హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cheater Arrested: బట్టతలకు విగ్గుపెట్టి 30 మంది యువతులను పడేశాడు... చివరకు ఇలా చిక్కాడు...

Cheater Arrested: బట్టతలకు విగ్గుపెట్టి 30 మంది యువతులను పడేశాడు... చివరకు ఇలా చిక్కాడు...

చిత్తూరులో ఘరానా మోసగాడు అరెస్ట్..

చిత్తూరులో ఘరానా మోసగాడు అరెస్ట్..

Matrimony Cheating: ఈ రోజుల్లో మంచి సంబంధాల కోసం కొందరు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారి బలహీనతను ఓ కేటుగాటు ఆసరాగా తీసుకున్నాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 30 మంది యువతులను తన వలలో వేసుకున్నాడు.

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

పెళ్లి (Marriage). ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. యువతీయువకులు మంచి గుణగణాలున్న భాగస్వామి కావాలని కలలుగంటారు. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు తమ కుమార్తెకు మంచి ఉద్యోగం, సుగుణాలున్న వాడ్ని భర్తగా తీసుకురావాలని భావిస్తుంటారు. అందుకోసం మ్యాట్రిమోనీ సైట్లను (Matrimony Websites) ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారి బలహీనతను ఓ కేటుగాటు ఆసరాగా తీసుకున్నాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 30 మంది యువతులను తన వలలో వేసుకున్నాడు. వారు నుంచి కోట్లలో దోచేశాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు (Chittoor) నగర శివారులోని మరకంబట్టు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి వాహనాని చెక్ చేయగా అందులో నాలుగు కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించారు. అప్పటికే అతడిపై చీటింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు.

చిత్తూరు సమీపంలోని ఎన్.ఆర్ పేటకు చెందిన యువతికి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమయ్యాడు. వెబ్ సైట్లో ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెతో మాట్లాడాడు. మ్యాట్రిమోనీ సైట్ లో మీ ప్రొఫైల్ చూశానని ఆమెను ముగ్గులోకి దించాడు. అంతేకాదు బట్టతలకు విగ్గుపెట్టి అందగాడిలా కటింగ్ ఇచ్చాడు. తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని.. ఏడాదికి 20 లక్షలకు పైగా జీతమొస్తున్నట్లు ప్రొఫైల్ లో ఉండటం ఆ యువతి నమ్మింది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఉన్నట్లుండి ఆమెకు ఓ రోజు ఫోన్ చేసి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఏడుస్తూ మాట్లాడుతూ రూ.1.40 లక్షలు మరో యువతి ఖాతాలో వేయించాడు. ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఇది చదవండి: తెలిసినవాడే కదా అని బైక్ ఎక్కిన యువతి.. గంట తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికెళ్లింది.. మధ్యలో ఏం జరగిందంటే..

శ్రీనివాస్ చిత్తూరుకు చెందిన బాధిత యువతితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 30 మంది యువతులను మోసం చేశాడు. కొందరి వద్ద ఉద్యోగాలిప్పిస్తానని కూడా డబ్బులు వసూలు చేశాడు. ఇలా దాదాపు రూ.3 కోట్ల వరకు యువతులను చీట్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఇది చదవండి: పెళ్లై 12ఏళ్లైనా వేర్వేరు గదుల్లో భార్యాబర్తలు... కానీ ఓ రోజు రాత్రి ఊహించని ఘటన...


ఒంగోలుకు చెందిన ఐటి ఉద్యోగిని వద్ద నుంచి రూ.27 లక్షలు, నరసారావు పేట ఉద్యోగిని నుంచి రూ.40 లక్షలు, మదనపల్లెకు చెందిన యువ వైద్యురాలి వద్ద నుంచి రూ.7 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. ఇలా వచ్చిన డబ్బుతో తాను జల్సాలు చేసుకునేవాడు. అలాగే ఒక్కో అమ్మాయికి ఒక్కో మొబైల్ నెంబర్ వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈజీ మనీ కోసం గంజాయి కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అనంతరం శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించారు. మ్యాట్రిమోనీ సైట్లలో సంబంధాలు చూసే ముందు యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

First published:

Tags: Andhra Pradesh, Cheating, Chittoor, Tirupati

ఉత్తమ కథలు