తండ్రిలాంటి వాడని అతడి బైక్ ఎక్కింది.. కానీ ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేకపోయింది..

ప్రతీకాత్మక చిత్రం

ఇంటికి వెళ్లే మార్గ మధ్యంలోని అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి...

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  కామంతో కళ్ళు మూసుకుపోయి... వావివరసలు మరచిపోతున్నారు దుర్మార్గులు. ఆడబిడ్డలను బయటకు పంపాలంటేనే భయపడాల్సిన కాలం ఇది. సమీప బంధువే కదా అని చిన్నారులను పంపితే క్షేమంగా తిరిగి వస్తారా..? రారో..? తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక బంధువులను నమ్మి వారితో పంపించాలన్న భయపడాల్సి వస్తుంది. ఎవరి మదిలో ఎలాంటి విషపు ఆలోచన దాగి ఉందో..! ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉందో ముందే గ్రహించడం చాల కష్టంగా మారుతోంది. చట్టాలు ఎన్ని అమలు చేసిన మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. బంధువే కదా అని రేషన్ సరుకుల కోసం తమ కుమార్తెను పంపారు తల్లితండ్రులు. వరుసకు పెద్దనాన్నతో రేషన్ షాపుకు వెళ్ళింది ఆ బాలిక. ఐతే ఆ కామాంధుని కన్ను కూతురు వరుసైన ఆ బాలికపై పడింది. పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇంట్లో చెప్పలేక…మనసులో పెట్టుకోలేక మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన పాల్పడిన ఘటన తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

  వివరాల్లోకి వెళితే...నిమ్మనపల్లె మండలం, గౌనిగానిపల్లెలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తల్లి తండ్రులతో కలసి జీవనం సాగిస్తోంది. రేషన్ సరుకుల కోసం పక్క గ్రామమైన ముష్టురుకు వెళ్లాల్సిఉంది. వరుసకు పెద్దనాన్న అయిన గంగులప్పతో ఆ మైనర్ బాలికను పంపించారు తల్లితండ్రులు. రేషన్ బియ్యం, సరుకులు తీసుకోని తిరుగు ప్రయాణం అయ్యారు. గంగులయ్యకు అప్పటికే పెళ్ళై ఇద్దరు కుమార్తెలు., ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడికి రెండేళ్ల క్రితం వివాహం చేశాడు. ఐతే బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు.., ఇంటికి వెళ్లే మార్గ మధ్యంలోని అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు.

  ఇది చదవండి: బాయ్ ఫ్రెండ్ కు న్యూడ్ వీడియోలు పంపిన యువతి.. కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పిందని సోషల్ మీడియాలో...


  ఇందేంటి పెద్దనాన్న అని ఆ యువతి ప్రశ్నించడంతో తన కోరిక తీర్చాలని ఆమెను బెదిరించాడు. దీంతో ఆ యువతి గెట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. కానీ ఆ సమయంలో ఆ దారిన ఎవరూ లేక‌ పోవడంతో ఆ యువతి కేకలు వృథా అయ్యాయి. అయినా ధైర్యం వదలకుండా ఆ కామాంధుడి చర నుండి తప్పించుకుని తమ గ్రామం‌ వైపు పరుగులుతీసింది. ఎలాగొలా ఆ కామాంధుడి బారినుండి తప్పించుకొని ఇంటికి చేరుకుంది.

  ఇది చదవండి: మత్స్యకారుడికి జాక్ పాట్.. వలకు చిక్కిన లక్షరూపాయల చేప... దాని స్పెషాలిటీ ఇదే..!


  అయితే విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టిన బాలిక.. జరిగిన అఘాయిత్యాన్ని తలుచుకొని సబ్బు నీళ్ళు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ఎందుకు యత్నించావని తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన ఘోరాన్ని వివరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
  Published by:Purna Chandra
  First published: