హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minor Girl: ఆ నీచుడ్ని ఏం చేసినా తప్పులేదు.. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు..

Minor Girl: ఆ నీచుడ్ని ఏం చేసినా తప్పులేదు.. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Chittoor Girl: మహిళలపైనే కాదు.. మైనర్ బాలికలు., చిన్నారులపై కూడా నిత్యం లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం ఎరుగని చిన్నారులపై కొందరు మృగాళ్లు తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు.

GT Hemanth Kumar, News18, Tirupati

మహిళలపైనే కాదు.. మైనర్ బాలికలు., చిన్నారులపై కూడా నిత్యం లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం ఎరుగని చిన్నారులపై కొందరు మృగాళ్లు తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. తనకంటే దాదాపు 20 చిన్నదైన బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమె జీవితాన్ని నాశనం చేశాయి. లోకాన్ని తెలుసుకునే వయసులోనే మరో బిడ్డకు జన్మిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారి పల్లె పంచాయతీ దండపాణితోపు సమీపంలో  మైనర్ బాలిక కుటుంబం ఉంది. ఆమె రొంపిచర్ల పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. రొంపిచర్ల పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలోని పెద్దమ్మ ఇంటిలో ఉంటూ అక్కడి నుంచే స్కూల్ కి వెళ్తోంది.

ఇదిలా ఉంటే పీలేరు మండలం ఎర్రగుంట పల్లెకు చెందిన రాజేష్ నాయక్ అనే వ్యక్తి మైనర్ బాలిక పెద్దమ్మ ఇంటిలో ఎలక్ట్రీషియన్ పనిచేసేందుకు వచ్చి ఆ బాలికను మాయమాటలు చెప్పి వశపరచుకున్నాడు. రాజేష్ నాయకులకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే తాము ఇరువురు గడిపిన వీడియోను సోషల్ మీడియాలో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకి పాల్పడి చివరికి ఆ మైనర్ బాలికను తల్లిని చేశాడు. రెండు రోజుల క్రితం ఆ మైనర్ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఇది చదవండి: మరిదితో వదిన ఎఫైర్.. ఇది తెలిసిన అన్న ఏం చేశాడంటే..!


దీంతో దిక్కుతోచని తల్లిదండ్రులూ ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో చివరకు రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురి జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుడిని వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. ఈ మేరకు రొంపిచర్ల ఎస్ఐ వెంకటేశ్వరులు మైనర్ బాలిక ఇంటి వద్దకు వెళ్లి విషయాలు అడిగి తెలుసుకున్నారు. మైనర్ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇది చదవండి: బాగా చదవడం కూడా తప్పేనా.. పాపం ఆ చిట్టితల్లి మనసు ఎంత గాయపడిందో..!


చిత్తూరు జిల్లాలోనే ఇటీవల ఓ మైనర్ బాలిక స్కూల్ ప్రిన్సిపాల్ వేధింపులకు బలైన సంగతి సంచలనం సృష్టించింది. పలమనేరుకు చెందిన బాలిక పదో తరగతి చదువుతుండగా.. ఆమె స్నేహితురాలి తండ్రి బాగా చదవొద్దని ప్రిన్సిపాల్ ద్వారా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అకారణంగా టీసీ ఇచ్చి పంపేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

First published:

Tags: Andhra Pradesh