ స్నాచింగులు చేసి బోర్ కొట్టిందేమోగానీ.. స్టైల్ మార్చాడు.

  సోషల్ మిడియాలో రోమియో అవతారం..
  ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్ట్రాగామ్ (Instagram), ట్విట్టర్‌(Twitter) లో పేర్లు మార్చి ఎకౌంట్లు ఓపెన్ చేసి... కేవలం అమ్మాయిలు, మహిళలకు మాత్రమే ఫ్రెండ్ రిక్వెస్టులు పంపేవాడు. ఇలా వారితో పరిచయం పెంచుకొని తియ్యగా మాట్లాడుతూ ముగ్గులోకిం దించేవాడు. పూర్తిగా తన మాయలో పడిపోయారనుకున్నవారితో న్యూడ్ వీడియో కాల్స్ చేయడం, అసభ్యంగా మాట్లాడటం వంటివి చేసేవాడు. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు.

  ఇది చదవండి: భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య... ఎంత కోపమొస్తే మాత్రం అలా చేస్తారా..?  వందలమంది బాధితులు
  ఈ క్రమంలో కృష్ణాజిల్లాకు (Krishna District) చెందిన ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి శారీరకంగా అనుభవించాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వందలాది మందిని బ్లాక్ మెయిల్ చేసి పదులకొద్ది అమ్మాయిలపై లైంగికదాడి చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ దొంగతనానికి సంబంధించిన కేసులో అరెస్ట్ చేసి విచారించగా.., దొంగతనాలతో పాటు ఇతడి బ్లాక్ మెయిలింగ్ బాగోతం కూడా వెలుగు చూసింది. తాజాగా కడప ఎస్పీ కేకే అన్బురాజన్ సిఫార్సు మేరకు కలెక్టర్ పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  ఇది చదవండి: ఆమెపాలిట శాపంగా మారిన పవర్ కట్... ఆ నలుగుర్ని ఏంచేసినా పాపం లేదు..  మొబైల్ ఫోన్ చూసి షాకైన పోలీసులు
  ప్రసన్నకుమార్ పై తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 26 కేసులు నమోదయ్యాయి. ఐదేళ్ల క్రితమే ఇతడిపై సస్పెక్ట్ షీట్ నమోదైంది. మహిళలతో చాటింగ్ చేస్తూ న్యూడ్ వీడియో కాల్స్ చేయడం వాటిని వారికి తెలియకుండా రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. కొందర్ని శారీరకంగా అనుభవించాడు. పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 మంది అమ్మాయిలు, మహిళలను బుట్టలో వేసుకొని వారిని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పోలీసులు ప్రసన్న కుమార్ మొబైల్ చెక్ చేయగా అందులో పదులకొద్దీ అమ్మాయిలు, మహిళల న్యూడ్ వీడియోలు గుర్తించారు.
  Published by:Purna Chandra
  First published: