ఆ కుటుంబంతో స్నేహం పెంచుకున్నాడు.. కొన్నాళ్ల తర్వాత వారి కూతుర్ని తీసుకెళ్లి దారుణంగా..

ప్రతీకాత్మక చిత్రం

అనేక విధాలుగా ఆ బాలికను లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. దీంతో..

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  ఇటీవల మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పెద్దవారి నుంచి అభం శుభం తెలియని చిన్నపిల్లలపైనా కామాంధులు కన్నేస్తున్నారు. తమ కోరిక తీర్చుకోవడానికి ఏమైన చేసేందుకు వెనుకాడడం‌ లేదు. ఒంటరిగా మహిళ కనిపడితే చాలు తమలోని మృగాడ్ని బయటకు తీసుకొస్తున్నారు. స్వాతంత్ర్య వచ్చిన నాడే గాంధీజీ చెప్పిన మాటలు మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే.., ఎప్పుడైతే అర్ధరాత్రి మహిళ ఒంటరిగా ఏ భయం‌ లేకుండా నడయాడగలుగుతుందో ఆనాడే నిజమైన స్వాతంత్ర్య వచ్చిందని భావించాలని ఆ మహాత్ముడు ఆనాడే చెప్పాడు. కానీ ప్రస్తుతం ఒంటరిగా మహిళను బయటకు పంపాలంటే తిరిగి సురక్షితంగా ఇంటికి వచ్చే వరకూ తల్లిదండ్రులు భయపడే పరిస్ధితికి వచ్చింది. చిన్నారులు అని కూడా చూడకుండా వారిపై కూడా తమ కామ కోరికలను తీర్చుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో 13 ఏళ్ళ తమ బాలికపై అత్యాచారం చేశారంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేయగా పరిచయస్తుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది.

  వివరాల్లోకి వెళ్తే.., మదనపల్లెలోని గౌతమి నగర్ కి చేందిన మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. కాగా బాలిక నివాసంకు సమీపంలో ఉంటే నరేష్(30) అనే వ్యక్తి ఆమె కన్నేసాడు. అనేక విధాలుగా ఆ బాలికను లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులతో సన్నిహితం పెంచుకున్నాడు. దీంతో ఆ బాలికకు దగ్గరయ్యాడు. ఆ బాలిక‌ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆమె కోసం ఏదోకటి చిరుతిండ్లు తెచ్చేవాడు. ఆ బాలికతో, బాలిక తల్లిదండ్రులతో కుటుంబ సభ్యుడిలాగా కలిసి పోయాడు. నరేష్ ఆ కుటుంబంతో ఏంతో నమ్మకంగా ఉన్నట్లు నమ్మించాడు. ఏ అవసరంమైనా తానే ఆ పని చేసుకొచ్చేవాడు. ఇలా కొద్ది రోజుల పాటు జరిగింది. ఇరుగు పొరుగు వారితో కూడా అదే తరహాలో నరేష్ మెలిగేవాడు.

  ఇది చదవండి: రమ్య కేసులో రోజుకో ట్విస్ట్.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు..


  ఈ క్రమంలో బాలికను నరేష్ ఇంటివద్ద వదిలిన తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లారు. ఇదే అదునుగా తీసుకున్న నరేష్ మైనర్ బాలికను చాక్లెట్, బిస్కట్స్ ,ఐస్ క్రీం,కొత్త బట్టలు తెచ్చిస్తానని మచ్చిక చేశాడు. ఎవరూ లేని సమయం కావడంతో బాలికను మాయమాటలతో లోబరుచుకున్నాడు. తాను చెప్పినట్లు చేయాలని, ఎవరికి చెప్పకూడని ముందే బెదిరించి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. తనను ఏం చేస్తున్నాడో కూడా తెలియని ఆ బాలిక నరేష్ ని ఎదురించలేక పోయింది. అప్పటి నుంచి ఆమె కడపునొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు మదనపల్లెలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆ బాలికను పరిక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు తెలియజేయడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నరేష్ చేసిన ఘాతుకాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించడంతో వారు మదనపల్లె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నరేష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: